Jerusalem Couple: ఓ వైపు ఇరాన్ బాంబులు.. మరోవైపు దూసుకొచ్చిన క్షిపణులు.. అయినప్పటికీ వారి ప్రేమను ఏమీ చేయలేకపోయాయి.. ఆ గుండెలు బతకాలి.. వీడియో వైరల్

స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. బంధాన్ని బలోపేతం చేస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది. స్థైర్యాన్ని గుండెల నిండా నిలుపుతుంది. అలాంటి ప్రేమ ఎలాంటి అవాంతరాలు ఎదురైనా నిలబడుతుంది. చివరికి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా లెక్కచేయకుండా ఉండగలుగుతుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 4, 2024 9:45 am

Jerusalem Couple

Follow us on

Jerusalem Couple: ఓవైపు దూసుకు వస్తున్న బాంబులు.. మరోవైపు పేలుతున్న క్షిపణులు.. ఇలాంటి సమయంలో ఎవరైనా సరే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉంటారు. ఎక్కడ ఒకచోట తల దాచుకుంటారు. అలాంటి సందర్భంలో భూమ్మీద బతికి ఉంటే చాలు.. ఏవీ అవసరం లేదనుకుంటారు. కానీ అలాంటి సమయంలోనూ వారిద్దరూ ప్రేమను పంచుకున్నారు. పరస్పరం చేతిలో చేయి వేసి తమదైన లోకంలో మునిగిపోయారు. యుద్ధం తాత్కాలికమని.. ప్రేమ శాశ్వతమని నిరూపించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది. ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం వల్ల పశ్చిమసియాలో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు పోటాపోటీగా బాంబులను ప్రయోగిస్తుండడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. అయితే ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ ఓ జంట తమ అనుబంధాన్ని ప్రదర్శించింది.. జెరూసలేం ప్రాంతంలో ఓ బంకర్ లో తలదాచుకున్న నూతన వధూవరులు డ్యాన్స్ చేశారు. ఒకరి చేతిలో మరొకరు చేయి తమదైన లోకంలో విహరించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది.” జెరూసలెం ప్రాంతం లోని ఓ బంకర్ లో జరిగిన ఈ ఆనంద వేడుకను ఇరాన్ నిలువరించలేకపోయింది. యుద్ధం ఆనందాన్ని ఆపలేదు. ప్రేమను జయించలేదు. ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సాంగత్యం ఎప్పటికీ బలపడి ఉంటుందని” ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ సౌల్ సద్కా అనే వ్యక్తి వ్యాఖ్యానించాడు.. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. ఇరాన్ ఇజ్రాయిల్ పై 181 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఆ సమయంలో ఆ జంట జెరూసలేం లోని ఓ బంకర్ లో ఆశ్రయం పొందింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి ఒక్కొక్కటి 700 నుంచి 1000 కిలో గ్రాముల వరకు వార్ హెడ్ పే లోడ్ ను కలిగి ఉంది. ఇవి ఆ సమీపంలో ఉన్న భవనాలను మొత్తం నీలమట్టం చేయగలదు. బైబిల్ బోధకుడు, రచయిత సాల్ సడ్కా తెలిపిన వివరాల ప్రకారం.. జెరూసలేం ప్రాంతంలో అతిపెద్ద హోటళ్ల ల్లో ఒకటైన నోట్రే డ్యాంలోని బంకర్ లో ఆ జంట ఆశ్రయం పొందింది.

వారిద్దరూ వివాహ బంధం ద్వారా ఇటీవల ఒకటయ్యారు. ఈ క్రమంలో తమ అనుబంధాన్ని చాటే సందర్భం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బంకర్లో తల దాచుకున్నవారు ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటూ అనుబంధాన్ని విస్తృతం చేసుకున్నారు. చేతిలో చేయి వేసి డ్యాన్స్ చేశారు. ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తున్నా.. నూతన దంపతులు భయపడలేదు. పైగా వారు తమ అనుబంధంలో మునిగిపోయారు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నది. ” అల్లకల్లోల పరిస్థితులనుంచి ఇలాంటి ఒక ఆశావాహ దృక్పథం నిండిన కథ బయటికి రావడం గొప్పగా ఉంది. సమతుల్య భావనను అసమతుల్య ప్రపంచంలో నింపుతోందని” వారు వ్యాఖ్యానించారు. కాగా, మంగళవారం రాత్రి ఇరాన్ ఇజ్రాయిల్ పై 181 బాలిస్టిక్ క్షుపనలతో దాడి చేసింది. ఇరాన్ దేశానికి చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ టెల్ అవీవ్ సమీపంలోని మూడు ఇజ్రాయిల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులను ప్రయోగించారు.. అయితే ఈ దాడుల్లో కొంతమంది ఇజ్రాయిల్ పౌరులు గాయపడ్డట్టు వార్తలు వస్తున్నాయి.