Ashley Tellis Arrested: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో భారత్–అమెరికా సంబంధాల్లో ఒడిదుడుకులు మొదలయాయయి. టారిఫ్‌ల కారణంగా భారత్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. మోదీ తనకు మంచి మిత్రుడు అని చెప్పుకునే ట్రంప్.. భారత్ లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయినా భారత్ చలించడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఓ కీలక పరిణామం అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యూహ నిపుణుడు, ఇండో–యుఎస్ అణు ఒప్పంద రూపకర్తల్లో ఒకరైన ఆశ్లీ జె. టెల్లిస్ అరెస్ట్ అయ్యాడు. మోదీ బద్ధ వ్యతిరేకి అయిన టెల్లిస్ అరెస్ట్ ఇప్పుడు అమెరికాలో సంచలనంగా మారింది. అమెరికా జాతీయ రక్షణ సమాచారాన్ని అక్రమంగా నిల్వచేసినట్లు అతనిపై అభియోగాలు మోపింది. ఎఫ్‌బీఐ అధికారులు ఆయన వెర్జీనియాలోని ఇంటి సబ్సో్టరేజ్ ప్రాంతంలో వెయ్యికి పైగా రహస్య పత్రాలు, వాటిలో కొన్ని టాప్ సీక్రెట్ కేటగిరీలో ఉన్నాయని వెల్లడించారు.
ఎవరు ఆశ్లీ టెల్లిస్?
ముంబైలో జన్మించిన ఆశ్లీ టెల్లిస్, శికాగో విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో పీహెచ్.డి చేశారు. ఆయన అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ పాలనలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు. టైమ్‌కి స్టేట్ డిపార్ట్‌మెంట్ సలహాదారుగా, పెంటగాన్‌కు కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు. ఆయన కార్నెగీ ఎండోవ్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సంస్థలో సీనియర్ ఫెలోగా, టాటా చైర్ ఫర్ స్ట్రాటజిక్ అఫైర్స్‌గా కీలక పాత్ర పోషించారు. అయితే టెల్లిస్ భారత ప్రధాని మోదీ వ్యతిరేకిగా గుర్తింపు పొందారు. మోదీ నిర్ణయాలను తప్పు పడుతూ భారత్‌లోని విపక్షాలకు ఆయన ఆరాధ్యుడిగా మారాడు. మోదీ ప్రతీ నిర్ణయాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు టెల్లిస్.
అభియోగాలు, దర్యాప్తు..
అమెరికా న్యాయశాఖ ప్రకారం, టెల్లిస్ తన పెంటగాన్ కంప్యూటర్ ద్వారా రహస్య పత్రాలను ప్రింట్ చేసి ఇంటికి తీసుకెళ్లారని ఎఫ్‌బీఐ ఆరోపించింది. ఈ పత్రాలలో అమెరికా ఫైటర్ జెట్ల సాంకేతిక సమాచారం, వ్యూహాత్మక విశ్లేషణ వంటివి ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. చట్ట ప్రకారం టెల్లిస్‌పై నేర పరమైన విచారణ కొనసాగుతోంది. అదనంగా, ఆయన కొన్ని చైనా అధికారులతో గోప్యంగా సమావేశమైనట్లు ఎఫ్‌బీఐ వెల్లడించడంతో ఈ కేసు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అమెరికా న్యాయ వ్యవస్థ, దీన్ని జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తోంది.
ప్రభుత్వ ప్రతిస్పందన..
యుఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ టుల్సీ గబ్బార్డ్ ‘‘గోప్య సమాచార దుర్వినియోగం పట్ల ఏ సహనం ఉండదు’’ అని ప్రకటించారు. ఈ కేసును కొన్ని విశ్లేషకులు ట్రంప్ పరిపాలనలో ఇండియా పట్ల పెరుగుతున్న కఠిన ధోరణి ప్రతిఫలమని భావిస్తున్నారు. అమెరికా ప్రస్తుతం భారత వాణిజ్యంపై అధిక సుంకాలు విధించడం, వ్యూహాత్మక భాగస్వామ్య పునర్విమర్శ వంటి చర్యలను చేపడుతోంది.
భారత–అమెరికా సంబంధాలపై ప్రభావం..
ఆశ్లీ టెల్లిస్ అరెస్ట్ ఇండో–యుఎస్ వ్యూహాత్మక సంబంధాలకు టర్నింగ్ పాయింట్‌గా పరిగణించవచ్చు. ఆయన అమెరికా–భారత సహకారం కోసం పలువురు అధ్యక్షులను సలహా ఇచ్చిన వ్యక్తి. ఇప్పుడు ఆయనపై కేసు ఈ సంబంధాలను ఉత్కంఠ పరిస్థితిలోకి నెట్టింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయకపోయినా, వాషింగ్టన్–న్యూఢిల్లీల మధ్య నమ్మకానికి ఇదో పరీక్ష.
మోదీని అన్ని విధాల వ్యతిరేకించే టెల్లిస్ అరెస్ట్ ఒక వ్యక్తి నేరం కాకుండా, అమెరికా శక్తి రాజకీయాలు, ఆసియా వ్యూహ సమీకరణాలపై పెద్ద పాఠం. అయితే టెల్లిస్ వంటి మేధావిని దెబ్బతీయడం అంటే ఇండియా–అమెరికా నమ్మకం ఒక్కసారిగా కోల్పోవడమే.