Greenland Trump: గ్రీన్‌లాండ్.. ప్రపంచంలో అందమైన ప్రాంతాల్లో ఒకటి. పర్యాటక ప్రదేశం. మూడు శతాబ్దాలుగా డెన్‌మార్కు అధీనంలో ఉన్న ఈ డెన్‌మార్క్‌ను కాజేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద ప్లాన్ వేస్తున్నాడు. గ్రీన్‌లాండ్ అమెరికా జాతీయ భద్రతకు అవసరమని ప్రకటించాడు. డెన్‌మార్క్ అధీనంలో ఉన్న ఈ ఆర్కిటిక్ ప్రాంతానికి రష్యా, చైనా నౌకలు సమీపిస్తున్నాయని, వాటి పరిశోధనా కార్యకలాపాలు అనుమానాస్పదమని ఆందోళన వ్యక్తం చేశాడు. సూపర్‌పవర్‌గా ఉన్న అమెరికాకు కూడా ఈ ప్రాంతం లేకపోతే ప్రమాదమని వాదిస్తున్నాడు. దానిని స్వాధీనం చేసుకోవాలని ప్రతిపాదించాడు.
డెన్‌మార్క్ తీవ్ర వ్యతిరేకత..
డెన్‌మార్క్, తన 300 సంవత్సరాల అధికారాన్ని రక్షించుకునేందుకు గ్రీన్‌లాండ్‌ను విక్రయించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ట్రంప్ మునుపటి కాలంలోనూ ఇలాంటి డిమాండ్ చేసినప్పుడు ఇదే స్థానం తీసుకుంది. అమెరికా సైనిక మద్దతును బెదిరింపుగా ఉపయోగించి భూభాగాన్ని ఆక్రమించాలనుకుంటున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల గ్రీన్‌లాండ్‌కు ప్రత్యేక రాయబారిని నియమించడం ఈ కుట్రల సూచనగా కనిపిస్తోంది.
ఖనిజ సంపద కోసమే..
గ్రీన్‌లాండ్‌లో అరుదైన భూగర్భ ఖనిజాలు, అధిక విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ట్రంప్ రక్షణ పేరుతో ఈ వనరులపై కన్ను పెట్టినట్టు నిపుణులు అంచనా. అలాస్కా విషయంలో రష్యాను ఇలాగే మోసం చేశాడు. ఇప్పుడు అలస్కా అమెరికాకు ఆదాయ వనరుగా మారింది. సగం బంగారం నిల్వలు అలస్కాలోనే ఉన్నాయి. గ్రీన్‌లాండ్ స్వాధీనం చేసుకుంటే అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని వాదనలు ఉన్నాయి.
ప్రపంచ శాంతికి ముప్పు
అమెరికా ఇలాంటి విధానాలు అంతర్జాతీయ సంబంధాలను కుంగదీస్తాయి. బంగ్లాదేశ్‌లోని సెయింట్ మార్టిన్ దీపాన్ని కోరినప్పుడు రాజకీయ ఒత్తిడి చేసినట్టు, ఇక్కడ కూడా స్వార్థాల కోసం చర్యలు తీసుకుంటోంది. ఇది ప్రపంచ శాంతిని దెబ్బతీసే మూర్ఖత్వమని విమర్శలు వస్తున్నాయి. దీర్ఘకాలంలో, ఇటువంటి ఆక్రమణలు కొత్త ఘర్షణలకు దారితీస్తాయి.
ఈ డిమాండ్ అమెరికా–డెన్‌మార్క్ సంబంధాలను బాగా ప్రభావితం చేస్తుంది. యూరోపియన్ యూనియన్, నాటో సంస్థలు ఈ అంశంపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఖనిజ వనరుల ఆధిపత్యం యుద్ధాలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది.