Homeఆంధ్రప్రదేశ్‌Peddireddy Ramachandra Reddy: నిన్న విజయసాయి.. నేడు పెద్దిరెడ్డి.. అయినా జగన్ మౌనం!*

Peddireddy Ramachandra Reddy: నిన్న విజయసాయి.. నేడు పెద్దిరెడ్డి.. అయినా జగన్ మౌనం!*

Peddireddy Ramachandra Reddy: వైసీపీని( YSR Congress ) వెంటాడుతోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేత విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవిని వదులుకొని రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు. అయితే ఇదంతా బిజెపి ఆడిస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైతం కూటమి ప్రభుత్వం వెంటాడుతోంది. ముప్పేట కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గత ఐదేళ్లలో ఆయన చేసిన అక్రమాలను బయటపెడుతోంది. అయితే సీనియర్లకు ఈ స్థాయిలో కూటమి వెంటాడుతున్నా అధినేత జగన్ మాత్రం మౌనంగా ఉన్నారు. అదే పార్టీ శ్రేణుల్లో ఆందోళనకు కారణం అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ అమల్లో ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబుతో పాటు నారా లోకేష్ చాలా తెలివిగా.. కేంద్రం ద్వారా అన్ని పనులు చేయించుకుంటున్నారు. విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి నిష్క్రమణ ప్రకటన వెనుక అదే కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరో కీలక నేత పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

* పెద్దిరెడ్డి చుట్టూ అటవీ భూముల కేసు
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) తరువాత ఎవరు అంటే? అంతా విజయసాయి రెడ్డి పేరు చెబుతారు. అటువంటి నేత రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అటవీ భూముల కేసులో పవన్ కళ్యాణ్ వెంటాడుతున్నారు. దీంతో పెద్దిరెడ్డి పై కట్టిన కేసులు అమలు కావడం ఖాయం. ఇప్పటికే ప్రభుత్వం పెద్దిరెడ్డి భూముల ఆక్రమణ పై విచారణ కమిటీ వేసింది. దీని రిపోర్ట్ రాగానే చర్యలకు ఉపక్రమించడం ఖాయం. గత కొద్దిరోజులుగా పెద్దిరెడ్డి సైతం సైలెంట్ గా ఉన్నారు. అయినా సరే కూటమి టార్గెట్ చేయడం విశేషం.

* విదేశాల్లో అధినేత
ప్రస్తుతం జగన్ విదేశాల్లో ఉన్నారు. గత రెండు వారాలకు పైగా లండన్ లో( London) గడుపుతున్నారు. అయితే విజయసాయిరెడ్డి రాజకీయాలనుంచి నిష్క్రమణ పై కనీస స్థాయిలో కూడా స్పందించలేదు జగన్. కనీసం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. వైసీపీలో ఇదే హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీలో కీలకమైన నేతల విషయంలో జగన్ వైఖరి అలా ఉండడాన్ని ఎక్కువమంది తప్పు పడుతున్నారు. ఇది కచ్చితంగా పార్టీపై ప్రభావం చూపుతోందని భయపడుతున్నారు.

* ఒక వ్యూహం ప్రకారం
అయితే ఒక వ్యూహం ప్రకారం వైసీపీ విరిచే పనిలో ఉంది కూటమి. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యింది. విజయసాయిరెడ్డి తో పాటు పెద్దిరెడ్డి( pedhi Reddy ) అనుభవాలను చూసిన సీనియర్లు, రీజనల్ కోఆర్డినేటర్లు ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. చాలామంది అజ్ఞాతంలో గడుపుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో కూటమి ప్రభుత్వం వెంటాడుతోందని అంతా భావించారు. కానీ అదే కూటమి కేంద్రంలోని బిజెపిని అడ్డం పెట్టుకొని రివేంజ్ తీర్చుకుంటుందని తెలుస్తుండడం వైసీపీ నేతల భయానికి కారణం అవుతోంది. అదే సమయంలో జగన్ కనీస స్థాయిలో స్పందించకపోవడంతో మిగతా నేతలు సైతం.. ఇంకా భయం లో కూరుకు పోతున్నారు. అధినేత పై నమ్మకం కోల్పోతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular