Homeఅంతర్జాతీయంDonald Trump Iran Conflict Public Reaction: ఇరాన్‌–అమెరికా వార్‌.. ట్రంప్‌కు షాక్‌ ఇచ్చిన ప్రజలు!

Donald Trump Iran Conflict Public Reaction: ఇరాన్‌–అమెరికా వార్‌.. ట్రంప్‌కు షాక్‌ ఇచ్చిన ప్రజలు!

Donald Trump Iran Conflict Public Reaction: ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేస్తుందన్న సాకుతో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పశ్చిమాసియాలో అగ్గి రాజేశాడు. మంట మొదలు పెట్టాడు కానీ ఆర్పడం ఎలాగో తెలియక సతమతమవుతున్నాడు. 25 రోజులకుపైగా ఇరాన్‌ అమెరికా–ఇజ్రాయెల్‌ దాడులను తట్టుకుని నిలబడడంతోపాటు అమెరికాకు మద్దతు ఇస్తున్న గల్ఫ్‌ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌పైనా మిస్సైల్స్‌ ప్రయోగిస్తోంది. దీంతో ట్రంప్‌ దిగిరాక తప్పని పరిస్థితి నెలకొంది. యుద్ధం కారణంగా ఆయిల్‌ సంక్షోభం తలెత్తడం, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలడం, గల్ప్‌ దేశాలు ఆర్థికంగా నష్టపోతుండడంతో ప్రపంచ దేశాల నుంచి అమెరికాపై ఒత్తిడి పెరిగింది. దీంతో ట్రంప్‌ మొదట 48 గంటలు, తర్వాత 5 రోజులు, తాజాగా పది రోజులు దాడులకు విరామం ప్రకటించారు. ఈ పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై తీసుకున్న కఠిన నిర్ణయాలు సొంత ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఫాక్స్‌ న్యూస్‌ జరిపిన తాజా సమీక్షలో ట్రంప్‌ నాయకత్వాన్ని 59 మంది వ్యతిరేకించారు. వీరిలో 47 శాతం మంది ట్రంప్‌ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. కేవలం 41 శాతం మందే ట్రంప్‌కు మద్దతు పలికారు.

విదేశాంగ విధానంపై విమర్శలు..
ట్రంప్‌ విదేశ విషయాల చర్యలను 62 శాతం మంది తిరస్కరించారు. ముఖ్యంగా ఇరాన్‌తో పెరిగిన ఘర్షణల్లో న్యూక్లియర్‌ డీల్‌ ఉల్లంఘన, సైనిక ఆపరేషన్లు ఆయన వ్యవహారానికి 64 శాతం మంది నిరాకరించారు. డెమోక్రట్లలో 85% మంది, స్వతంత్రులలో 60% మంది ఈ విధానాలను తప్పుపట్టారు. రిపబ్లికన్లలో కూడా మద్దతు 55%కి పరిమితమైంది.

ట్రంప్‌ ఆధిక్యతపై ప్రభావం
ఈ ఫలితాలు ట్రంప్‌ ప్రభుత్వాన్ని గణనీయ దెబ్బ తీసాయి. యుద్ధ ఆకాంక్షలు ప్రజల్లో ప్రబలంగా లేకపోవటం, ఆర్థిక ఆందోళనలు (ఆయిల్‌ ధరల పెరుగుదల), మహిళలు, యువతలో అసంతృప్తి (70% పైగా) కారణాలుగా కనిపిస్తున్నాయి. గత సర్వేలతో పోలిస్తే ఆయన రేటింగ్‌ 5% పడిపోయింది, రాజకీయ ఒత్తిడి పెరిగింది.

ఈ ట్రెండ్‌ కొనసాగితే, కాంగ్రెస్‌లో డెమోక్రట్ల ప్రభావం బలపడి, ఇరాన్‌పై యుద్ధ నిర్ణయాలు ఆలస్యం కావచ్చు. ప్రజలు శాంతి చర్చలు కోరుకుంటున్నారు. మీడియా విశ్లేషణల ప్రకారం, ఈ సమీక్ష ట్రంప్‌ 2026 మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో ట్రంప్‌ పార్టీపై ప్రభావం చూపుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular