https://oktelugu.com/

Indian Students : కెనడా, రష్యా, చైనాల్లో పెరుగుతున్న ఇండియన్‌ స్టూడెంట్స్‌..విదేశాల్లో ఎంత మంది భారతీయులంటే?

విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం.. 13.35 లక్షల మంది భారతీయులు విదేశాల్లో చదువుతున్నారు. కరోనా తర్వాత చైనా కెనడా, రష్యా, చైనాలో చదివేవారు పెరుగుతున్నారు. ఈ దేశాల్లో చదివే విద్యార్థులు 2023లో 7,858 ఉండగా, 2024లో 8,580కు పెరిగింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 8, 2024 / 08:19 PM IST

    INDIAN Students

    Follow us on

    Indian Students : విదేశీ చదువులు, ఫారిన్‌ ఉద్యోగాలపై భారతీయుల్లో ఆసక్తి రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో విదేశాల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. భారతీయులు విదేశాల్లో తొలి ప్రాధాన్యం అగ్రరాజ్యం అమెరికాకు ఇస్తున్నారు. తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, రష్యా దేశాలకు తర్వాత ప్రాధాన్యం ఇస్తున్నారు. బ్యాంకులు విదేశాల్లో చదువులకు రుణాలు ఇస్తుండడం, ప్రతిభ ఉన్న విద్యార్థులను విదేశాలకు పంపించడానికి ప్రభుత్వాలు ఆర్థికసాయం చేస్తున్నాయి. దీంతో ఒకప్పుడు సంపన్నులకే పరిమితమైన విదేశీ విద్య.. ఇప్పుడు మధ్య తరగతికి కూడా అందుబాటులో వచ్చింది. దీంతో విదేశాల్లో చదివే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక కరోనా సమయంలో విదేశాల్లో చదివే చాలా మంది తిరిగి స్వదేశానికి వచ్చారు. కానీ, కోవిడ్‌ తర్వాత మళ్లీ విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పుంజుకుంది. ప్రస్తుతం 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. విదేశాల్లో చదువుతున్న భారతీయుల సంఖ్య 2023లో 13,18,955 ఉండగా, 2024 నాటికి 13,35,878కి పెరిగిందని తెలిపింది.

    కోవిడ్‌ తర్వాత పుంజుకున్న సంఖ్య..
    విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య కరోనాకు ముందు సంవత్సరం నుంచి పెరుగుతూ వస్తోంది. ఈ సంఖ్య 2019లో 6,75,541 ఉండగా, 2020లో 6,85,097కి పెరిగింది, ఆ తర్వాత 2021లో 11,58,702కి చేరింది. 2022లో 9,07,404కి తగ్గింది. అయితే, ఈ సంఖ్య 2023లో 13,18,955కి పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 8,73,955కి పెరిగారు. ఇక దేశాల వారీగా చూస్తే కెనడాలో 4,27,000, అమెరికాలో 3,37,630, ఆస్ట్రేలియాలో 1,22,202, యూకేలో 1,85,000 డిగ్రీ, ఆపై చదువులు చదువుతున్నారు. ఎక్కువ మంది ఈ దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

    రష్యా, కెనడాలో తగ్గిన భారతీయులు..
    ఈ సంవత్సరం, రష్యా మరియు కెనడా వంటి కొన్ని దేశాలలో ఉన్నత చదువులు అభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. రష్యాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2023లో 25,278 నుంచి 2024లో 24,940కి తగ్గింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా ఈ సంఖ్య తగ్గిందని భావిస్తున్నారు. యుద్ధం సమయంలో రష్యా, ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థులను కేంద్రం స్వదేశానికి తీసుకువచ్చింది. ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థుల సంఖ్య 2023లో 11,987గా ఉండగా ఈ ఏడాది 2,510కి పడిపోయింది.

    చైనాకు క్యూ..
    భారతీయ వైద్య విద్యార్థులలో ఇంతకుముందు ప్రసిద్ధి చెందిన మరొక దేశం చైనా. ఆసియా దేశం గత సంవత్సరంలో భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుదలను నమోదు చేసినప్పటికీ, మహమ్మారి ముందు సంవత్సరాలతో పోల్చినప్పుడు సంఖ్య గణనీయంగా తగ్గింది. 2019 లో, చైనాలో మొత్తం 15,207 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు, అయితే కోవిడ్ -19 వైరస్‌ కారణంగా చైనా వెళ్లేవారి సంఖ్య 2,950కి పడిపోయింది. అయితే కరోనా తర్వాత మళ్లీ పుంజుకుంది. 2021లో ఈ సంఖ్య 11,636కి పెరిగి, 2022లో మరోసారి 3,213కి తగ్గింది. మహమ్మారి ముగిసినప్పటి నుంచి భారతీయ విద్యార్థుల మార్కెట్ 2023లో 7,858, 2024లో 8,580గా నమోదైంది.

    కెనడాకు కూడా..
    కెనడాతో భారత్‌ అనేక అంతర్గత, బాహ్య సమస్యలను ఎదుర్కొంటోంది, దీని ఫలితంగా దేశంలోని భారతీయ విద్యార్థుల సంఖ్య (2023లో 4,27,085 నుంచి 2024లో 4,27,000కు తగ్గింది. కెనడాలోని భారతీయ విద్యార్థులు ఇళ్లు, ఆహారం, ఉద్యోగాలు దొరక్క ఎలా ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు, రెండు దేశాల మధ్య అనేక భౌగోళిక-రాజకీయ సమస్యలు కూడా ఉన్నాయి, ఇది కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులలో భయాన్ని కలిగించింది.