Hormuz Strait six ships India LPG relief: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు, గ్యాస్ రవాణా 20–30 శాతం నియంత్రిస్తుంది. భారత్‌కు వచ్చే ముడి చమురులో 88 శాతం, ఎల్పీజీలో 60 శాతం ఈ మార్గం గుండానే వస్తుంది. అయితే యుదక్ధం కారణంగా ఇరాన్ ఈ జలసంధిని మూసివేసింది. దీంతో వందల నౌకలు అక్కడే ఆగిపోయాయి. తాజాగా ఇరాన్ శత్రు దేశాలు మినహా మిత్రదేశాల నౌకలకు అనుమతి ఇచ్చింది. దీంతో భారత ట్యాంకర్ల ప్రయాణం సులభమైంది. దీంతో ఆరు ఎల్పీజీ నౌకలు భారత్‌కు బయల్దేరాయి.
92 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ..
హర్మూజ్ దాటిన ఆరు కంటెయినర్లు మార్చి 26–28 మధ్య భారత తీరాలకు చేరుకుంటాయి. వీటిలో 92 వేల మెట్రిక్ టన్నుల వంటగ్యాస్ వస్తుంది. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు వీటిని బుక్ చేశాయి. ఇప్పటికే ’పైన్ గ్యాస్’, ’జగ్ వసంత్’, ’శివాలిక్’, ’నందాదేవి’ వంటి నౌకలు ముంద్రా, కాండ్లా, విజయవాడ రేవులకు చేరుకున్నాయి. తాజాగా వచ్చే ఆరు నౌకలతో ఎల్పీజీ సమస్య దాదాపు తీరుతుంది.
ఇంధన లభ్యత పెంపు..
ఈ సరఫరాతో చమురు, ఎల్ఎన్జీ, సీఎన్జీ, డీజిల్ స్టాకులు పెరుగుతాయి. 15–20 రోజులకు సరిపడా అందుబాటులో ఉంటుంది. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి 25–38 శాతం పెంచి, 88 లక్షల కమర్షియల్ బుకింగ్‌లకు గ్యాస్ అందుతుంది. హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కలిసి 26 పంపిణీ కేంద్రాల నుంచి పంపిణీ వేగవంతం చేశాయి
దౌత్య, భద్రతా చర్యలు..
ఇరాన్‌తో చర్చలు, ’ఆపరేషన్ సంకల్ప్’లో భారత నౌకాదళం యుద్ధనౌకలు రవాణా రక్షణలో ఉన్నాయి. గతంలో 28 ట్యాంకర్లు చిక్కుకున్నా, ఇప్పుడు దశలవారీగా భారత్‌కు వస్తునర్నాయి.అమెరికా, ఇజ్రాయెల్ షిప్పింగ్‌కు మాత్రం నిషేధం అమలవుతుంది.
హర్మూజ్ ఆధారం తగ్గించుకోవాలంటే అస్త్రేలియా, అమెరికా మార్గాలు, దేశీయ రిఫైనరీలు, పీఎన్జీ విస్తరణ అవసరం. ప్రస్తుతం ఇరాన్ మిత్రత్వం ప్రయోజనకరం కానీ, సంక్షోభం తీవ్రమైతే బ్లాక్‌మార్కెట్ పెరుగుతుంది. ధరలు పెరుగుతాయి.