Trump removal debate: పశ్చిమాసియా యుద్ధం ట్రంప్ పదవికే ఎసరు తెస్తుందా.. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ వైదొలగక తప్పదా.. అగ్రరాజ్యం అమెరికా ప్రజల్లో ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందా అంటే అవుననే అంటున్నాయి అమెరికా పరిస్థితులను గమనిస్తున్న ఎనలిస్టులు. లక్ష్యం లేకుండా ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం మొదలు పెట్టాడు. వారం పదిరోజుల్లో క్లోస్ చేస్తానని భావించాడు. కానీ ట్రంప్ అంచనాలు తప్పాయి. నెల రోజులు దాటినా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. సుప్రీం లీడర్ చనిపోయినా పోరాడుతోంది. అగ్రరాజ్యం అమెరికాను ఆర్థికంగా దెబ్బకొడుతోంది. యుద్ధ విమానాలను కూల్చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఎలా ముగించాలో ట్రంప్‌కు పాలుపోవడం లేదు. దీంతో చర్చలు అంటూ కొత్త నాటకం మొదలు పెట్టారు. ఇరాన్ కండీషన్లు పెట్టడంతో ట్రంప్ ఇరుకున పడ్డాడు. గౌరవపదమైన ఎగ్జిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ యుద్ధం ట్రంప్‌పై అమెరికా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెంచుతోంది. తాజాగా ట్రంప్ పదవి నుంచి తొలగింపు అనే చర్చ రాజకీయ, మీడియా వర్గాల్లో ఆకట్టుకుంటోంది. బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ‘ఎస్’(YES)అంటూ పందెం వేసే వారి సంఖ్య పెరగడం, ఒక చట్టసభ్యుడి ప్రతిపాదనలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
బెట్టింగ్ ట్రెండ్స్..
కాల్షీ వంటి ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లలో 25వ ఏమెండ్‌మెంట్ ఆధారంగా ట్రంప్ తొలగింపు అనే ప్రశ్నకు ఎస్ అన్నవారి శాతం గత నెలలో 28.6% ఉండగా, ఇప్పుడు 35.1%కి ఎదిగింది. ఇది కేవలం ఆటగా కాకుండా, ప్రజల్లో అసంతృప్తి, ఆందోళనలను ప్రతిబింబిస్తుంది. ఈ ట్రెండ్ రాజకీయ అనిశ్చితిని కొలిచే మార్కర్‌గా పనిచేస్తుంది. ప్రజలు ట్రంప్ నిర్ణయాలపై ప్రశ్నిస్తున్నారనే సంకేతం.
చట్టసభ్యుడి ప్రతిపాదన..
తాజాగా అమెరికాకు చెందిన ఒక చట్టసభ్యుడు ట్రంప్‌ను పదవి నుంచి తొలగింపు కోసం ప్రతిపాదన వేశారు. 25వ అమెండ్‌మెంట్ ప్రకారం, ఉపాధ్యక్షుడు, కేబినెట్ సభ్యులు అధ్యక్షుడు ’బాధ్యతలు నిర్వహించలేని స్థితిలో ఉన్నాడు’ అని ప్రకటించి, అధికారాన్ని ఉపాధ్యక్షుడికి బదిలీ చేయవచ్చు. ఈ ప్రతిపాదన రాజకీయ ఒత్తిడిని పెంచుతుంది, అయితే దీనికి అవసరమైన మెజారిటీ సమ్మతి కష్టతరం. ప్రస్తుతం ఇది చర్చా దశలోనే ఉంది.
ఇరాన్ యుద్ధం, ఇతర నిర్ణయాలు..
ఇరాన్‌తో సంఘర్షణలు, కీలక విధాన నిర్ణయాల్లో ట్రంప్ వ్యవహారశైలు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు ఆందోళనలు రేపుతున్నాయి. 25వ అమెండ్‌మెంట్ మానసిక, శారీరక సమర్థతపై ఆధారపడుతుంది కాబట్టి, ఈ సంఘటనలు ఆయన ’అనుకూలత’పై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే, ఇది రాజకీయ ఆయుధంగా మారే అవకాశం ఉంది.
తొలగింపు సాధ్యత తక్కువగా ఉన్నప్పటికీ, ఈ ఊహాగానాలు అమెరికా రాజకీయాల్లో విభేదాలను హైలైట్ చేస్తున్నాయి. బెట్టింగ్ శాతాలు పెరగడం ఒత్తిడిని పెంచవచ్చు, కానీ చట్టపరమైన అడ్డంకులు ఎక్కువ. భవిష్యత్తులో ట్రంప్ నిర్ణయాలు ఈ డైనమిక్‌ను మార్చే అవకాశం ఉంది.