Israel Iran Conflict : ఇప్పటికే సోవియట్ దేశం – ఉక్రెయిన్ యుద్ధం రావణ కాష్టం లాగా రగులుతూనే ఉంది.. ఇది ఎప్పటికి ముగిసిపోతుందో తెలియడం లేదు. ఇప్పటికే ఈ దారుణం వల్ల రెండు దేశాలకు చెందిన వేలాదిమంది సైనికులు చనిపోయారు. లక్షల కోట్లల్లో నష్టం వాటిల్లింది. ఇటీవల జరిగిన దాడిలో రష్యా తీవ్రంగా నష్టపోయింది. ఉక్రెయిన్ పై అదే స్థాయిలో దాడి చేసింది.
రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మర్చిపోకముందే ఇటీవల కాలంలో అమెరికా సిరియాపై బాంబుల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఇజ్రాయిల్ పాలస్తీనా పై, దాని శత్రు దేశాలపై ఒక్కసారిగా విరుచుకుపడింది. పాలస్తీ నాకు సహాయం చేస్తున్న ఇతర దేశాలపై కూడా తీవ్రస్థాయిలో బాంబుల వర్షం కురిపించింది. హమాస్ ఉగ్రవాదులపై కూడా రెచ్చిపోయింది. బీభత్సంగా దాడులు చేస్తూ మట్టు పెడుతోంది. అయితే ఇప్పుడు ఇజ్రాయిల్ మరో భీకర దాడికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్ ఇరాన్ పై దాడులకు పాల్పడింది. తమ శత్రుదేశం పాలస్తీ నాకు సహాయం చేస్తోందని.. తమపై కుట్రలకు పాల్పడుతోందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. అందువల్లే ఇరాన్ పై దాడులు చేసింది. ఆదేశానికి తీవ్రస్థాయిలో నష్టం కలగజేసింది. ముఖ్యంగా ఇరాన్ దేశంలోని ప్రధాన నగరాలలో ఇజ్రాయిల్ డ్రోన్ల సహాయంతో దాడులు చేసింది. క్షిపణులు ప్రయోగించి భారీ స్థాయిలో నష్టం కలుగజేసింది. ఇది ఇరాన్ దేశానికి తీవ్రస్థాయిలో నష్టం కలగజేసింది. దీంతో ఇరాన్ తీవ్రంగా స్పందించడానికి రెడీ అవుతోంది.
ఇలాంటి దేశంలో ఇటీవల నేతాన్యాహూ పరిపాలనలో ఉన్న దేశం చేసిన దాడులకు ప్రతిగా గట్టి కౌంటర్ ఇవ్వాలని ఇరాన్ భావిస్తోంది. ఇందులో బాగానే జంకరన్ మసీదు మీద ఎరుపు రంగు జెండా ఎగరవేసింది. తీవ్ర స్థాయిలో దుఃఖం, ప్రతీకారం వంటి సంకేతాలను బలంగా చూపించడానికి ఇటువంటి జెండాలను ఎగరవేస్తారు. ఒక రకంగా ఇజ్రాయిల్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ ఇలాంటి ఎరుపు రంగు జెండా ఎగరవేసిందని తెలుస్తోంది. ఈ ప్రకారం చూసుకుంటే ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య భీకరమైన దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సైన్యం పరంగా చూసుకుంటే ఇరాన్ కంటే ఇజ్రాయిల్ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. వారు యుద్ధ రంగంలోకి దిగితే భీకరంగా దాడులు చేస్తారు. ఇటీవల ఈ అనుభవం సిరియా, హమాస్ ఉగ్రవాదులకు అనుభవంలోకి వచ్చింది. పైగా హమాస్ ఉగ్రవాదులను కిరణ్ భూభాగంలోనే ఇజ్రాయిల్ మట్టు పెట్టింది. ఈ రకంగా చూస్తే ఇజ్రాయిల్ నుంచి ఇరాన్ దేశానికి తీవ్రమైన ప్రతిఘటన తప్పదని తెలుస్తోంది. దీనికి తోడు అత్యంత పట్టిష్టమైన గగనతల రక్షణ వ్యవస్థను ఇజ్రాయిల్ కలిగి ఉంది. అలాంటప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ మీద ఎలాంటి దాడులు చేస్తుందనేది చూడాల్సి ఉంది. దీనిని ఇజ్రాయిల్ ఏ విధంగా అడ్డుకుంటుంది అనేది కూడా గమనించాల్సి ఉంది. అయితే ఈ పరిణామాలను ప్రపంచ దేశాల అధినేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు.