Donald Trump: మనదేశంలో గసగసాల మొక్కలు విస్తృతంగా కనిపిస్తుంటాయి. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాలలో గసగసాలను సాగు చేస్తుంటారు. గసగసాల మొక్కలను వృక్ష పరిభాషలో పాపీ మొక్కలు అని పిలుస్తుంటారు.. ఈ మొక్కలను శుద్ధిచేసి ఒక మాటక ద్రవ్యాన్ని తీస్తారు.. పాపి మొక్క నుంచి శుద్ధి చేయడం ద్వారా మరికొన్ని రకాల రసాయన పదార్థాలు వస్తాయి. ఈ రసాయనిక పదార్థాలకు మరికొంత పారిశ్రామిక పదార్థాలు తయారుచేసి కృత్రిమ మాదకద్రవ్యాలు తయారుచేస్తారు.. అయితే పాపి మొక్క ద్వారా వెలువడే ఇతర పదార్థాలతోనూ మాదకద్రవ్యాలను తయారుచేస్తారు.. అయితే ప్రాణాంతక వ్యాధుల వల్ల భరించలేని నొప్పితో బాధపడే వారికి.. పై మాదకద్రవ్యాలను నొప్పి నివారణ మందులుగా ఉపయోగిస్తారు.
ఈ మాదకద్రవ్యాలను అమెరికా ఔషధ ఆహార నియంత్రణ సంస్థ నొప్పి నివారణ మందులుగా వాడేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే ఆ మాదకద్రవ్యాలు డోసి కాస్త ఎక్కువైతే ప్రాణాంతకంగా మారుతాయి. కొందరిలో రెండు గ్రాముల డోస్ కూడా కోమా, శ్వాస కోశ వ్యవస్థ వైఫల్యానికి దారితీస్తుంది. అయితే ఈ పదార్థాన్ని ఇటీవల అమెరికా దేశస్తులు అధిక మొత్తంలో తీసుకుంటున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. 2021లో 1,07,000 మంది, 2022లో సగటున 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లో 75 వేల మంది చనిపోయారు. ఇటీవల అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఏడు స్వింగ్ రాష్ట్రాల ప్రజలు ప్రధానంగా వ్యక్తం చేసిన తమ సమస్యల్లో ఈ మాదక ద్రవ్యాలు ఒకటంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అయితే ఈ సమస్యను పరిష్కరిస్తానని నాటి ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు. ఆయన చెప్పినట్టుగానే.. ఆ మాదకద్రవ్యాల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల సరఫరాను అడ్డుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. తను ఇచ్చిన మాట ప్రకారం చైనాపై 10% అదనపు సుంకాన్ని విధిస్తూ ట్రంప్ కొరడా ఝుళిపించారు.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా అమెరికాకు మత్తు పదార్థాలు తయారుచేసే ముడి పదార్థాల రాక తగ్గిపోతుందని భ్రమే.. ఎందుకంటే అమెరికాలో ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు విచిత్రంగా ఉంటాయి కాబట్టి.. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అలాంటివారికి తీవ్రస్థాయిలో పనిచేసే నొప్పి నివారణ మందులు ఉపయోగించాల్సి ఉంటుంది.. ఆ ప్రకారం చూసుకుంటే ఈ ముడి పదార్థాలను అమెరికా కనుక కట్టడి చేస్తే తీవ్ర ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత నొప్పి నివారణ మందులు తయారు చేయడం కష్టమవుతుంది. అలాంటప్పుడు ట్రంప్ తీసుకొన్న నిర్ణయం పై మరోసారి సమీక్ష చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిరసనలకు కారణమవుతున్నాయి. మరి ఇలాంటప్పుడు ట్రంప్ తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాల్సి ఉంటుంది. లేకుంటే ఎన్నికల్లో మాట ఇచ్చి.. ఆ తర్వాత నిలుపుకోలేని వ్యక్తిగా అపప్రదను మోయాల్సి ఉంటుంది.