Donald Trump: అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. జనవరి 20న ట్రంప్ 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజు నుంచే అమెరికాలోని విదేశీయులకు కష్టాలు మొదలయ్యాయి. మొదట అక్రమంగా ఉంటున్నవారిని తరలించాలని ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత జన్మతః వచ్చే పౌరసత్వం రద్దు చేశారు. దీంతో అమెరిలో ఉంటున్న ప్రెగ్నెంట్ మహిళలు నెలలు నిండకుండానే ఇప్పుడు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ప్రసవం చేయించుకుంటున్నారు. ఇక భారత్ నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లినవారిని భారత్‌కు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్ కూడా ఇందుకు అంగీకరించింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఇక స్థానికులకే ఉద్యోగాలు దక్కాలన్న ఆలోచనతో ట్రంప్ మళ్లీ ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అన్న ఆందోళన ఇప్పుడు ఉద్యోగుల్లో కనిపిస్తోంది.
ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినం..
ట్రంప్.. తాజాగా ఇమ్మిగ్రేషన్(immigration) నిబంధనలు కఠినతరం చేశారు. దీంతో భారతీయ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. వర్కింగ్ వీసాతో వచ్చేవాళ్లకు కంపెనీ సపోర్టు ఉంటుంది. కానీ లక్షల రూపాయలు వెచ్చించి ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన విద్యార్థుల పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇమ్మిగ్రేషన్ పాలసీపై ఓ ట్రైలర్ చూపించిన ట్రంప్.. ఇకపై సినిమా చూపేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుందేమో అని టెన్షన్ పడుతున్నారు.
పార్ట్ టైం జాబ్స్ ఊస్ట్..
అమెరికా యూనవర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థులు అక్కడే పార్ట్‌టైం జాబ్స్(Part time Jobs)కూడా చేస్తారు. చాలా మంది యూనివర్సిటీల్లోనే జాబ్స్ చేస్తారు. అయితే ట్రంప్ మొదట ఈ పార్ట్ టైం ఉద్యోగాలకు చెక్ పెట్టాలనుకుంటున్నాడు. పార్ట్‌టైం జాబ్ చేయకుంటే భారతీయులు విదేశాల్లో ఉండలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ జాబ్ చేస్తేనే వారికి ఆదాయం. రోజులు గడుస్తాయి. లేదంటే తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సి వస్తుంది. దీంతో చాలా మంది ఉద్యోగాలు కూడా వదులుకుంటున్నారు.
చదవు ఆషామాషీ కాదు..
ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో చదువు ఇక ఆషామాషీ కాదన్న విషయం విద్యార్థులకు అర్థమవుతోంది. విద్యార్థులు చదువుకోవడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. బ్యాంకు బ్యాలెన్స్ చూపించాలి. ఆర్థికంగా ఫిట్‌గా ఉన్నామని నమ్మకం కలిగించాలి. ఆ తర్వాత వీసా, ఇంటర్వ్యూ ఉంటాయి. ఇదంతా ఓకే అయినా ఎఫ్1 వీసా వస్తే.. అప్పుడు డాలర్ డ్రీమ్ నెరవేరుతాయి. ఇంత జరగాలి అంటే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పులు చేయాల్సిందే. బ్యాంకు నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాల్సిందే. ఇంత చేసిన ఇప్పుడు చదువుకు అనుమతి వస్తుందా లేదా అన్న టెన్షన్ ఉంది.