Homeఅంతర్జాతీయంBaldness Cure Temple Japan: అద్దంలో బట్టతల చూసుకొని బాధపడకండి.. ఈ దేవుడికి మొక్కితే జుట్టు...

Baldness Cure Temple Japan: అద్దంలో బట్టతల చూసుకొని బాధపడకండి.. ఈ దేవుడికి మొక్కితే జుట్టు గ్యారంటీ

Baldness Cure Temple Japan: శీర్షిక చదివి ఈ కాలంలో కూడా ఇలాంటివి జరుగుతాయా.. ఇంకా ఎక్కడున్నారు స్వామి.. స్మార్ట్ ఫోన్ యుగంలో దేవుళ్ళు.. జుట్టు అంటూ మాట్లాడుతున్నారు అనుకోకండి. ఎవరి నమ్మకాలు వారివి. ఇంతకీ బట్టతల మీద జుట్టు మొలిపించే ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు.. ఎలాంటి మొక్కులు మొక్కితే ఆ దేవుడు జుట్టును ప్రసాదిస్తాడు.. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

ప్రతిరోజు మనకు ఏదో ఒక సందర్భంలో బట్టతల ఉన్నవారు కనిపిస్తూనే ఉంటారు. వారు నిత్యం బాధపడుతూనే ఉంటారు. ఎందుకంటే జుట్టు ఉంటేనే ముఖం బాగుంటుంది. ఆ జుట్టు లేకపోతే విక్రమార్కుడు సినిమాలో మంత్రిగారి భార్య లాగా ఉంటుంది. బట్టతల చూసుకొని బాధపడేవారు.. దానిమీద జుట్టును రాబట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఖరీదైన ఆయిల్స్ వాడుతుంటారు. వైద్యులను సంప్రదించి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. అయినప్పటికీ అంతగా ఉపయోగముండదు.

బట్టతల మీద జుట్టు మొలిపించడానికి ఒక దేవుడున్నాడు. కాకపోతే ఆ దేవుడు మనదేశంలో లేడు. జపాన్ దేశంలో ఉన్నాడు. ఆశ్చర్యంగా ఉంది కాదు.. జపాన్ దేశంలోని క్యోటో నగరంలో ఉన్న మికామి అనే పుణ్యక్షేత్రానికి బట్టతల ఎక్కువగా ఉన్నవారు వెళుతూ ఉంటారు. ఆ ఆలయంలో దేవుడిని దర్శించుకుంటే జుట్టు వస్తుందని అక్కడ ప్రజలు నమ్ముతుంటారు. అక్కడ గుడిలో జరిగే పూజలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి.

ఆలయానికి వెళ్లేవారు ప్రత్యేకమైన కవర్ కొనుక్కుని వెళతారు. ఆలయంలో ఉండే పూజారులు భక్తుల జుట్టును కొంత కత్తిరిస్తారు. దాన్ని ఆ కవర్లో వేస్తారు. అ కవర్ ను భక్తులు అక్కడి దేవుడి వద్ద పెడతారు. ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఆ కవర్ ను ఆలయంలోని పూజారులకు అందిస్తారు. ఇలా అనేక సందర్భాల్లో చేయడం ద్వారా కోల్పోయిన వెంట్రుకలు మళ్ళీ వస్తాయని.. వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు మొత్తం పరిష్కారం అవుతాయని అక్కడి భక్తులు నమ్ముతుంటారు. దీని వెనుక కూడా ఒక చరిత్ర ఉంది. ఈ ఆలయంలో ఒక క్షురకుడు ఉండేవాడు. ఇతడిని జపాన్ దేశంలో తొలి హెయిర్ డ్రెస్సర్ అని పిలుస్తుంటారు. ఇతడు వృత్తినే దైవంగా భావించేవాడు. అందువల్లే ఆయన పేరు మీద ఈ ఆలయాన్ని నిర్మించారు. అతడు చనిపోయిన రోజు జపాన్ దేశంలో ఉన్న క్షురకులు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version