Indian Student in USA : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ బాధ్యతలు చేపట్టాక దూకుడు పెంచారు. అక్రమ వలసదారుల ఏరివేత మొదలు పెట్టారు. ఇప్పటికే వేల మంది అక్రమ వలసదారులను గుర్తించి వారి దేశాలకు పంపించారు. భారత్‌కు కూడా ఓ విమానం వచ్చింది. ఈ నేపథ్యంలో టూరిస్ట్, ఎడ్యుకేషన్ వీసాలపై వెళ్లి పార్ట్‌టైం జాబ్ చేసుకుంటున్నవారు, డుంకీ మార్గాల్లో వెళ్లినవారి మాత్రం కంటిమీద కునుకు ఉండడం లేదు. ఇలాంటి వారి పరస్థితి దయనీయంగా మారింది. అక్రమ వలసల గుర్తింపు కోసం అక్కడి ఇమ్మిగ్రేషన్(Immigretion) అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అమెరికన్లు కూడా అక్రమ వలసదారుల సమాచారం ఇస్తున్నారు. తనిఖీల్లో దొరికితే వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. సంకెళ్లు వేసి తరలిస్తున్నారు. దీంతో పార్ట్ టైమ్ వర్కర్లుగా పనిచేస్తున్నవారు ఆందోళన చెందుతున్నారు. దీంతో వీరంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
బయటకు రాలేక..
తాజాగా నిబంధనలకు విరుద్ధంగా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నవారు, ఉన్నత విద్య కోసం టూరిస్టు వీసాలపై వెళ్లినవారు కూడా అమెరికాలో బయట తిరగడానికి జంకుతుఆన్నరు. బయట దొరికితే కచ్చితంగా అరెస్టు చేస్తారని ఆందోళన చెందుతున్నారు. భారతకు విమానాలు ఎక్కించి పంపిస్తారన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో రెగ్యులర్‌గా వీరు వెళ్లే పార్ట్‌టైం జాబ్స్(Part time jobs)కు గుడ్‌బై చెబుతున్నరు. ఇటీవలే 104 మందిని అమెరికా భారత్‌కు పంపింది. మరో 487 మందితో రెండో జాబితా సిద్ధం చేసింది. దీంతో వలసవాదుల్లో భయం మరింత పెరిగింది.
అమెరికా ప్రభుత్వ అధికారులు పత్రాలు లేని వలస. దారులను టార్గెట్ చేస్తున్నారు. దీంతో రెండేళ్లుగా వర్క్ పిర్మిట్‌లపై దేశంలో ఉన్న ఇతరు కూడా ఆందోళన చెందుతున్నారు. తమ వద్ద చెల్లుబాటు అయ్యే వర్క్ వీసారు ఉన్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇటీవల జస్మీత్‌సింగ్ అనే భారతీయు డ్రైవర్ వద్ద వర్క్ వీసా ఉన్నా.. అమెరికా సరిహద్దు పోలీసులు(police) ప్రశ్నించారు. అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతనే పంపించారు. దీంతో పత్రాలు ఉన్నా తనిఖీలు ఎదుర్కొనాల్సి వస్తోంది. ఇక అక్రమంగా వెళ్లిన వారు మాత్రం తమ ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు.