Darien Gap: శరణార్ధులపై దాష్టీకాలు.. అక్కడ ఇవి నిత్య కృత్యాలు..

కొలంబియా, పనామాకు మధ్యలో అటవీ ప్రాంతం ఉంది. దీనినే డేరియన్‌ గ్యాప్‌ అంటారు. కొలంబియాలోని ఈ ప్రాంతం మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేసే ముఠాల అధీనంలో ఉంటుంది.

Written By: Raj Shekar, Updated On : May 24, 2024 9:48 am

Darien Gap

Follow us on

Darien Gap: అగ్రరాజ్యాం అమెరికాలో ఏదైనా ఉపాధి దొరుకుతుందన్న ఆశతో అన్నింటికీ తెగించి అక్రమ మార్గంలో అదేశంలో అడుగు పెడుతున్న శరణార్ధులపై డ్రగ్స్‌ ముఠాలు దాష్టీకాలకు పాల్పడుతున్నాయి. దారికాచి శరణు కోరి వచ్చే మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వీరిని ఎదురించే ధైర‍్యం ఎవరికీ లేదు. ఎదిరిస్తే ప్రాణాలు తీసేస్తారు. అందుకే రవాణా స్మగ్లర్లకు లొంగిపోతున్నారు. ఈ క్రమంలో వారి లైంగికదాడికి గురైనా గర్భం రాకుండా ఉండేందుకు శరణార్ధ మహిళలు గర్భ నిరోధక మాత్రులు తీసుకెళ్తున్నారు.

ఎక్కడ ఉందీ దారి..?
కొలంబియా, పనామాకు మధ్యలో అటవీ ప్రాంతం ఉంది. దీనినే డేరియన్‌ గ్యాప్‌ అంటారు. కొలంబియాలోని ఈ ప్రాంతం మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేసే ముఠాల అధీనంలో ఉంటుంది. మనిషికి ఇంత అని డబ్బు తీసుకుని ఇక్కడికి పంపిస్తారు. కేవలం డేరియన్లోనే కాదు అమెరికా సరిహద్దు దేశమైన మెక్సికోకు చేరుకునే వరకూ మహిళలకు ఎలాంటి రక్షన ఉండదు. వీరిని తీసుకెళ్లే గైడ్లు మహిళల సంచుల్లో కండోమ్‌ ప్యాకెట్లు ఉంచుతారు. రౌడీ మూకలు అడ్డగిస్తే ఏమాత్రం ప్రతిఘటించకుండా లొంగిపోవాలని సూచిస్తారు.

ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే..
ఉపాధి కోసం అక్రమార్గంలో అమెరికాకు చేరుకోవాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే. కొలంబియా, పనామా, కోస్తారికా, నికరాగువా, హోండురాస్, గ్వాటిమెలా, మెక్సికోలు దాటాలి. మాన, ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. ప్రత్యేకించి దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికా దేశాలకు చెందిన వేలాదిమంది ఇలాంటి మార్గాల్లో ప్రయాణిస్తుంటారు. మార్గమధ్యంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ దారిలో అనేక నదులు, అరణ్యాలు, ఎడారులు కూడా ఉంటాయి.

చేరినా దొరికిపోతారు..
మెరుగైన జీవితం కోసం నిత్యం వేలాదిమంది అభాగ్యులు సవాళ్లను ఎదుర్కొంటూ ప్రయాణం సాగిస్తుంటారు. తీరా మెక్సికో దాటినా అక్కడ అమెరికా దళాలు పట్టుకొని తిరిగి వారి స్వదేశాలకు పంపుతున్నాయి. సొంత దేశాల్లో అవినీతిమయమైన ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల ముఠాలతో నిత్యం చస్తూ బతుకుతూ హమ్మయ్య అని అమెరికా చేరుకున్నా.. కథ మళ్లీ మొదటికి వస్తుంది. కొందరికి మాత్రం శరణార్థుల కింద అమెరికా ఆశ్రయం కల్పిస్తుంది.