Iran 5 demands against US peace plan: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్‌లో మొదులు పెట్టిన యుద్ధం ముగింపునకు యత్నిస్తున్నాడు. యుద్ధం మొదలై 25 రోజులైనా ఇరాన్ దీటుగా ప్రతిదాడులు చేస్తుండడంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. మరోవైపు గల్ఫ్ దేశాలతోపాటు యురోపియన్ యూనియన్ దేశాలు యుద్ధం ఆపాలని అమెరికాపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ట్రంప్ ఐదు రోజుల విరామం ప్రకటించారు. తాజాగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో 15 అంశాలతో ప్రతిపాదనలు పంపారు. దీంతో యుద్ధం శాశ్వతంగా ఆపుతామని తెలిపారు. అయితే ఇరాన్ కూడా షరతులు పెడుతోంది. మొదట మూడు తర్వాత ఆరు, ఆ తర్వాత ఏడు షరతులు పెట్టిన ఇరాన్.. అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల కాల్పుల విరమణ ప్లాన్‌ను ఇరాన్ పూర్తిగా తిరస్కరించింది. తమ ఐదు కఠిన డిమాండ్లు ఆమోదం కాకపోతే యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇరాన్ ఐదు డిమాండ్లు ఇవీ..
– ఇరాన్‌పై జరుగుతున్న దాడులు, రహస్య హత్యలు పూర్తిగా ఆగాలి.
– మళ్లీ యుద్ధానికి దిగకుండా అంతర్జాతీయ మేకానిజం ఏర్పాటు చేయాలి, ఇరాన్ భద్రతకు హామీలు ఇవ్వాలి.
– ఇప్పటివరకు జరిగిన నష్టానికి పరిహార చెల్లించాలి. ఇది ఆర్థిక పునర్నిర్మాణానికి సహకరించాలి.
– మధ్యప్రాచ్యంలోని చేస్తున్న దాడులన్నీ ఆపాలి. ప్రాక్సీ గ్రూపుల మద్దతు ఆపాలి.
– హర్మూజ్‌లో టోల్ వసూలుకు హక్కులు కల్పించాలి.
Also Read: హర్మూజ్ దాటుతున్న నౌకలు.. భారత్‌కు ఊరట!
అమెరికా ప్రతిపాదన తిరస్కరణ..
ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయాలని, బదులుగా పౌర అణు సహాయం అందిస్తామని ప్రతిపాదించింది. ఇరాన్ దీన్ని ’అణు ఆగ్రహం’గా ఖండించి, తమ డిమాండ్లు స్వయం గౌరవం, రక్షణకు సంబంధించినవని పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్చలు క్లిష్టంగా మారాయి.
ఇరాన్ వ్యూహం దౌర్జన్యాలకు ధీటుగా నిలబడి, హర్మూజ్‌ను ఆయుధంగా ఉపయోగిస్తోంది. అమెరికా ఒప్పుకుంటే మధ్యప్రాచ్య శాంతి దశలో ప్రవేశిస్తుంది, కానీ తిరస్కరిస్తే గ్లోబల్ ఎనర్జీ సంక్షోభం తీవ్రమవుతుంది.