Anand Mahindra : అమెరికాలో సింహభాగం ఉన్నది భారతీయులే. అనాది కాలం నుంచి అమెరికా ఆర్థికంగా బలపడేందుకు కారణమవుతోంది కూడా భారతీయులే. అందుకే అమెరికా – భారతదేశం మధ్య ఏళ్లుగా మైత్రి కొనసాగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా మన దేశం నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ఉన్నత చదువుల నిమిత్తం వెళ్తున్న మనవాళ్లు.. అక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్నారు.. అయితే అలా అమెరికా వెళ్లి స్థిరపడిన మన దేశానికి చెందిన ఓ వ్యక్తి కూతురు తన గాత్ర మాధుర్యంతో కట్టిపడేసింది. ఇంగ్లీషులో అద్భుతంగా పాడి ఆకట్టుకుంది. ఈ పాట అమెరికన్లనూ అలరించింది. ఆమె పాడిన విధానానికి మనదేశంలో ప్రఖ్యాత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ముగ్దులయ్యారు. ఆ బాలిక పాడిన పాటకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
.@heidiklum couldn't wait to hit the Golden Buzzer for @pranysqam. watch #AGT tuesdays on @nbc and streaming on @peacock. pic.twitter.com/tkM0WdgIjm
— America’s Got Talent (@AGT) July 4, 2024
అమెరికాలో NBC అనే పేరుతో ఒక ఛానల్ ఉంది. అందులో America got talent అనే ఒక ప్రోగ్రాం ప్రసారమవుతుంది. పాటలు, ఆటలు, మిమిక్రీ.. ఇలా అన్ని రంగాల్లో ఉన్న కళాకారుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించడమే ఈ షో ముఖ్య ఉద్దేశం. అయితే ఈ షోలో భారత సంతతికి చెందిన ప్రనిస్కా మిశ్రా అనే 9 సంవత్సరాల బాలిక పాల్గొన్నది. అమెరికన్ స్లాంగ్ లో పాట పాడి ఆహూతులను అలరించింది. ఆమె పాడిన పాటకు వేదిక కింద ఉన్న న్యాయ నిర్ణేతలు మంత్ర ముగ్దులయ్యారు. ఆమె పాడుతున్నంతసేపు చప్పట్లు కొట్టి అభినందించారు. వాస్తవానికి ఆ బాలిక నానమ్మకు ఒక కోరిక ఉండేదట.. ప్రనిస్కా మిశ్రా ను గాయని చేయాలని అనుకునేదట. తన నానమ్మ కోరిక మేరకు తాను పాట పాడానని ప్రనిస్కా మిశ్రా న్యాయ నిర్ణేతల ముందు చెప్పడంతో వారు ఇండియాలో ఉన్న.. ప్రనిస్కా మిశ్రా నానమ్మకు వీడియో కాల్ చేశారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతమైంది.. తన మనవరాలు సాధించిన ఘనతను చూసి ఉప్పొంగిపోయింది.
ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. “భూమ్మీద ఏం జరుగుతోంది? గత రెండు వారాల వ్యవధిలో రెండవసారి భారత సంతతికి చెందిన ఓ బాలిక తన అద్భుతమైన ప్రతిభతో వేదిక పైకి వచ్చింది. స్వదేశీ అమెరికన్ సంగీత శైలిని ప్రదర్శించింది. ప్రనిస్కా మిశ్రా వయసు కేవలం 9 సంవత్సరాలు. వాళ్ల నానమ్మను పిలిచినప్పుడు నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి..ఔను అమెరికాకు నిజంగానే ప్రతిభ ఉంది. ఇది భారతదేశం నుంచి ఎగుమతి అవుతోందని” ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది.
What on earth is going on??
For the second time, within the past two weeks, a young—VERY young—woman of Indian origin has rocked the stage at @AGT with raw talent that is simply astonishing.
With skills acquired in indigenous American genres of music. Rock & Gospel.
Pranysqa… pic.twitter.com/2plEj8EXVs
— anand mahindra (@anandmahindra) July 8, 2024