Highest Divorce Rate: మనదేశంలో ఇప్పుడంటే పరిస్థితులు మారిపోతున్నాయి గానీ.. ఒకప్పుడు భార్యాభర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని విభేదాలు వచ్చినా కలిసి ఉండేవారు. ఉమ్మడి కుటుంబానికి నిజమైన అర్థం చెప్పేవారు. అప్పట్లో మనదేశంలో ఉమ్మడి కుటుంబాలు కూడా అధికంగా ఉండేవి. ఇంటి పెద్దలే పెత్తనాన్ని సాగించేవారు. ఆలూమగల మధ్య ఏవైనా విభేదాలు వస్తే వెంటనే పరిష్కరించేవారు. పరిష్కారం దిశగా అడుగులు వేసేవారు. అంతేతప్ప దాంపత్యాన్ని మూడు ముక్కలు అయ్యదాక ఉండనిచ్చేవారు కాదు. అందువల్లే మనదేశంలో ఇప్పటికి కూడా ఉమ్మడి కుటుంబాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి.
వెస్ట్రన్ కల్చర్ అనేది మనదేశంలోకి ప్రవేశించిన తర్వాత చాలామందిలో వైవాహిక జీవితం మీద ఒక రకమైన భావన కలుగుతుంది. దీనికి తోడు ఆర్థిక స్థిరత్వం కూడా పురుషులు, స్త్రీలలో పెరిగిపోవడంతో విడాకులు అనేవి సర్వ సాధారణంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు శ్రీమంతులు మాత్రమే తమ వైవాహిక జీవితం గురించి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు శ్రీమంతుల నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు వైవాహిక జీవితంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.. అంతిమంగా అవి భారతీయ సంప్రదాయాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. ఇది ఇంతవరకు వెళ్తుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే పరిస్థితి బాగోలేదు. బాగుపడుతుందనే నమ్మకం కనిపించడం లేదు.
మనదేశంలో ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తేనే గుండెలు అదిరిపోతున్నాయి. పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఆ తర్వాత కోర్టు మెట్లు ఎక్కి విడాకులు తీసుకోవడం ఎందుకు? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కానీ ఈ ప్రపంచంలో ఓ దేశంలో మాత్రం పెళ్లి చేసుకోవడం ఎంత ఈజీనో.. విడాకులు తీసుకోవడం కూడా అంతే సులభం. కలిసి ఉన్నంతకాలం ఉంటారు. విభేదాలు వస్తే మరో మాటకు తావు లేకుండా విడిపోతుంటారు.. ఇంతకీ ఆ దేశం ఎక్కడుందంటే..
యూరప్ ప్రాంతంలో ఉన్న పోర్చుగల్ విభిన్నమైన దేశం. ఇక్కడ ఫుట్బాల్ ఆటకు విపరీతమైన క్రేజీ ఉంటుంది. వ్యాపారాలు, వ్యవసాయం, పర్యాటకం మీద ఆధారపడిన ఈ దేశం లోని ప్రజలలో అక్షరాస్యత అధికం. పైగా ఈ దేశం సంపన్నమైనది కూడా. అందువల్లే పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడిపోవడం ఇక్కడ సర్వసాధారణం. ప్రపంచంలోనే అత్యధికంగా విడాకులు తీసుకుంటున్న జంటలు ఇక్కడ ఉన్నాయి. ఓ నివేదిక ప్రకారం పోర్చుగల్ ప్రాంతంలో విడాకులు తీసుకున్న వారి సంఖ్య 94 శాతం వరకు ఉంటుంది. ఆ తర్వాత స్థానంలో స్పెయిన్ ఉంది. ఈ దేశంలో విడాకులు తీసుకునే వారి శాతం 85 గా నమోదయింది. లక్సెంబర్గ్ లో 79 శాతం, రష్యాలో 73%, ఉక్రెయిన్ లో 70%, క్యూబాలో 55%, ఫిన్లాండ్లో 55, బెల్జియంలో 53, ఫ్రాన్స్ లో 51, స్వీడన్ 50, నెదర్లాండ్ 48, కెనడా 47, ఇటలీ 46, డెన్మార్క్ 46, సౌత్ కొరియా 46, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 45, చైనా 44, ఆస్ట్రేలియా 43, న్యూజిలాండ్ 41, యునైటెడ్ కింగ్డమ్ 41, జర్మనీ 38, జపాన్ 35, పోలాండ్ 33, కొలంబియా 30, టర్కీ 25, బ్రెజిల్ 21, సౌత్ ఆఫ్రికా 17, ఈజిప్ట్ 17, మెక్సికో 17, ఇరాన్ 14, తజకిస్తాన్ 10, వియత్నం 7, ఇండియా లో 1 శాతం విడాకులు నమోదవుతున్నాయి.