Israel War Impact on Indian: ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంతో ఆయా దేశాల్లో పనుల కోసం, చదువల కోసం వెళ్లిన ఇతర దేశాల వారు ఆందోళ చెందుతున్నారు. భయం భయంగా జీవినం సాగిస్తున్నారు. ఎప్పుడు బాంబు నెత్తిమీద పడుతుందో అన్న టెన్షన్ వారిని వెంటాడుతోంది. ఇప్పటికే చాలా మంది తమను తీసుకెళ్లాలని కోరుతున్నారు. మరోవైపు భారత్ కూడా ఆపరేషన్ సింధు పేరుతో ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారతీయులను తీసుకువచ్చే ప్రయత్నం చేసోతంది. ఈ క్రమంలో తెలంగాణ వాసి ఇజ్రాయెల్‌లో గుండెపోటుతో మృతిచెందాడు.
తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన 57 ఏళ్ల రెవెల్లా రవీందర్, ఉపాధి కోసం రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్‌కు వలస వెళ్లారు. ఆయన జూన్ 16, 2025న గుండెపోటుతో తెల్ అవీవ్‌లోని సౌరస్కీ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రి బంకర్‌లో ఆయన చివరి రోజులు గడిపారని సమాచారం.
Also Read: Iran vs Israel War: ఇరాన్-ఇజ్రాయెల్.. భారత్ మద్దతు ఎటువైపు!
మృతదేహం తలరింపునకు ఆటంకాలు..
ఇరాన్–ఇజ్రాయెల్ సంఘర్షణ కారణంగా ఇజ్రాయెల్‌లో విమానాశ్రయాలు మూసివేయడంతో రవీందర్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సాధారణంగా ఐదు రోజులలో మృతదేహ రవాణా సాధ్యమైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చని ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు సోమ రవి తెలిపారు.
సాయం కోసం వేడుకోలు..
రవీందర్ కుటుంబానికి ఏకైక ఆదాయ వనరు కావడంతో, ఆయన మరణం కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. ఆయన కుమారుడు వికలాంగుడు కావడంతో కుటుంబం అదనపు సవాళ్లను ఎదుర్కొంటోంది. రవీందర్ భార్య విజయలక్ష్మి, కుమార్తె అకాంక్ష, మృతదేహ రవాణా, ఆర్థిక సహాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సహాయం అందించాలని కోరుతున్నారు.
ప్రభుత్వం, సంస్థల సహకారం
ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్, భారత రాయబార కార్యాలయం మృతదేహ రవాణాకు అవసరమైన పత్రాలను సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విదేశాల్లోని తెలంగాణ వలసదారుల సహాయం కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. కుటుంబం ఈ క్లిష్ట సమయంలో త్వరిత సహాయం కోసం ఆశిస్తోంది.
Also Read: Modi On Israel Iran War: ఇజ్రాయోల్ ఇరాన్ యుద్ధంపై స్పందించిన మోదీ.. ఎమన్నాడంటే..
సంప్రదించాల్సిన వివరాలు
తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ హెల్ప్‌లైన్: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్‌లను సంప్రదించవచ్చు.
భారత రాయబార కార్యాలయం, తెల్ అవీవ్: మృతదేహ రవాణాకు సంబంధించిన సమాచారం కోసం సంప్రదించవచ్చు.
ఇజ్రాయెల్‌లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి
జగిత్యాల నుండి ఇజ్రాయెల్‌కు వలస వెళ్లిన రెవెల్లా రవీందర్ అనే వ్యక్తి అక్కడే గుండెపోటుతో మృతి
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురాడానికి ఇబ్బంది పడుతున్న కుటుంబసభ్యులు
దీంతో ప్రభుత్వాన్ని సాయం కోసం… pic.twitter.com/TiPWmlw8Y7
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2025