Gulf Muslim countries: ఇటీవల జరిగిన ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ముస్లిం దేశాల మధ్య అనైక్యతను బహిర్గతం చేశాయి. పైకి ముస్లిం దేశాలన్నీ ఐక్యంగా ఉన్నామని చెబుతున్నాయి. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోటాడుతామంటున్నాయి. కానీ, తాజా యుద్ధంలో ఇరాన్‌కు ఒక్క ఇస్లాం దేశం కూడా మద్దతు తెలుపలేదు. పైగా వాళ్లలో వారే కలహాలు పెట్టుకుంటూ.. పరోక్షంగా ఉమ్మడి శత్రువు అయిన ఇజ్రాయెల్‌కు పరోక్షంగా సహకరిస్తున్నాయి.
గల్ఫ్ ప్రాంతం, ముఖ్యంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్య దేశాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్, కువైట్, ఒమన్, బహ్రెయిన్ సంక్లిష్ట భౌగోళిక రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్నాయి. ఈ దేశాల మధ్య విభేదాలు, మిత్రత్వాలు రెండూ ఉన్నాయి.
ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర నష్టం..
ఇటీవల 12 రోజులపాటు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. అణ్వస్త్రాలు పూర్తిగా దెబ్బతినకపోయినా నష్టం మాత్రం తీవ్రంగా జరిగింది. ఇక వంద మంది వరకు ఇరానీయులు మరణించారు. వీరిలో సైనికులు, అధికారులు, అణు శాస్త్రవేత్తలే ఎక్కువ. ఇక ఇజ్రాయెల్‌లో 20 మంది వరకు మరణించారు. ఇందులో ఐదుగురు సైనికులు ఉండగా, మిగతావారు సామాన్యులు. అంటే ఇజ్రాయెల్ దాడులు లక్ష్యాన్ని చేరుకున్నాయి.
ఇరాన్‌కు ఆశాభంగం..
ఇక ఇజ్రాయెల్‌పై వ్యతిరేకంగా ఇస్లాం దేశాలు అన్నీ తనకు మద్దతు ఇస్తాయని ఇరాన్ భావించింది. కానీ, ఒక్క దేశం కూడా ఇరాన్‌కు మద్దతు ఇవ్వలేదు. పాకిస్తాన్ ఒక అడుగు ముందుకు వేసి.. నాలుగు అడుగులు వెనకకు వేసింది. ఇజ్రాయెల్‌పై అణుబాంబు వేస్తామని ఇరాన్‌కు హామీ ఇచ్చింది. కానీ, అమెరికా హెచ్చరికతో వెనక్కు తగ్గింది. ఇరాన్‌పై అమెరికా దాడికి పరోక్షంగా సహకారం కూడా అందించింది.
గల్ఫ్ ప్రాంతంలో విభేదాలు
సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్‌లు ఖతార్‌పై ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయని, ముఖ్యంగా ముస్లిం బ్రదర్‌హుడ్‌కు మద్దతు, ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాయి. కానీ, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మాత్రం పోరాడడం లేదు. అమెరికాకు ఆసియాలో ముఖ్యమైన ఎయిర్ బేస్‌లు మాత్రం ఇటు ఖతార్‌లో, అటు సౌదీ అరేబియాలో ఉండడం గమనార్హం.
సౌదీ అరేబియా,యూఏఈ వర్సెస్ ఇరాన్..
సున్నీ బహుళ సౌదీ అరేబియా, షియా బహుళ ఇరాన్ మధ్య పోటీ గల్ఫ్‌లోని ప్రధాన విభేదం. ఇది మతపరమైన విభేదాలు, భౌగోళిక రాజకీయ పోటీ ద్వారా నడపబడుతుంది. సిరియా, యెమెన్, ఇరాక్, లెబనాన్‌లలో ఈ పోటీ ప్రాక్సీ యుద్ధాలను రేకెత్తించింది. యెమెన్‌లో 2015 నుంచి సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్ మద్దతు హౌతీ (అన్సర్ అల్లా) శక్తులకు వ్యతిరేకంగా సంకీర్ణం నడిపాయి. సున్నీ–షియా విభజన ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తుంది, సౌదీ అరేబియా, బహ్రెయిన్ ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి షియా వ్యతిరేక రిటారిక్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇరాన్ హిజ్బుల్లా, ఇరాక్, యెమెన్‌లలోని ప్రాక్సీలకు మద్దతు ఈ విభేదాన్ని మరింత రేకెత్తిస్తుంది.
సౌదీ అరేబియా, యూఏఈ మధ్య పోటీ..
ఖతార్ సంక్షోభంలో సౌదీ అరేబియా, యూఏఈ సన్నిహితంగా ఉన్నప్పటికీ ఇరు దేశాల ఆసక్తులు విభిన్నంగా మారాయి, ముఖ్యంగా యెమెన్‌లో,యూఏఈ దక్షిణ వియోజనవాదులకు మద్దతు ఇస్తుండగా, సౌదీ అరేబియా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఆర్థిక పోటీ తీవ్రమైంది, సౌదీ అరేబియా యొక్క విజన్ 2030 సంస్కరణలు యూఏఈ ప్రాంతీయ ఆర్థిక కేంద్ర స్థితిని సవాలు చేస్తున్నాయి
తటస్థంగా కువైట్, ఒమన్..
ఇక కువైట్, ఒమన్ మాత్రం ఎందులోనూ తలదూర్చకుండా తటస్థ వైఖరి అవలంబిస్తున్నాయి. కువైట్ సెమీ–డెమొక్రటిక్ వ్యవస్థ, స్వేచ్ఛాయుత వ్యక్తీకరణను అనుమతించడం, సౌదీ అరేబియా, యూఏఈ వంటి పొరుగు దేశాలను ఒక్కోసారి చికాకు పరుస్తుంది. వీరు అసమ్మతిని కఠినంగా నియంత్రించాలని కోరుకుంటారు.