Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » World » Gunman who shot donald trump identified as 20 year old thomas matthew crooks

Donald Trump Attack: ట్రంప్ పై కాల్పులకు పాల్పడింది ఇతడే… అతడి నేపథ్యం ఏంటంటే..

ట్రంప్ పాల్గొన్న ఎన్నికల ర్యాలీ వేదికకు 130 గజాల దూరం నుంచి క్రూక్స్ కాల్పులకు తెగబడ్డాడు. ఓ ఫ్యాక్టరీ పైకప్పు నుంచి అతడు మాటు వేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 5 షాట్లు అతడు కాల్చాడు. ఒక బుల్లెట్ ట్రంప్ చెవి మీదుగా దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆయన చెవికి తీవ్రంగా గాయమైంది. రక్త స్రావం కూడా అధికంగా జరిగింది. ఆ సమయంలో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రంప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని federal bureau investigation అధికారులు చెబుతున్నారు.

Written By: Anabothula Bhaskar , Updated On : July 14, 2024 / 02:09 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Gunman Who Shot Donald Trump Identified As 20 Year Old Thomas Matthew Crooks

Donald Trump Attack

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Donald Trump Attack: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పులకు సంబంధించిన కేసులో పురోగతి లభించింది. ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడి వివరాలను federal bureau investigation వెల్లడించింది.. ఈ ఘటన వల్ల కలకలం నెలకొన్న నేపథ్యంలో.. కేసును విచారించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది. వారితో పాటు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా కేసును దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా కీలక విషయాలను వెల్లడించారు.

పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్ కు చెందిన మాథ్యూ క్రూక్స్ ట్రంప్ పై కాల్పులకు పాల్పడ్డాడని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు వెల్లడించారు. ఓటింగ్ నివేదికల ప్రకారం అతడి వయసు 20 ఏళ్ళు. రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుడిగా అతడు తన పేరును నమోదు చేసుకున్నాడు. అయితే ఈ వ్యక్తి 2021లో 15 డాలర్లను డెమోక్రట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసివ్ టర్న్ అవుట్ ప్రాజెక్ట్ కు చారిటీ కింద ఇచ్చాడు. ట్రంప్ పై కాల్పులు జరిపిన అనంతరం క్రూక్స్ పై భద్రతా దళాలు తుపాకులను ఎక్కుపెట్టాయి. ఈ ఘటనలో అతడు కన్నుమూశాడు. ప్రస్తుతం క్రూక్స్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు..

Federal bureau investigation క్రూక్స్ గురించి కీలకమైన వివరాలు వెల్లడించిన తర్వాత.. సామాజిక మాధ్యమాలలో అతడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కొంతమంది పోస్ట్ చేశారు. ఇక అమెరికా కేంద్రంగా పనిచేసే వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఇంకా కొన్ని సుప్రసిద్ధ మీడియా సంస్థలు క్రూక్స్ కాల్పులకు పాల్పడ్డాడని పేర్కొంటూ ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి. అతడి ఫోటోలను ముందుగానే టెలికాస్ట్ చేశాయి. ఇక కాల్పులకు ముందు క్రూక్స్ ఒక వీడియో రూపొందించాడు. అది కూడా సామాజిక మాధ్యమాలలో తెగ సర్కులేట్ అవుతోంది. ఆ వీడియోలో ” నేను రిపబ్లికన్ పార్టీని ద్వేషిస్తున్నాను. ట్రంప్ నాయకత్వాన్ని నిరసిస్తున్నాను” అంటూ క్రూక్స్ వ్యాఖ్యలు చేయడం విశేషం.

