Pakistan And Afghanistan War: మొన్నటివరకు రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం.. ఆ తర్వాత గాజా, పాలస్తీనా మధ్య వార్.. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య వివాదం.. ఇలా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో పక్కపక్కకే ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 9న ఆఫ్గానిస్థాన్ ను లక్ష్యంగా చేసుకొని కాబుల్ పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో సాధారణ పౌరులు మరణించారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న తాలిబాన్లు ప్రతీకారంగా పాకిస్తాన్పై దాడులు ప్రారంభించారు. తాజాగా నిర్వహించిన దాడుల్లో పాకిస్తాన్ కి చెందిన నలుగురు సైనికులు చనిపోయినట్లు ప్రకటించారు. అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండు ముస్లిం దేశాలే. కానీ అనుకోకుండా ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దాడి చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఈ యుద్ధం తీవ్రస్థాయికి చేరనుందా?
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సరియైన సరిహద్దురేఖ లేదు. అయితే రెండు దేశాల మధ్య 2,600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన Tehariki Taliban Pakistan (TTP) అనే గ్రూప్ పాకిస్తాన్లోకి అక్రమంగా చొరబడి తమ పౌరులను చంపుతున్నారని వాదన చేస్తోంది.ఇది ఉగ్రవాద సంస్థ అని పాకిస్తాన్ భావిస్తుంది. అయితే ఈ గ్రూపును మట్టు పెట్టడానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి పాకిస్తాన్ వైమానిక దాడులు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆఫ్గానిస్థాన్ మాత్రం తమ దేశంపై అకారణంగా కాల్పులు జరిపినట్లు భావించి ప్రతీకారం తీసుకోవడానికి సిద్ధమైనట్లు అధికారికంగానే ప్రకటించింది.
ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రస్తుతం తాలిబన్ల ప్రభుత్వం కొనసాగుతోంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అమెరికా తన మిలటరీని 20 ఏళ్లుగా ఇక్కడ కొనసాగించింది. ప్రపంచంలో ఎంతో శక్తివంతమైన అమెరికా మిలిటరీని వెనక్కి పంపిన ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది దేశాల్లోనూ ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇరుదేశాల్లోని ప్రజలు ఆహారం దొరకక అలమటిస్తున్నారు. ఇలాంటి సమయంలో రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు పాకిస్తాన్ దేశంలో కొన్ని ప్రదేశాల్లో చైనా కొన్ని ప్రాజెక్టులను చేపట్టినట్లు సమాచారం. అయితే TTP గ్రూప్ ఈ ప్రాజెక్టులపై దాడులు చేస్తున్నట్లు పాకిస్తాన్ గుర్తించింది. అయితే ఈ గ్రూపుకు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం సపోర్ట్ గా ఉందని భావించి ఆ దేశం పై దాడులకు దిగుతుందని మరోవాదనే ఉంది. అంటే చైనా ప్రభుత్వం పాకిస్తాన్లో చేపట్టే కొన్ని ప్రాజెక్టులకు ఎదురు దెబ్బలు రావడంతో వాటి నుంచి తట్టుకోవడానికి పాకిస్తాన్పై ఒత్తిడి తేగా.. పాకిస్తాన్ ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ దేశంపై యుద్ధం ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు దేశాల కు ఏ దేశం మద్దతు ఇస్తుందో? తెలియని పరిస్థితి. ఎందుకంటే చైనాకు పాకిస్తాన్ దేశం దగ్గరగా ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు అఫ్గానిస్తాన్ దేశంతో యుద్ధం ప్రకటించలేదు. ఎందుకంటే అమెరికా లాంటి దేశాలే తాలిబాన్లతో వేగలేక కామ్ గా కూర్చున్నాయి. మరి ఈ పరిస్థితి ఎలా సద్దుమరుగుతోందో చూడాలి.