India LPG Crisis Update 2026: ఇరాన్–అమెరికా యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి మూసుకుపోయి భారత్‌కు రావాల్సిన 60 శాతం ఎల్పీజీ దిగుమతి 25 శాతానికి పడిపోయింది. ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో హోటళ్లు మూతపడ్డాయి, బ్లాక్ మార్కెట్, సైబర్ మోసాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా బుకింగ్‌లు 94 శాతం పెరిగాయి. ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఏర్పడింది. కేంద్రం ఇప్పటికే డొమెస్టిక్ గ్యాస్‌పై రూ.60 పెంచింది. కమర్షియల్ సిలిండర్‌పై రూ.1200 పెంచింది.
Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?
భారత్‌కు చేరిన జగ్ వసంత్..
ఈ క్రమంలో ఇప్పటికే మూడు నౌకలు చమురు, ఎల్పీజీతో గల్ఫ్ నుంచి హార్మూజ్ జలసంధి దాటి భారత్‌కు చేరుకున్నాయి. తాజాగా షార్జా బందరం నుంచి బయల్దేరిన ’జగ్ వసంత్’, ’పైన్ గ్యాస్’లో 92,000 మెట్రిక్ టన్నులు ఎల్పీజీ ఇంధనం ఉంది. ఇరాన్ నావికాదళం మార్గదర్శకత్వంతో లారక్–ఖేష్మ్ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. రెండు రోజుల్లో ముంబై, కొచ్చి పోర్టులకు చేరతాయి. ఇంతకు ముందు శివాలిక్, నందాదేవి, జగ్ లాడ్కీలు 1.5 లక్షల టన్నులు సరఫరా చేశాయి.
భారత్ దౌత్య విజయాలు
ప్రధాని మోదీ ప్రపంచ నాయకులతో (ఖతార్, యూఏఈ, సౌదీ) సంప్రదింపులు జరిపి హార్ముజ్ అనుమతులు పొందారు. ఇరాన్‌తో దౌత్య ప్రయత్నాలు విజయవంతమవ్వడం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విజయం. ఇప్పటివరకు ఐదు నౌకలు సురక్షితంగా హార్మూజ్ దాటాయి, మరో 2 ఎల్‌ఎన్‌జీ కార్గోలు రానున్నాయి.
ఎల్పీజీ ఉత్పత్తి పెంపు..
ఇదిలా ఉంటే భారత్ పీఎన్‌గ్రిన్ రిఫైనరీల్లో ఎల్పీజీ ఉత్పత్తి 25–40 శాతం పెంచారు, స్టాక్ స్థిరంగా ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటించారు. గృహాలు, సీఎన్‌జీ ఆటోలకు 100 శాతం ప్రాధాన్యత, వాణిజ్య డిమాండ్‌ను 50 శాతం కోత విధించింది. బుకింగ్ 2.5 రోజుల్లో డెలివరీ హామీ, డిస్ట్రిబ్యూటర్లపై కఠిన పర్యవేక్షణ చేస్తోంది.
తాజాగా వస్తున్న రెండు నౌకలతో 15–20 రోజుల అవసరాలు తీరతాయి, కానీ ధరలు రూ.50–100 పెరగవచ్చు. దీర్ఘకాలంలో ప్రత్యామ్నాయ మార్గాలు, పీఎన్‌జీ విస్తరణ, బయోగ్యాస్ ప్రోత్సాహం అవసరం. యుద్ధ విరామం జరిగితే స్థిరత్వం వస్తుంది, లేకపోతే సీఎన్‌జీ ఆటోలు, హోటళ్లు మరింత ఇబ్బందులు తప్పవు.
