Iran Crisis: ఇరాన్.. పాకిస్తాన్ అనుకూల దేశం. ఉగ్రవాదులకు అడ్డా. ముస్లిం ఛాందసవాద దేశం. ఈ దేశంక్ష 2022–23లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. ఓ యువతి హిజాబ్ తొలగించడంతో పోలీసుల అరెస్టు చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువతి చనిపోయింది. దీనికి వ్యతిరేంగా మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. తాజాగా అంతకు మించిన ఉద్యమం కొనసాగుతోంది. రెండు రోజులుగా ప్రజలు తిరుగబాటు చేస్తున్నారు. అయితే దీనిని ఇరాన్ ప్రభుత్వం బయటకు రానివ్వడం లేదు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌లు చేస్తున్నా ఆందోళనలు ఆగడం లేదు. ‘ముల్లాస్ గో బ్యాక్‘, ‘లీవ్ ఇరాన్‘, ‘డెత్ టు డిక్టేటర్స్‘ నినాదాలు టెహ్రాన్, మాష్హద్, షిరాజ్, దిస్పాన్లో వినిపిస్తున్నాయి.
నాడు హిజాబ్‌పై రచ్చ..
2022లో మహ్సా అమిని హిజాబ్ ఉల్లంఘనపై పోలీసుల కస్టడీలో మరణించడంతో మహిళలు రోడ్లపైకి వచ్చారు. హిజాబ్‌లు తొలగించి, టీషర్ట్లు–జీన్స్లలో నిరసనలు చేశారు. పది నెలలు కొనసాగిన ఈ ఉద్యమం ప్రభుత్వాన్ని ఒత్తిడికి తీసుకువచ్చి, మత నిబంధనలు సడలించింది. ఇప్పుడు ఆందోళనలు ఆర్థిక సమస్యల వైపు మలిచాయి. మతోన్మాద విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి.
తాజాగా ఆర్థిక సంక్షోభం..
తాజాగా ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఒక డాలర్ 42,000 రియాల్‌కు చేరడంతో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగాయి. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా చేసి, ‘వ్యవస్థను నడపలేకపోయాను‘ అని ప్రకటించాడు. ప్రభుత్వ ఒత్తిడి కారణమని అనుమానాలు. అయితే ఇరాన్ మీడియా ఈ వార్తలు దాచిపెట్టినా, గల్ఫ్ ముస్లిం పత్రికలు విస్తృతంగా కవరేజ్ చేశాయి. ఇస్లామిక్ ఆర్థిక విధానాలు ప్రజల జీవితాలను కష్టతరం చేస్తున్నాయి.
చరిత్ర పునరావృతం?
1979లో ఇస్లామిక్ విప్లవంతో షా పాలిత రాచరికం అంతమైంది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. ఇప్పుడు ప్రజలు మతాధీన పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు. మహిళలు, యువత ముందంజలో ఉండి, మత విశ్వాసాలను బలవంతం చేసే వ్యవస్థకు చాటి చూపుతున్నారు. ఈ ఉద్యమం విస్తరిస్తే, ఇరాన్ రాజకీయాలు మారే అవకాశం ఉంది. ప్రపంచం ఈ మలుపును గమనిస్తోంది.