Iraq Viral Video: ఈ రోజుల్లో తొందరగా కంటే ఆలస్యంగానే చాలా మంది వివాహాలు చేసుకుంటున్నారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో ఓ 9 ఏళ్ల చిన్నారి గర్భం దాల్చిన వీడియో వైరల్ అవుతోంది. బాల్య వివాహాలను ఎప్పటి నుంచో అరికట్టారు. అసలు వీటి ప్రస్తావన ఉండకూడదని ప్రతీ దేశంలో వీటికి విరుద్ధంగా కొన్ని చట్టాలను కూడా తీసుకొచ్చారు. అయితే ఇరాక్‌కి చెందిన ఓ 9 ఏళ్ల బాలిక ప్రెగ్నెంట్ వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది. ఇంత చిన్న వయస్సులో గర్భం దాల్చడం ఏంటని, ఆ అమ్మాయిని చూస్తే అలా చేయాలని ఎలా అనిపించిందని నెటిజన్లు మండిపడుతున్నారు. డబ్బులు, బంగారానికి ఆశపడి ఆ 9 ఏళ్ల జహీరాను తన తండ్రి మామ స్నేహితుడికి ఇచ్చి వివాహం చేశాడు. జహీరాకి 6 ఏళ్లు వయస్సు ఉన్నప్పుడు 51 ఏళ్ల వయస్సు ఉన్న ఖుషాముద్దీన్‌కి ఇచ్చి వివాహం చేశారు. ఇంత ముసలివాడికి చిన్నారిని ఇచ్చి తన జీవితాన్ని బలి చేశారు. జహీరా గర్భం మీద చేయి వేసుకుని డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నెటిజన్లు తెగ మండిపడుతున్నారు.
ये 9 साल की जाहिरा हामिला है
जाहिरा इराक के बगदाद के नजदीक
एक गांव में एक मज़दूर के घर पैदा हुईं थीपरिवार में हुए एक निकाह के दौरान जाहिरा के फुफ्फु के दोस्त खुशमुद्दीन की नज़र जाहिरा पर पड़ी जाहिरा उस वक्त मात्र 6 साल की थी
खुशमुद्दीन ने जाहिरा से निकाह के लिए उसके अब्बू से… pic.twitter.com/vtPoobFo76
— नाज़नीन अख्तर (भारती 🇮🇳) (@NaazAkhtar01) November 18, 2024
సాధారణంగా ఎక్కడైనా మహిళల వివాహ వయస్సు 18 ఏళ్లు ఉంటుంది. ఇప్పుడు కొన్ని దేశాల్లో అయితే 21కి పెంచాలని భావిస్తున్నారు. అయితే ఇరాక్‌లో మాత్రం అమ్మాయిల వివాహ వయస్సు 9 ఏళ్లు మాత్రమేనట. ఇంత చిన్న వయస్సులోనే అమ్మాయిలకు వివాహం చేయవచ్చనే చట్టం తీసుకొచ్చారట. ఈ చట్టంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు తలెత్తుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ జహీరా వీడియో ఫేక్ అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కావాలనే వైరల్ కావడానికి ఇలా చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ఇంత చిన్న వయస్సులో ఆ బాలికను ఇలా చేయడం కరెక్ట్ కాదని, మృగాలుగా మారుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.
తొమ్మిదేళ్ల వయస్సులో గర్భం దాల్చడం అంటే ఆ అమ్మాయికి పెద్దగా ఏం తెలియదు. చిన్న వయస్సులో గర్భం దాల్చితే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపణులు హెచ్చరిస్తున్నారు. డెలివరీ సమయంలో బాడీ కూడా సపోర్ట్ చేయదు. దీనివల్ల కొన్నిసార్లు తల్లి, బిడ్డ ఇద్దరూ చనిపోయే ప్రమాదం ఉంటుంది. బాల్య వివాహాలు చేస్తే కఠినంగా శిక్షించే మరిన్ని చట్టాలు తీసుకురావాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ 5జీ జనరేషన్‌లో కూడా ఇంకా బాల్య వివాహాలు చేస్తూ.. అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇకనైనా వాటికి చెక్ పెట్టే విధంగా ప్రతీ దేశం కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. అప్పుడే ఈ బాల్య వివాహాలను అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది.