https://oktelugu.com/

Japan : జపాన్ మహిళలకు బంపర్ ఆఫర్.. గ్రామాల్లో యువకులను పెళ్లి చేసుకునేందుకు కొత్త పథకం

టోక్యోలో వలస వచ్చిన యువతుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు తక్కువగా ఉన్నారని జపాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకంపై విమర్శలు వస్తున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : August 31, 2024 / 08:31 PM IST

    Japanese women

    Follow us on

    Japan : ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా చైనా అవతరించింది. అయితే ప్రస్తుతం జనాభా తగ్గిపోవడంతో యువత పెళ్లి చేసుకోవడానికి పథకాలు తీసుకొచ్చింది. మారిన జీవనశైలి, పట్టణ లైఫ్‌కి అలవాటు పడిపోవడం, రిలేషన్‌లో కంటే ఒంటరిగానే జీవితం బాగుందని భావించి చాలా మంది యువత పెళ్లికి నిరాకరిస్తుంది. అయితే ఈ మధ్య జపాన్‌లో కూడా జనాభా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో జనాభా సంఖ్యను పెంచేందుకు ఆ దేశం కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ పథకం ఏంటి? మహిళలకు ఆ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మరి తెలుసుకుందాం.

    సాధారణంగా ఎక్కడైనా ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తారు. అక్కడే ఇక సెటిల్ అవుతారు. జపాన్‌లో కూడా ఇదే తరహా జరిగింది. ప్రస్తుతం జపాన్‌లో కూడా రోజురోజుకి జనాభా తగ్గిపోతుంది. ముఖ్యంగా యువతులు ఎక్కువగా పట్టణాలకు వెళ్లి అక్కడ యువకులనే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో యువతుల జనాభా తగ్గిపోతుంది. దీంతో మహిళలకు ఓ వినూత్న పథకం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. టోక్యోలో ఒంటరిగా ఉండే యువతులు గ్రామీణ ప్రాంతాల్లోని యువకులను పెళ్లి చేసుకుని, అక్కడే సెటిల్ అయితే వాళ్లకు డబ్బులు ఇవ్వనుంది. పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి మహిళ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి కావాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. పూర్తిగా అక్కడే ఉండిపోతే.. 6000000 యెన్ అంటే 4140 డాలర్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం 2025 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించాలని జపాన్ ప్రభుత్వం చూస్తోంది.

    టోక్యోలో వలస వచ్చిన యువతుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు తక్కువగా ఉన్నారని జపాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకంపై విమర్శలు వస్తున్నాయి. మహిళలు వాళ్లకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇలా పథకం పేరుతో బలవంతంగా గ్రామాలకు పంపించడం ఏంటని కొందరు అంటున్నారు. గ్రామాల్లో స్త్రీ పురుష నిష్పత్తిని సమానం చేయడం కోసం మహిళలకు ఇలా డబ్బులు ఇచ్చి పంపించడం ఏంటని మండిపడుతున్నారు. అయితే ఇందులో మహిళల ఇష్టాలను మార్చుకోమని ప్రభుత్వం చెప్పడం లేదు. గ్రామీణ ప్రాంతంలో ఉండే లోటును తీర్చాలని అనుకుంటుంది. దీనికోసం ఒంటరిగా జీవించే మహిళలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే యువతుల సంఖ్య పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ పథకం తీసుకొస్తుంది. ఆ గ్రామాల్లో కూడా ఏదైనా ఉపాధి కల్పించేవి చేయడానికి ప్రభుత్వం నగదు రూపంలో సాయం చేస్తుంది. కానీ అమ్మాయిలను వస్తువుగా చూస్తున్నారని, వాళ్ల స్వాతంత్ర్యానికి ఇది చాలా వ్యతిరేకమని కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. మరి ఈ పథకం అమలు అవుతుందో లేదో చూడాలి. అయితే ఈ పథకంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.