Elon Musk : మస్క్ కు టెస్లా, ట్విట్టర్ మాత్రమే కాకుండా న్యూరా లింక్స్ అనే కంపెనీ కూడా ఉంది. అది ఒక స్టార్టప్ కంపెనీ. మస్క్ కు మిగతా కంపెనీలు నష్టాలు తీసుకురావచ్చు గాని.. న్యూరా లింక్ మొదటి నుంచీ లాభాలనే అందిస్తోంది. అందువల్లే మస్క్ అంతకంతకు తన సంపాదన పెంచుకుంటూ పోతున్నాడు. న్యూరా లింక్ ద్వారా మస్క్ రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. తాజాగా చేస్తున్న ప్రయోగం పేరు బ్రెయిన్ చిప్ స్టార్టప్. దీనివల్ల ఒక మనిషి జీవితంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయి. మస్క్ న్యూరా లింక్స్ త్వరలోనే బ్రెయిన్ చిప్ స్టార్టప్ కంపెనీకి శ్రీకారం చుడుతోంది. దీనివల్ల పుట్టుకతోనే చూపు కోల్పోయిన వారికి.. తిరిగి చూపు కల్పించవచ్చు. ఆ పనిని బ్రెయిన్ చిప్ చేస్తుంది. దీనికోసం అవసరమయ్యే ప్రయోగాత్మక పరికరాన్ని అమర్చేందుకు న్యూరాలింక్ అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి పొందింది.
ఆ పరికరం పేరు ఏంటంటే
న్యూరా లింక్ తయారు చేసే ఆ పరికరం పేరు బయటికి చెప్పకపోయినప్పటికీ.. ఆ బ్లైండ్ సైట్ పరికరం అంధులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ ప్రయోగంలో చూపు కోల్పోయిన వారి బ్లైండ్ సైట్ డివైస్ ను ఆప్టిక్ నరానికి అనుసంధానం చేయడం వల్ల.. వారు ప్రపంచాన్ని చూసేందుకు అవకాశం కలుగుతుంది. పుట్టుకతో చూపు కోల్పోయిన వారు దీని ద్వారా చూపును పొందుతారు. అయితే ఈ పరికరాన్ని వాడిన తొలి రోజుల్లో చూసే సామర్థ్యం కొంత తక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి సహజమైన కంటిచూపు కంటే మెరుగ్గా చూసే అవకాశం లభిస్తుంది. అత్యంత ప్రభావితమైన అతినీలలోహిత కిరణాలను కూడా దీని ద్వారా చూడొచ్చని సామాజిక మాధ్యమాల వేదికగా మాస్క్ ప్రకటించారు.
ఆ ప్రయోగాలు కూడా
కేవలం ఈ ప్రయోగం మాత్రమే కాకుండా మనిషి మెడలో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చే ప్రయోగాన్ని న్యూరాలింక్ యుద్ధ ప్రాతిపదికన చేస్తోంది. ఈనెల మార్చిలో చిప్ అమర్చిన వ్యక్తిని న్యూరాలింక్ బయటి ప్రపంచం ముందుకు తీసుకువచ్చింది. ఆ వ్యక్తి పేరు నోలాండ్.. అతడు కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. అతడి మెదడులో చిప్ అమర్చిన తర్వాత.. న్యూరాలింక్ సంస్థ వీడియో గేమ్ సివిలైజేషన్, చెస్ వంటి గేమ్స్ అతనితో ఆడించింది. దానిని ట్విట్టర్ ఎక్స్ లో లైవ్ స్ట్రీమ్ చేసింది. ఎవరి సహాయం లేకుండానే అతడు గేమ్ ఆడినట్టు ఎక్స్ ప్రకటించింది. చెస్ ఆడుతున్నప్పుడు నో లాండ్ అందరితో మాట్లాడాడు. తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ ఏడాది చివరికల్లా మరింతమంది మెదళ్లల్లో చిప్ లు అమర్చేందుకు మస్క్ ప్రయత్నాలు చేస్తున్నారు.