Israel vs Hezbollah War: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హిజ్‌బొల్లా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా లెబనాన్‌లో హిజ్‌బొల్లాకు చెందిన వందలాది పేజర్లు ఒక్కసారిగా పేలాయి. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని హిజ్‌బొల్లా ఆరోపిస్తోంది. ప్రతీకారాం తీర్చుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా పేలుళ్లపై అలర్ట్ అయింది.
హమాస్ అంతమే లక్ష్యంగా యుద్ధం మొదలు పెట్టిన ఇజ్రాయెల్‌కు తర్వాత ఇరాన్‌తోపాటు, హిజ్‌బొల్లా శత్రువుగా మారాయి. హమాస్ చీఫ్ హత్యతో ఇరాన్, హిజ్‌బొల్లా హమాస్‌కు అండగా నిలిచాయి. ప్రతీకారం తీర్చుంటామని ఇరాన్‌తోపాటు హిజ్‌బొల్లా హెచ్చరించాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌తో యుద్ధానికి కాలుదువ్వుతున్న మిలిటెంట్ సంస్థ హిజ్‌బొల్లాకు ఇప్పుడు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ ఉపయోగిస్తున్న వందలాది పేజర్లు ఒకేసారి పేలిపోయాయి. దీంతో హిజ్‌బొల్లాకు తీవ్ర నష్టం జరిగింది.
ఇజ్రాయెల్‌కు చిక్కకుండా..
హిజ్‌బొల్లా, హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌కు చిక్కకుండా ఉండేందుకు పేజర్లు వాడుతున్నారు. సెల్‌ఫోన్‌లు వాడితే వాటిలో జీపీఎస్, సిమ్‌కార్డు ఉంటుంది. దీంతో ఈజీగా గుర్తించే అవకాశం ఉండడంతో పేజర్లను సమాచారం కోసం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే తైవాన్ సంస్థ గోల్డ్ అపోలోకు చెందిన 3 వేల పేజర్లను లెబనాన్ దిగుమతి చేసుకుంది. వాటిలో అత్యధికంగా ఆ కంపెనీకి చెందిన పీ924 మోడల్‌కు చెందినవే. దీంతోపాటు మరో మూడు మోడల్స్‌కు చెందిన పేజర్లను హిజ్‌బొల్లా వాడుతోంది.
బ్యాటరీ పక్కన పేలుడు పదార్థం..
అయితే ఈ పేజర్లలో మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాన్ని బ్యాటరీ పక్కన అమర్చినట్లు యూరోపోల్‌కు సైబర్ అడ్డయిజర్ మిక్కో హైపోనూన్ తెలిపారు. తయారీ సమయంలో లేదా సరఫరా సమయంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థలు అమర్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయోల్ నిఘా సంస్థల హస్తం ఉన్నట్లు హిజ్‌బొల్లా కూడా అనుమానిస్తోంది. ఇదిలా ఉంటే పేజర్ల పేలుడు ఘటనలో 3 వేల మంది గాయపడ్డారు. 9 మంది మరణించారు. గాయపడినవారిలో 200 మంది పరిస్థితి విషమంగా ఉంది.
ప్రతీకార దాడులు తప్పవా?
పేజర్ల పేలుడు ఘటన నేపథ్యంలో ప్రతీకారానికి హిజ్‌బొల్లా సిద్ధమవుతోంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా చేసింది. అత్యాధునిక టెక్నాలజీలో ఇజ్రాయెల్ పేజర్లును పేర్చిందని హిజ్‌బుల్లా భావిస్తోంది. మరోవైపు హిజ్‌బుల్లా హెచ్చరికలతో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.