Homeఅంతర్జాతీయంIran thanking India Missile Message: ఇజ్రాయిల్, అమెరికా మీద దాడులు.. ఇండియాను నెత్తిన పెట్టుకున్న...

Iran thanking India Missile Message: ఇజ్రాయిల్, అమెరికా మీద దాడులు.. ఇండియాను నెత్తిన పెట్టుకున్న ఇరాన్

Iran thanking India Missile Message: ప్రస్తుతం జరుగుతున్న మిడిల్ ఈస్ట్ యుద్ధంలో భారతదేశానికి ప్రత్యక్షంగా గాని.. పరోక్షంగా గాని ఎటువంటి పాత్ర లేదు. భారతదేశం అనేది శాంతిని మాత్రమే కోరుకుంటుంది. ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న మన దేశం ఇంతవరకు ఏ దేశం మీద కావాలని దాడి చేయలేదు. అవసరాల కోసం ఏకపక్షంగా యుద్ధం చేయలేదు. శాంతిని మాత్రమే కోరుకుంది. సామరస్యాన్ని మాత్రమే కావాలని భావించింది. ఏనాడు కూడా సామ్రాజ్య వాదాన్ని కోరుకోలేదు.

Also Read: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాజీ ప్రేయసి.. రీ యూనియన్ అదిరిపోయింది..

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ యుద్ధంలో భారతదేశం ఎటువంటి పాత్ర పోషించడం లేదు. అయితే ఇరాన, అటు ఇజ్రాయిల్ భారతదేశానికి స్నేహ దేశాలుగా ఉన్నాయి. కాబట్టి భారత్ ఏ దేశం వైపు కూడా మొగ్గు చూపించలేదు. అలాగని యుద్ధాన్ని కూడా ఎంకరేజ్ చేయలేదు.. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి భారత్ ప్రస్తావన వచ్చింది. అది కూడా ఇరాన్ చేసింది. హర్ముజ్ జల సంధి నుంచి సరుకు రవాణా చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు సృష్టించబోమని ఇరాన్ భారత్ కు స్పష్టం చేసింది. అంతేకాదు చమురు, గ్యాస్ రవాణా విషయంలో కూడా సహకరిస్తామని వ్యాఖ్యానించింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సమయానికి ఇరాన్ ఒక రకమైన వర్తమానాన్ని పంపింది.

ఇరాన్ ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయిల్ మీద దాడులు చేస్తోంది. డ్రోన్, మిస్సైల్స్ ఉపయోగిస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని యుద్ధకాండ సాగిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ ప్రయోగించిన కొన్ని మిస్సైల్స్ “భారతదేశం, జర్మనీ ప్రజలకు ధన్యవాదాలు” వంటి సందేశాలు మోసుకెళ్లాయి. దీనిని విశ్లేషకులు ప్రతీకాత్మక సానుభూతి చర్యగా భావిస్తున్నారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో తీవ్రంగా దాడులు కొనసాగుతున్న క్రమంలో.. ఇరాన్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇండియాకు థాంక్స్ అంటూ ఒక సందేశాన్ని తన మిస్సైల్ ద్వారా బయటి ప్రపంచానికి చెప్పింది.

భారత్ ప్రత్యక్షంగా గాని.. పరోక్షంగా గాని ఇరాన్ దేశానికి సహకరించడం లేదు. అయితే ఇరాన్ దేశానికి అతిపెద్ద దిగుమతి దారు భారత్. ఇరాన్ చమురు.. గ్యాస్ ను భారత దేశానికి సరఫరా చేస్తూ ఉంటుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇరాన్ దేశంతో దౌత్య సంబంధాలు మెరుగుపడ్డాయి. గతంలో ఉన్న దానికంటే రెట్టింపు అయ్యాయి. దీనికి తోడు ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పటికీ.. భారత్ చూపించిన దౌత్య బంధాన్ని ఇరాన్ దూరం పెట్టలేకపోతోంది. అందువల్లే చమురు, గ్యాస్ సరఫరా చేస్తోంది. అమెరికా ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ఇజ్రాయిల్ దాడులు చేస్తున్నప్పటికీ.. ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. మోడీ చూపించిన దౌత్య తెగువ.. యుద్ధంలో అమెరికాకు సపోర్ట్ చేయకపోవడం వంటి కారణాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇరాన్ మనకు జై కొడుతోంది.. అందువల్లే అమెరికా మీద దాడులు చేస్తూ.. మిసైల్స్ ద్వారా థాంక్యూ భారత్ అని ప్రస్తావిస్తోంది. బలమైన నాయకుడు.. బలమైన దౌత్య సంబంధాలు కొనసాగిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో ఇరాన్ వాస్తవంలో చూపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular