Homeఅంతర్జాతీయంIndia And Oman: పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసిన భారత్..ఒమన్ తో బిగ్ స్కెచ్

India And Oman: పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసిన భారత్..ఒమన్ తో బిగ్ స్కెచ్

India And Oman: భారత్‌–ఒమాన్‌ మధ్య వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు చరిత్రలో లోతుగా పాతుకుపోయాయి. చత్రపతి శివాజీ నుంచి గ్రాండ్‌ ముఫ్తీ వరకు సత్సంబంధాలు, మస్కట్‌లో భారతీయ వ్యాపారుల స్థిరపడడం ఈ బంధాల చిహ్నాలు. ఇటీవల డిసెంబర్‌ 29న ప్రారంభమైన కౌండిన్య షిప్‌ యాత్ర ప్రాచీన నావికా మార్గాలను పునరుద్ధరించి ఈ వారసత్వాన్ని గుర్తు చేసింది.

4 బిలియన్‌ డాలర్‌ వాణిజ్య ఒప్పందం..
ఇదిలా ఉంటే ప్రధాని మోదీ ఇటీవల ఒమాన్‌లో పర్యటించారు. భారత ఎగుమతులపై సుంకాలు లేకుండా ఒప్పందం చేసుకున్నారు. ఇంధన రంగం, పర్యాటకం, ప్రబల సాంకేతికతలపై 4 బిలియన్‌ డాలర్ల ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య వాణిజ్య బంధాలను బలోపేతం చేస్తూ భారత ఆర్థిక ప్రభావాన్ని పెంచుతాయి.

మన చేతికి డుకం ఎయిర్‌బేస్‌..
ఒమాన్‌ సుల్తాన్‌ అనుమతితో డుకం ఎయిర్‌బేస్, డకం పోర్టులో భారత నౌకాదళానికి ప్రవేశం లభించింది. హిందూ మహాసముద్రంలోకి ఆఫ్‌ ఆర్మోజ్‌ జలసంధి సమీపంలో ఉన్న ఈ స్థావరం యుద్ధనౌకల రిపేర్లు, ఇంధన పునరునామి అవకాశాలను అందిస్తుంది. పడవల రాకపోకలపై నిఘా పెట్టే సామర్థ్యం భారత్‌కు కీలక ప్రయోజనం.

ప్రాంతీయ శత్రువులపై కన్ను
చిబూటీలోని భారత స్థావరంతోపాటు డుకం ఆధారం చైనా, అమెరికా నౌకలపై పరిశీలన అవకాశాన్ని కల్పిస్తుంది. పాకిస్తాన్‌ గ్వాదర్‌ పోర్టు, ఇరాన్‌ చాబహార్‌ పోర్టులకు సమీపంలో ఉండటం వల్ల అచేబియా జలాల్లో శత్రు కదలికలు గమనించవచ్చు. డుకం–చాబహార్‌ సమీకరణం ప్రాంతీయ ఆధిపత్యానికి బలమైన స్థాపన.

సైనిక సహకారం..
ఒమాన్‌తో భారత్‌ సైనిక వ్యాసాలు ఏటా జరుగుతాయి. ’నసీముల్‌ బహార్‌’ పేరిట నౌకా దళాలు, ఈస్టర్న్‌ బ్రిడ్జి వద్ద వాయుసేనలు, భూసైన్యాల మధ్య శిక్షణలు ప్రాంతీయ భద్రతకు బలం చేకూరుస్తాయి. రస్సెల్‌ హగ్‌లోని సిగ్నలింగ్‌ పోస్ట్‌ ఆఫ్‌ ఆర్మోజ్‌ ద్వారా 30% ప్రపంచ ఆయిల్‌ రవాణాపై నియంత్రణ పొందవచ్చు.

పాక్‌కు డుకం ఒప్పందం తీవ్ర దెబ్బ. అరబియా సముద్రంలో భారత పటిష్ఠం పెరగడం వల్ల గ్వాదర్‌ ప్రభావం తగ్గుతుంది. ఒమాన్‌తో భారత్‌కు ఉన్న చారిత్రక విశ్వాసం ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త సమతుల్యతను తీసుకొస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular