spot_img
Homeఅంతర్జాతీయంISIS plot foiled in America: అమెరికాలో ఐసిస్‌ కుట్ర భగ్నం.. దాడికి ముందే ముగ్గురి...

ISIS plot foiled in America: అమెరికాలో ఐసిస్‌ కుట్ర భగ్నం.. దాడికి ముందే ముగ్గురి అరెస్ట్‌!

ISIS plot foiled in America: అగ్రరాజ్యం అమెరికాలో సైనికులు, వారి కుటుంబాలను టార్గెట్‌ చేసిన ముగ్గురు యువకుల అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాన్సస్, కాలిఫోర్నియా నగరాల్లో జాయింట్‌ ఆపరేషన్‌ ద్వారా ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూఐసిస్‌(ఇస్లామిక్‌ స్టేట్‌) సంస్థతో సంబంధాలు పెట్టుకుని, అమెరికా సైనికులు, వారి కుటుంబాలపై దాడులు చేయాలని కుట్ర చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడులు జరిగే ముందే అమెరికా ఫెడరల్‌ ఏజెన్సీలు వారిని అరెస్టు చేయడంతో పెద్ద సంక్షోభం నివారించబడింది.

ఆఫ్రికా దేశాల నుంచి వచ్చి..
అమెరికా పోలీసులు అరెస్టు చేసిన వారుమిషాన్‌ గఫూర్, శంశలుద్దీన్, బిరేన్‌ జాయి ముగ్గునూ 21 ఏళ్ల వయస్సు గల యువకులు. వీరంతా ఆఫ్రికన్‌ దేశాల నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడినవారు. ఐసిస్‌ సంస్థతో సంబంధాలు పెట్టుకుని, సోషల్‌ మీడియా, డిస్కార్డ్‌ చాట్‌ల ద్వారా కమ్యూనికేషన్‌ చేసుకుంటూ దాడి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారు అమెరికాలోని సైనిక స్థావరాలు, సైనికులు నివసించే ప్రాంతాలు, వారి కుటుంబ సభ్యులను టార్గెట్‌ చేసి దాడి చేయాలని భావించినట్లు తెలుస్తోంది.

కుట్రను బయటపెట్టిన అమెరికా భద్రతా ఏజెన్సీలు
సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ చాట్‌లపై నిఘా పెట్టడం ద్వారా ఈ కుట్రను గుర్తించి, సకాలంలో ఆపరేషన్‌ నిర్వహించి ముగ్గురినీ అరెస్టు చేశాయి. ఐసిస్‌ సంస్థ భౌతికంగా బలహీనపడినప్పటికీ, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దాడులు లేదా చిన్న సెల్‌ల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న వాస్తవాన్ని మరోసారి బయటపెడుతోంది. ఆఫ్రికన్‌ దేశాల నుంచి వలస వచ్చిన యువకులు ఆన్‌లైన్‌ ద్వారా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకోవడం ఇటీవలి కాలంలో పెరిగిన ట్రెండ్‌గా మారింది. అమెరికా భద్రతా సంస్థలు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటన అమెరికాలో ఉగ్రవాద బెదిరింపులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని మరోసారి గుర్తు చేస్తోంది. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా యువకులను సులభంగా రిక్రూట్‌ చేసే ఐసిస్‌ లాంటి సంస్థల వ్యూహాలకు భద్రతా ఏజెన్సీలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ కేసు హైలైట్‌ చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular