Bangladesh Protests: బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అమలుపై విద్యార్థులు, యువకులు రోడ్డుకెక్కి ఆందోళన, హింసను రేకెత్తించారు. వీరి నిరసనలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. సైన్యం ఆదేశాల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి, ప్రస్తుతం భారత్ చేరుకొని ఒక రహస్య ప్రదేశంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నోబెల్ అవార్డు గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో ఈ కొత్త, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయినా అల్లర్లు మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో బంగ్లాలో నివసిస్తున్న హిందువుల పై దాడులు పెరిగినట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ దాడులపై భారత నేతల స్పందన తీరు బాగాలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. భారత్ లో ఉన్న హిందువులపై దాడులు పెరిగాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో మోదీ, యోగీ మినహా ఏ ఒక్కరూ స్పందించడం లేదు. మరో వైపు ఇండియా కూటమి అసలు ఆ దాడులపై కనీస పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ప్రధాని మోడీ స్వయంగా బంగ్లాదేశ్ కొత్త ప్రధానికి ఫోన్ చేసి దీన్ని ఖండించారు. భారతీయులపై దాడిని ఊపేక్షించబోమని చెప్పుకొచ్చారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. దాడులు సరికాదని, భారతీయులపై జరుగుతున్న దాడులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే ఈ దాడులను మిగతా నేతలు ఖండించడం లేదు. ఇక కేంద్రం ఇప్పటికే అలర్ట్ అయ్యింది. బంగ్లాదేశ్ పరిస్థితులపై ప్రధాని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. నేరుగా బంగ్లాదేశ్ కొత్త ప్రధాని కి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ దేశంలో పరిస్థితులు, భారతీయుల సంరక్షణ, భద్రత, తదితరాలపై ఆరా తీశారు. ఇక యోగి ఆదిత్య నాథ్ కూడా స్పందించారు. అమిత్ షా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
నోరు మెదపని ఇండియా కూటమి
అయితే బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులపై ఇండియా కూటమి నేతలు రాహుల్ గాంధీ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రియాంక గాంధీ వాద్రా కూడా దీనిపై నోరు మెదపడం లేదు. కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీ ల నేతలు కూడా స్పందించడం లేదు.
దేశం కాని దేశంలో భారతీయులపై దాడులు జరుగుతుంటే స్పందించకపోవడం దారుణమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. మరోవైపు కేంద్రం మాత్రం వెంటనే అఖిలపక్ష భేటీలు నిర్వహించి, అక్కడి పరిస్థితులను నేతలతో పంచుకుంది. ఇక భారత్ లో ఉన్న షేక్ హసీనా రక్షణకు తీసుకుంటున్న చర్యలను కూడా వారికి వివరించారు.
అయితే షేక్ హసీనా లండన్ వెళ్తుందా..? మరికొంత కాలం ఇక్కడే ఉంటుందా? అనే అంశంపై కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నట్లు తెలిసింది. ఇదే అంశంపై నేతల మధ్య ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. షేక్ హసీనా మరికొంతకాలం ఇక్కడ ఉండాల్సి వస్తే ఏం చేయాలనే దానిపై కూడా కేంద్ర పెద్దలు అఖిలపక్ష నేతల సలహాలు తీసుకున్నట్లు తెలిసింది.
ఇదే సమావేంలో బంగ్లాలోని భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను కూడా కేంద్ర పెద్దలు వారికి వివరించారు. కాగా రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ లో శాంతియుత పరిస్థితులు కొనసాగాలని, జనజీవనం యథాస్థితికి వెళ్లాలని నేతలందరూ ఆకాంక్షించారు. హింసాయుత మార్గంలో ఆందోళనలు సరికాదని అభిప్రాయపడినట్లుగా సమాచారం అందుతుంది.