India Philippines Relations: భారత్ లేదా మోదీని దెబ్బకొట్టేందుకు మన పొరుగున ఉన్న చైనా అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇష్టానుసారం మ్యాప్ మార్చేస్తోంది. భారత భూభాగం ఆక్రమించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మన మరో పొరుగు దేశం మాల్దీవులను మచ్చిక చేసుకుని ఆ దేశాని అనుకూలమైన అధ్యక్షుడు ముయిజ్జ ఎన్నికయ్యేలా చేసింది. చైనా అండతో మాల్దీవులు అధ్యక్షుడు కూడా భారత్‌తో కవ్వింపు చర్యలు చేపడుతోంది.
రంగంలోకి మోదీ..
చైనా ఎత్తుకు భారత ప్రధాని మోదీ పై ఎత్తు వేశాడు. చైనా పొరుగున ఉన్న ఫిలిప్పైన్స్‌తో దోస్తీకి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశానికి 375 మిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా బ్రహ్మోస్ క్షిపుణులను అందించింది. 2022లో కుదిరిన ఒప్పందం మేరకు సూపర్ సోనిక్ క్రూయిజ్ ప్రుణులను పంపిణీ చేసింది. ఫిలిప్సైన్స్ మెరైన్ కార్ప్స్‌కు ఆయుధ వ్యవస్థను అందించడానికి భారత వైమానిక దళం తన అమెరికన్ మూలం సీ–17 గ్లోబ్‌మారస్టర్ రవాణా విమాణాన్ని క్షిపుణులను పంపించింది. దక్షిణ చైనా సముద్రంలో తరచూ జరిగే ఘర్షల కారణంగా తమకు చైనాకు మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఫిలిప్సైన్స్ క్షిపిణి వ్యవస్థలను పంపిణీ చేస్తోంది.
రంగంలోకి అమెరికా..
ఇప్పటికే చైనా పొరుగు దేశంలో భారత ఆయుధాలు సిద్ధంగా ఉండగా, మరోవైపు చైనాకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. అమెరికా కూడా భారీగా ఆయుధాలను ఫిలిప్సైన్స్‌కు తరలిస్తోంది. యుద్ధ నౌకలను తీసుకొస్తోంది. దీనిపై చైనా అభ్యంతరం తెలిపింది. అయితే కేవలం సైనిక విన్యాసాల కోసమే తాము యుద్ధ నౌకలను తీసుకొస్తున్నట్లు తెలిపింది.
టిట్ ఫర్ టాట్‌లా..
భారత సరిహద్దు దేశాలతో చైనా మిత్రుత్వం పెంచుకుంటుంటే.. చైనా సరిహద్దు దేశాలతో బారత్ కూడా మిత్రుత్వం పెంచుకుంటోంది. ఇప్పటికే తైవాన్‌కు సాయం అందించి స్నేహం పెంచుకుంది. అమెరికా కూడా తైవాన్‌కు స్నేహహస్తం అందించింది. తాజాగా ఫిలిప్సైన్స్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోంది.