Homeఅంతర్జాతీయంDonald Trump: అమెరికా ఎన్నికల్లో చారిత్రక గెలుపు తర్వాత ట్రంప్‌ తొలి రోజు ఇలా గడిచింది...

Donald Trump: అమెరికా ఎన్నికల్లో చారిత్రక గెలుపు తర్వాత ట్రంప్‌ తొలి రోజు ఇలా గడిచింది…

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. అధికార డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి గెలుస్తుందని, అమెరికాకు తొలి మహిళ అధ్యక్షురాలు కాబోతున్నారని వేసిన అంచనాలను తలకిందులు చూస్తూ వైట్‌హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. గ్రాండ్‌ విక్టరీ తర్వాత ట్రంప్‌కు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్రమోదీతోపాటు ప్రపంచ నాయకులు నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ట్రంప్‌ విజయం తర్వాత ఫోన్‌ కాల్స్‌ స్వీకరించడంలోనే నిమగ్నయమ్యారు. ఫోన్‌కాల్స్‌ స్వీకరించడంతోనే ఆయన తొలి రోజు ప్రారంభమైంది. ప్రస్తుతం ట్రంప్‌ ఫ్లోరిడాలో ఉన్నారు. తెల్లవారుజామున విజయంపై ప్రసంగించారు. తర్వాత దేశీయ, అంతర్జాతీయ నాయకులు, ముఖ్య మద్దతుదారులు, దాతల నుంచి కాల్స్‌పై దృష్టి పెట్టారు.

అధికార మార్పుకు పిలుపు..
ఇక ఫెడరల్‌ చట్టం ప్రకారం.. అధికార మార్పు ప్రారంభించాలని ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ నిర్ణయించారు. ఈమేకు ఒప్పందాలపై సంతకం చేయాలని బైడెన్‌ బృందం ట్రంప్‌ శిబిరాన్ని కోరింది. ఈ ఒప్పందాలలో ఆలస్యం డొనాల్డ్‌ ట్రంప్‌ భవిష్యత్‌ పాలన కోసం భద్రతా పరమైన క్లియరెన్స్‌ ప్రాసెసింగ్‌కు ఆటంకం కలిగిస్తుంది. ఇది సున్నితమైన ప్రభుత్వ సమాచారానికి ప్రాప్యతను ప్రభావితం చేస్తుంది. అతకుముందు ట్రంప్‌నకు బైడెన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కమలా హారిస్‌ పోరాటాన్ని ప్రశంసించారు. ట్రంప్‌ కూడా కమలా హారిస్‌ దృఢత్వాన్ని అంగీకరించారు.

వారితో మాట్లాడిన ట్రంప్‌..
ఇక ట్రంప్‌ ప్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్, సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సన్మాన్‌తోపాటు భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, ఉక్రెయిన్‌ అధ్యక్షడు జెలన్‌స్కీ ఇతర ప్రపంచ నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా మరియు ఇరాన్‌లతో కొనసాగుతున్న వివాదాల మధ్య మధ్యప్రాచ్యంలో శాంతిని కొనసాగించాలని ట్రంప్‌ ప్రతిజ్ఞ చేశారు, ఇక స్టాక్స్, క్రిప్టోకరెన్సీలలో లాభాలతో అమెరికా మార్కెట్లు ట్రంప్‌ విజయానికి సానుకూలంగా స్పందించాయి.

విచారణ నిలిపవేసే అవకాశం..
గతంలో ఫెడరల్‌ కేసుల్లో ట్రంప్‌పై అభియోగాలు మోపిన ప్రత్యేక న్యాయవాది జాక్‌ స్మిత్, సిట్టింగ్‌ అధ్యక్షులపై విచారణకు సంబంధించి న్యాయ శాఖ విధానాలను సమీక్షిస్తున్నారని, ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనపై తదుపరి చర్యలను నిలిపివేసే అవకాశం ఉందని సమాచారం. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర పన్నారని, తన మార్‌–ఎ–లాగో ఎస్టేట్‌లో రహస్య పత్రాలను అక్రమంగా దాచారని స్మిత్‌ గతేడాది ట్రంప్‌పై అభియోగాలు మోపారు. రెండో కేసు ఇప్పటికే కొట్టివేయబడింది. అయితే ట్రంప్‌ ఎన్నికల విజయం అంటే, పదవిలో ఉన్నప్పుడు అధ్యక్షులను నేరారోపణల నుంచి రక్షించడానికి ఉద్దేశించిన దశాబ్దాల నాటి డిపార్ట్‌మెంట్‌ చట్టపరమైన అభిప్రాయాలకు అనుగుణంగా అతను ఇకపై ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోలేడని న్యాయ శాఖ విశ్వసిస్తోంది.

మోదీ ప్రత్యేక అభినందనలు..
ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. టెక్నాలజీ, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, ఇతర రంగాలలో భారతదేశం–అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ట్రంప్‌తో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. అమెరికా కాంగ్రెస్‌ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ పనితీరుపై ట్రంప్‌ను మోదీ అభినందించారని, ప్రపంచ శాంతి కోసం కలిసి పని చేస్తామని ఇరువురు నేతలు «ధ్రువీకరించారని అధికారిక వర్గాలు తెలిపాయి. మోదీని, భారత్‌ను తాను నిజమైన స్నేహితుడిగా భావిస్తున్నానని, తన విజయం తర్వాత తాను మాట్లాడిన మొదటి ప్రపంచ నాయకులలో భారత నాయకుడు ఒకరని ట్రంప్‌ అన్నారు.

ఎక్స్‌లో పోస్టు..
ఇక ట్రంప్‌ విజయంపై మోదీ ఎక్స్‌లో కూడా పోస్టు పెట్టారు. ‘నా స్నేహితుడు, మెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో గొప్ప సంభాషణ జరిగింది. అతని అద్భుతమైన విజయానికి అభినందనలు. సాంకేతికత, రక్షణ, శక్తి రంగాలలో భారత్‌–అమెరికా బంధాలను మరింత బలోపేతం చేయడానికి, కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాను’ అని పేర్కొన్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular