Homeఅంతర్జాతీయంEarthquake In Turkey: టర్కీలో మరోసారి భూకంపం.. తీవ్ర ప్రకంపనలు.. భయం గుప్పిట్లో ఇస్తాంబుల్‌

Earthquake In Turkey: టర్కీలో మరోసారి భూకంపం.. తీవ్ర ప్రకంపనలు.. భయం గుప్పిట్లో ఇస్తాంబుల్‌

Earthquake In Turkey: టర్కీలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఇస్తాంబుల్‌ సమీపంలో బుధవారం (ఏప్రిల్‌ 23, 2025) మధ్యాహ్నం 12:49 గంటలకు రిక్టర్‌ స్కేలుపై 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మర్మర సముద్రంలోని సిలివ్రి తీరం వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు టర్కీ విపత్తు, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ (AFAD) ప్రకటించింది. ఈ భూకంపం ఇస్తాంబుల్‌ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లో తీవ్ర ప్రకంపనలను కలిగించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 2023లో సంభవించిన 7.8 తీవ్రత భూకంపం జ్ఞాపకాలు ఇంకా మరువకముందే, ఈ తాజా భూకంపం టర్కీ ప్రజలను మరోసారి భీతిలో ముంచెత్తింది.

Also Read: పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్థాన్‌ అప్రమత్తం..

టర్కీ AFAD ఏజెన్సీ ప్రకారం ఇస్తాంబుల్‌ సమీపంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ఇస్తాంబుల్‌ నగరానికి సుమారు 80 కిలోమీటర్ల పశ్చిమాన, సిలివ్రి తీరంలో మర్మర సముద్రంలో ఉంది. ఈ భూకంపం భూమి ఉపరితలం నుంచి 6.9 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌ (GFZ) తెలిపింది. ఈ భూకంపం తర్వాత 3.2 నుంచి 4.9 తీవ్రతతో ఆరు ఆఫ్టర్‌షాక్‌లు నమోదయ్యాయి, ఇవి సిలివ్రి, బుయుక్‌సెక్‌మెస్‌ వంటి ప్రాంతాల్లో స్పష్టంగా అనుభవమయ్యాయి. ఇస్తాంబుల్‌లోని బహుళ అంతస్తుల భవనాలు తీవ్రంగా కంపించడంతో, అధికారులు ప్రజలను భవనాల నుంచి ఖాళీ చేయించి, బహిరంగ ప్రదేశాలకు తరలించారు.

గాయాలు, ఆస్తి నష్టం..
ఈ భూకంపం కారణంగా ఇస్తాంబుల్‌లో 150 మందికి పైగా గాయపడినట్లు రాయిటర్స్‌ నివేదించింది. చాలా మంది భయాందోళనతో భవనాల నుంచి దూకడం వల్ల గాయాలైనట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి బాల్కనీ నుంచి దూకి గాయపడినట్లు స్థానిక మీడియా నివేదించింది. అయితే, ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం గురించి తాజా నివేదికలు లేవు. టర్కీ రవాణా మంత్రి అబ్దుల్‌కదిర్‌ ఉరలోగ్లు ప్రకారం, హైవేలు, విమానాశ్రయాలు, రైల్వేలు, మెట్రోలలో ఎలాంటి నష్టం జరగలేదని ప్రాథమిక తనిఖీలు సూచిస్తున్నాయి. సిలివ్రిలోని రాష్ట్ర ఆసుపత్రిలో రోగులను బహిరంగ ప్రదేశాలకు తరలించిన దృశ్యాలు టెలివిజన్‌ ఫుటేజ్‌లో కనిపించాయి.

2023 భూకంప జ్ఞాపకాలు..
2023 ఫిబ్రవరి 6న టర్కీలోని దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం 53 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సిరియాలో 6 వేల మంది మరణించారు. 11 ప్రావిన్స్‌లలో వేలాది భవనాలు ధ్వంసమై, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1999లో ఇస్తాంబుల్‌ సమీపంలో జరిగిన 7.4 తీవ్రత భూకంపం 17,000 మంది మరణాలకు కారణమైంది. ఈ జ్ఞాపకాలు ఇంకా తాజాగా ఉండటంతో, తాజా 6.2 తీవ్రత భూకంపం ప్రజల్లో తీవ్ర భయాందోళనను రేకెత్తించింది. సిలివ్రి, బుయుక్‌సెక్‌మెస్‌లలో భూకంప ప్రభావం ఎక్కువగా ఉండటంతో, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

టర్కీ సీస్మిక్‌ రిస్క్‌..
టర్కీ రెండు ప్రధాన ఫాల్ట్‌ లైన్‌లపై ఉండటం వల్ల భూకంపాలు తరచూ సంభవిస్తాయి. ఇస్తాంబుల్‌ సమీపంలోని నార్త్‌ అనటోలియన్‌ ఫాల్ట్‌ జోన్‌ అత్యంత సీస్మిక్‌గా చురుకైన ప్రాంతంగా ఉంది. టర్కీ సీస్మాలజిస్ట్‌లు గత కొన్నేళ్లుగా ఇస్తాంబుల్‌లో 7.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు, ఇది భారీ విధ్వంసానికి దారితీయవచ్చు. ఈ తాజా భూకంపం ఆ ‘పెద్ద భూకంపం’కు ముందస్తు సంకేతమా అని చర్చలు జరుగుతున్నాయి. ఇస్తాంబుల్‌ యొక్క 16 మిలియన్ల జనాభా, దట్టమైన నిర్మాణాలు ఈ హెచ్చరికలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

ప్రభుత్వ చర్యలు, భద్రతా ఏర్పాట్లు
టర్కీ ప్రభుత్వం భూకంపం తర్వాత వెంటనే స్పందించింది. ఇస్తాంబుల్‌లోని పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడారు, అధికారులు భవనాల భద్రతను పరిశీలిస్తున్నారు. టర్కీ ఇంటీరియర్‌ మినిస్టర్‌ అలీ యెర్లికాయా ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ, సిలివ్రిలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ధవీకరించారు. స్థానిక అధికారులు సునామీ హెచ్చరికలు లేవని స్పష్టం చేశారు. భవిష్యత్తు ఆఫ్టర్‌షాక్‌లను దష్టిలో ఉంచుకుని, ప్రజలు భవనాల్లోకి తిరిగి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అఊఅఈ సూచించింది. ఇస్తాంబుల్‌లోని పాఠశాలలు, ఆఫీసులు తాత్కాలికంగా మూతపడ్డాయి, ప్రజలు తమ సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతూ బహిరంగ ప్రదేశాల్లో ఉంటున్నారు.

ఇస్తాంబుల్‌ సమీపంలోని సిలివ్రిలో సంభవించిన 6.2 తీవ్రత భూకంపం టర్కీలో మరోసారి సీస్మిక్‌ రిస్క్‌ను గుర్తు చేసింది. 2023 భూకంపం యొక్క బాధాకర జ్ఞాపకాల నేపథ్యంలో, ఈ ఘటన ప్రజల్లో భయాందోళనను రేకెత్తించింది. అధికారులు వేగంగా స్పందిస్తూ, భద్రతా చర్యలను అమలు చేస్తున్నప్పటికీ, ఇస్తాంబుల్‌ వంటి జనసాంద్రత గల నగరంలో భవిష్యత్తు భూకంపాలను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సన్నద్ధత, భవన నిర్మాణ ప్రమాణాలు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భూకంపం టర్కీ యొక్క సీస్మిక్‌ హానిని మరోసారి బయటపెట్టింది, దీర్ఘకాలిక విపత్తు నిర్వహణ వ్యూహాలపై దష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

 

Also Read: భారత్ సంచలన నిర్ణయం.. పాకిస్తాన్ కు భారీ షాక్

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version