German New Army Tech: భారత్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులపై జరిగిన ఆపరేషన్ సింధూర్ నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వరకు, ఆత్మాహుతి డ్రోన్‌లను విరివిగా ఉపయోగించారు. ఈ రెండు యుద్ధాలు ప్రపంచం దృష్టిలో పడేంత వరకు డ్రోన్‌లను ఆయుధాలుగా ఉపయోగించవచ్చని చాలా మంది ఊహించి ఉండరు. కానీ మారుతున్న టెక్నాలజీ యుగంలో డ్రోన్ల ద్వారా దాడులు జరుగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య రక్షణ రంగంలో పనిచేస్తున్న కంపెనీలు ఒక అడుగు ముందుకేసి, బొద్దింకలు, మానవ రహిత ఏఐ ఆధారిత ఆయుధాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా జర్మనీ ఈ విషయంలో సరికొత్త ప్రణాళికతో ముందుకు వస్తోంది.
Also Read: అమెరికా, నాటో, ఈయూ బెదిరింపులు.. భారత్ తగ్గేదేలే
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు మూడేళ్లు దాటిపోయింది. ఈ యుద్ధం యూరోపియన్ దేశాలకు ఒక కీలకమైన పాఠం నేర్పింది. తమ రక్షణను అమెరికా, నాటో పై పూర్తిగా ఆధారపడలేమని యూరప్ గ్రహించింది. ఈ కారణంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మరోసారి యూరప్‌లో ఆయుధాల అభివృద్ధికి పోటీ మొదలైంది. ఈ పోటీలో అత్యధిక ఖర్చు చేస్తున్న దేశం జర్మనీ. వాస్తవానికి యూరప్‌లో అనేక చిన్న దేశాలు ఉన్నాయి, ఇక్కడ ఆయుధాల అభివృద్ధికి కంపెనీలకు వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. మరోవైపు, అమెరికాలో లాక్‌హీడ్ మార్టిన్, ఆర్‌టీఎక్స్ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే చాలా బలంగా ఉన్నాయి. ఉపగ్రహాలు, ఫైటర్ జెట్‌లు, స్మార్ట్ ఆయుధాలలో వాటిదే ఆధిపత్యం. ఈ నేపథ్యంలో జర్మనీ 2029 నాటికి తన రక్షణ ఖర్చును మూడు రెట్లు పెంచి, సంవత్సరాని సుమారు 175 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, అమెరికా జర్మనీకి సేఫ్టీ హామీ ఇచ్చింది. జర్మనీకి పరిమిత సైనిక వనరులను సేకరించడానికి మాత్రమే అనుమతిచ్చింది. ఈ కారణంగా జర్మనీ తన రక్షణ బడ్జెట్‌ను తగ్గించి, ఆ నిధులను ఇతర రంగాలపై ఖర్చు చేయడం ప్రారంభించింది. అయితే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తమ రక్షణను పూర్తిగా అమెరికా చేతుల్లో వదిలేయడం ప్రమాదకరమని జర్మనీకి స్పష్టంగా అర్థమైంది. అందుకే, జర్మనీ తన సొంత రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారించింది.
Also Read: ఐస్‌ల్యాండ్‌లో అద్భుతమైన లైట్‌హౌస్.. హెలికాప్టర్లు లేని కాలంలో ఎలా కట్టారంటే ?
జర్మన్ ప్రభుత్వం దేశంలోని సైనిక స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడం ప్రారంభించింది. దీని ఫలితంగా జర్మనీ ఇప్పుడు స్పై బొద్దింకలు, మానవ రహిత జలాంతర్గాములను నిర్మిస్తోంది. స్వామ్ బయోటాక్టిక్స్ అనే కంపెనీ సైబోర్గ్ కాక్రోచ్‌లను తయారు చేస్తోంది. అంటే, నిజమైన బొద్దింకలకు చిన్న బ్యాక్‌ప్యాక్‌లు తగిలించి, వాటిపై కెమెరాలను అమర్చుతున్నారు. తద్వారా అవి శత్రువుల ప్రాంతంలోకి వెళ్లి సమాచారాన్ని సేకరించగలవు. వీటి కదలికలను ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఈ సరికొత్త ఆవిష్కరణలు భవిష్యత్ యుద్ధాల స్వరూపాన్ని పూర్తిగా మార్చనున్నాయి. బొద్దింకలు వంటి చిన్న జీవులను కూడా గూఢచర్యానికి ఉపయోగించడం టెక్నాలజీ ఎంత దూరం వెళ్లిందో తెలియజేస్తుంది.