Indian IITians: అమెరికాలో Gush work సహా వ్యవస్థాపకుడు నైయర్ హిత్, అతని భార్య రిషితా దాస్ కొత్తకాలంగా అమెరికాలో ఉంటున్నారు. 2016 లో ఖరగ్ పూర్ ఐఐటీ నుంచి వీరు తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం వారు అమెరికా వెళ్లారు. నయర్ హిత్, రిషిత అమెరికాలో కొంత కాలం పాటు ఉన్నారు. కిందటి ఏడాది క్రితం వారిద్దరు ఇండియాకు తిరిగివచ్చారు. నయర్ హిత్ నెలకొల్పిన గుష్ వర్క్ కంపెనీ అమెరికాలో కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. రిషిత బెంగళూరులోని IISc లో హీరో స్పేస్ ఇంజనీరింగ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తోంది. గత ఏడాది వారు ఇండియాకు వచ్చిన తర్వాత.. అమెరికాలో, మనదేశంలో పరిస్థితులను వారు అంచనా వేశారు. ఇందుకు సంబంధించి కొన్ని కీలక అంశాలను వెల్లడించారు.
ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగ సంక్షోభం నెలకొంది. గూగుల్ నుంచి మొదలుపెడితే amazon వరకు అన్ని కంపెనీలు ఉద్యోగులను మెడపట్టి బయటికి గెంటేస్తున్నాయి. టెస్లా లాంటి కంపెనీలు నరకం చూపిస్తున్నాయి. ఇక మధ్యస్థ కంపెనీలైతే లే ఆఫ్ ల పేరుతో ఉద్యోగాల్లో విపరీతమైన కోత విధిస్తున్నాయి. దీంతో చాలామంది ఉద్యోగం లేక, బతుకు బండి నడపలేక అమెరికాలో నరకం చూస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వెళ్లాలని ఆలోచిస్తున్నా 20 నుంచి 40 ఏళ్ల భారతీయులందరికీ నయర్ హిత్ తన అనుభవాన్ని ట్విట్టర్ ఎక్స్ లో ఒక ట్వీట్ రూపంలో వెల్లడించాడు..
” ఇండియా లో ట్రాఫిక్ జాం మీద విమర్శలు చేస్తుంటారు. న్యూయార్క్ లేదా శాన్ ఫ్రాన్సిస్కో కంటే ట్రాఫిక్ అధ్వానంగా ఏమీ ఉండదు. చికాగోలో అయితే ట్రాఫిక్ జామ్ చిరాకు కలిగిస్తుంది.. సమీప భవిష్యత్తులోనూ ఈ సమస్యకు అమెరికా పరిష్కార మార్గం చూపిస్తుంది అనేది నేను అనుకోనని” నయర్ హిత్ ట్విట్టర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు. “డిజిటల్ చెల్లింపుల విషయంలో భారత్ చాలా ఉన్నతంగా ఉంది. స్వల్ప కాలంలోనే ఎక్కువ చెల్లింపులు, వాణిజ్య కార్యకలాపాలు సాగించవచ్చు.. అమెరికాలో ఇన్ స్టా కార్డ్, డోర్ డాష్ ఉన్నాయి. కానీ భారత్ లో ఉన్న ఇంట్రా సిటీ లాజిస్టిక్స్ చాలా ఉన్నతమైనవని” నయర్ హిత్ పేర్కొన్నారు.
“అమెరికాలో కాఫీలు, ఇతరాలు తాగుతూ జరిపే మీటింగ్స్ ఉంటాయి. అవి ప్రధానంగా సాధారణమైన పని, క్రీడలకు సంబంధించిన చర్చలకు కేంద్రాలుగా ఉంటాయి. అవి లోతైన సంబంధాలకు దారి తీయవు. కానీ భారత్ లో ప్రతి వేడుక కుటుంబంతో ముడిపడి ఉంటుంది. అది బంధాలను మరింత పెనవేస్తుందని” నయర్ హిత్ పేర్కొన్నాడు. ” ఆపిల్ పే, యూపీఐ మధ్య పోల్చదగిన సేవలు ఉన్నప్పటికీ.. ఇండియాలో యూపీఐ అనేది ఉచితం, ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయం లో ఒక భాగం.. అయితే ఆపిల్ పే లో పూర్తి ప్రైవేట్ సంస్థది. దాని ద్వారా జరిపే చెల్లింపుల పరిమాణం రోడ్డు నుంచి ఏడు శాతం వరకు ఉంటుంది.
“అమెరికాలో క్రమబద్ధమైన క్యూ లు ఉంటాయి. భారత్ లో కాఫీ కౌంటర్లు, దుకాణాలలో క్యూ లైన్ లు అస్తవ్యస్తంగా ఉంటాయని” నయర్ హిత్ వివరించాడు. ” ఆహార విషయంలో అమెరికా – భారత్ ఒకటే. భారత్ రావడం వల్ల బర్గర్ ల నుంచి నాకు ఉపశమనం లభించింది. దోశలు, బిర్యానీలు తినే అవకాశం లభించింది.. ఇదే సమయంలో కొన్ని రకాల జున్నులు, బ్రెడ్ లు, డెజర్ట్ లను నేను కోల్పోయానని” నయర్ హిత్ రాస్కొచ్చాడు.
“భారత్ – అమెరికాలో జాబ్ మార్కెట్ చాలా కఠినమైనది. అయితే ఇందుకు వేర్వేరు కారణాలు ఉన్నాయి. భారత్ లో మీరు త్వరగా నే ఉద్యోగం పొందొచ్చు. కానీ అమెరికాలో అంత సులభం కాదు. ఇల్లు కొనుగోలు చేసి, కారు సంపాదించి, ఒక స్థాయి స్తోమతను ప్రదర్శించాలంటే చాలా సమయం పడుతుంది. అధిక చెల్లింపులను పొందే ఉద్యోగం సాధించాలంటే అమెరికాలో అంత ఈజీ కాదు. చాలామంది అమెరికా అంటే ఆశల స్వర్గం అనుకుంటారు కానీ.. అలా ఉండదు. క్షేత్రస్థాయి పరిస్థితులు అత్యంత కఠినంగా ఉంటాయి. అన్నింటినీ ఎదుర్కొంటేనే అక్కడ బతికేందుకు అవకాశం ఉంటుందని” నయర్ హిత్ చెప్పుకొచ్చాడు. అమెరికాలో నిరుద్యోగం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఖరగ్ పూర్ లో ఐఐటి చదివి.. అమెరికా వెళ్లి.. అక్కడ ఒక సంస్థను నెలకొల్పి.. తర్వాత ఇండియాకు వచ్చిన నయర్ హిత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది.
3/10
Digital convenience in India is on another level.Quick commerce delivers groceries/essentials in 10 minutes, food delivery is fast and efficient.
Sure, the US has Instacart & DoorDash, but the intra-city logistics here are far superior & efficient.
— Nayrhit (@NayrhitB) August 20, 2024