International Friendship Day 2022: సృష్టీలో స్నేహానికి కొలమానం లేదు
ఆనంతమైనది స్నేహం
అంతులేనీది స్నేహం
అనురాగమే స్నేహం
ఆప్యాయత లే స్నేహం
ఆనందమయమే స్నేహం
అనంతకోటికి అండగా స్నేహం
స్నేహానికి ఫరిధి లేదు
స్నేహానికి ఏదీ అడ్డురాదు
నీ స్నేహితులెవరో చెప్పు నీవెలాంటి వాడివో చెబుతాను అంటారు. అంటే స్నేహానికి కన్న మిన్న లోకాన లేదురా అన్నారో సినీకవి. నిజమే స్నేహానికికన్నా లోకంలో ఎవరు ఎక్కువ కాదు. స్నేహితుడు అండగా ఉంటే ఏదైనా సాధించొచ్చు అనే ధైర్యం ఉండటం ఖాయమే. చివరి వరకు తోడుండేది కూడా స్నేహితుడే. ఎవరికి చెప్పుకోలేని విషయాలు కూడా స్నేహితుడితో చెప్పుకునే పరిష్కరించుకుంటాం. అంతటి స్థాయి స్నేహితుడిది. హితుడే స్నేహితుడు. అందుకే మనకు ఏ కష్టం వచ్చినా మొదట చెప్పుకునేది కూడా స్నేహితుడికే.
International Friendship Day 2022
లోకంలో ఎలాంటి వైషమ్యాలు లేని స్నేహం. స్నేహితులతోనే మనకు అండ ఉంటుంది. మనకు ఏదైనా జరిగితే రక్తసంబంధీకులు బాధపడటంలో అర్థం ఉంటుంది. కానీ ఏ బంధం లేకపోయినా స్నేహితుడు మాత్రం ఎంతో ఆవేదన చెందడం చూస్తుంటాం. అసలు స్నేహితుల దినోత్సవం గురించి రెండు రోజులు జరుపుకునే సంప్రదాయం ఉంది. మన దేశంతో పాటు బంగ్లాదేశ్, మలేషియా, అరబ్ ఎమిరేట్స్, అమెరికా లాంటి దేశాలు ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటాయి. కానీ చాలా దేశాల్లో జులై 30నే స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం తెలిసిందే.
అమెరికాలో 1935లో స్నేహితుల దినోత్సవం ప్రారంభమైంది. అమెరికా ప్రభుత్వం ఓ వ్యక్తిని చంపేస్తుంది. దీంతో అతడి స్నేహితుడు అతడి మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. అది ఆగస్టు మొదటి ఆదివారం రోజు జరుగుతుంది. అందుకే అప్పటినుంచి ఆగస్టు నెలలో మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ కొన్ని దేశాలు మాత్రం జులై 30ని కూడా స్నేహితుల దినోత్సవంగానే జరుపుకోవడం వస్తోంది. దీంతో స్నేహితుల దినోత్సవాన్ని రెండు రోజులు జరుపుకోవడం తెలిసిందే.
స్నేహం స్ఫూర్తిని కలిగించడానికే స్నేహితుల దినోత్సవాన్నిజరుపుకుంటారు. స్నేహితుడి మీద ప్రేమతో ఈ దినోత్సవం ఆనందంగా జరుపుకుంటారు. కేక్ లు కట్ చేస్తూ వేడుకలు చేసుకుంటుంటారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఫ్రెండ్ షిప్ బాండ్లు కట్టుకుంటుంటారు. వైభవంగా వేడుకలు జరుపుకుని ఆనందంగా ఉంటారు. స్నేహితుల హితం కోసమే స్నేహితుల దినోత్సవం అనేది అందరికి తెలిసిందే.
జాతి, కులం, మతం, లింగం, ప్రాంతం తేడాలు లేకుండా ప్రపంచ దేశాల మధ్య స్నేహసంబంధం లేకుండా ప్రపంచ దేశాల మధ్య స్నేహభావం పెంపొందాలనే ఉద్దేశంతో 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ సమావేశం నిర్వహించి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం నిర్వహించాలని భావించింది. దేశాల మధ్య సుహృద్భావం, స్నేహం కలగాలని నిర్ణయించింది. దేశాల మధ్య వైషమ్యాలు ఉండకూడదని సూచించింది. అన్ని దేశాలు సోదరభావంతో మెలిగి ప్రపంచ శాంతికి బాటలు వేయాలని సంకల్పిస్తోంది.