ట్రంప్ పాల్గొన్న ఎన్నికల ర్యాలీ వేదికకు 130 గజాల దూరం నుంచి క్రూక్స్ కాల్పులకు తెగబడ్డాడు. ఓ ఫ్యాక్టరీ పైకప్పు నుంచి అతడు మాటు వేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 5 షాట్లు అతడు కాల్చాడు. ఒక బుల్లెట్ ట్రంప్ చెవి మీదుగా దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆయన చెవికి తీవ్రంగా గాయమైంది. రక్త స్రావం కూడా అధికంగా జరిగింది. ఆ సమయంలో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రంప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని federal bureau investigation అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించామని.. మరి కొద్ది రోజుల్లో కీలక విషయాలు వెల్లడిస్తామని వారు అంటున్నారు. ఏదైనా సమాచారం తెలిస్తే తమకు వెల్లడించాలని.. ర్యాలీలో ఏవైనా ఆధారాలు లభిస్తే తమకు అందించాలని federal bureau investigation అధికారులు సామాజిక మాధ్యమాలలో ఇప్పటికే ప్రకటనలు చేశారు.

మరోవైపు ఈ ఘటన తర్వాత సోషల్ మీడియా లో పలువురు అమెరికన్లు పోస్టింగులు చేస్తున్నారు.. అమెరికాలో భద్రతపై అనుమానాలు, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. “ఒక మాజీ అధ్యక్షుడికి పూర్తిస్థాయిలో భద్రత కల్పించలేకపోయారు. అతని ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉంటారా.. స్థానికులు హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలో మిగతా వారి భద్రత పరిస్థితి ఏమిటి? ప్రపంచానికి అమెరికా చెబుతున్న పాఠం ఇదేనా.. అమెరికా నుంచి నేర్చుకోవలసిన విషయాలు ఇవేనా” అంటూ అమెరికన్ పౌరులు విమర్శిస్తున్నారు.

Anabothula Bhaskar

Anabothula Bhaskar Author - OkTelugu

Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

View Author's Full Info

Web Title: Gunman who shot donald trump identified as 20 year old thomas matthew crooks

Tags
  • Donald Trump
  • donald trump attack
  • Joe Biden
  • thomas matthew crooks
  • US Presidential Elections
Follow OkTelugu on WhatsApp

Related News

Trump shocked China: చైనాకు షాక్‌ ఇచ్చిన ట్రంప్‌.. భద్రతా వ్యూహమా.. రాజకీయ ఒత్తిడా..?

Trump shocked China: చైనాకు షాక్‌ ఇచ్చిన ట్రంప్‌.. భద్రతా వ్యూహమా.. రాజకీయ ఒత్తిడా..?

Illegal immigrant protests : అమెరికాను కుదిపేస్తున్న అక్రమ వలసదారుల కట్టడి

Illegal immigrant protests : అమెరికాను కుదిపేస్తున్న అక్రమ వలసదారుల కట్టడి

Donald Trump Elon Musk Friendship: ట్రంప్‌–మస్క్‌ మధ్య మళ్లీ స్నేహం.. వివాదం నుంచి సయోధ్య వైపు ఎలా సాగింది?

Donald Trump Elon Musk Friendship: ట్రంప్‌–మస్క్‌ మధ్య మళ్లీ స్నేహం.. వివాదం నుంచి సయోధ్య వైపు ఎలా సాగింది?

Donald Trump: విమానం ఎక్కుతూ తూలిపడ్డ డోనాల్డ్ ట్రంప్

Donald Trump: విమానం ఎక్కుతూ తూలిపడ్డ డోనాల్డ్ ట్రంప్

Los Angeles Tensions: వలసదారుల తరలింపు.. లాస్ ఏంజెలెస్ లో తీవ్ర ఉద్రిక్తతలు

Los Angeles Tensions: వలసదారుల తరలింపు.. లాస్ ఏంజెలెస్ లో తీవ్ర ఉద్రిక్తతలు

Putin calls Elon Musk : ఎలాన్‌ మస్క్‌కు పుతిన్‌ పిలుపు.. ట్రంప్‌తో వివాదం నేపథ్యంలో బంపర్‌ ఆఫర్‌!

Putin calls Elon Musk : ఎలాన్‌ మస్క్‌కు పుతిన్‌ పిలుపు.. ట్రంప్‌తో వివాదం నేపథ్యంలో బంపర్‌ ఆఫర్‌!

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.