Donald Trump: అమెరికన్లకు అవకాశాలు పెంచేందుకు.. మెరికాను సంపన్న దేశంగా నిపబెట్టేందుకు, అమెరికాలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 2.0 పాలనలో దూకుడు నిర్ణయాతీ తీసుకుంటున్నారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపారు. ప్రపంచ దేశాలపై సుంకాలు విధించారు. ఇప్పుడు ఆఫ్రికా(Africa) దేశాలపై మరో బాంబు పేల్చబోతున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసలను కట్టడి చేసేందుకు కఠిన విధానాలను అమలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించిన వారిని స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇటీవల ఆఫ్రికా దేశాల నుంచి అక్రమంగా వచ్చిన పౌరులను డిపోర్ట్(Diport) చేసినప్పటికీ, వారిని స్వీకరించడానికి కొన్ని ఆఫ్రికా దేశాలు నిరాకరించాయి. ఇది ట్రంప్‌కు కోపం తెప్పించింది. దీంతో ఆయా దేశాల పౌరులకు సంబంధించిన వీసాలను రద్దు చేస్తూ, కొత్త వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో(Marko Rubyo) ప్రకటించారు. ఇమిగ్రేషన్ చట్టాలను కఠినంగా అమలు చేసే లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
దక్షిణ సూడాన్‌పై..
దక్షిణ సూడాన్(South Sudan) వంటి దేశాలు డిపోర్టేషన్ విషయంలో సహకరించడం లేదని గుర్తించిన ట్రంప్ యంత్రాంగం, ఆ దేశ పౌరులకు వీసా అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసింది. ‘దక్షిణ సూడాన్ పాస్‌పోర్ట్‌లు కలిగిన వారి వీసాలకు ఇక విలువ ఉండదు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. వారు అమెరికా(America)లోకి ప్రవేశించకుండా అధికారులు చర్యలు తీసుకుంటారు‘ అని రూబియో స్పష్టం చేశారు. ఈ కఠిన నిబంధనలను ఆ దేశం సహకారం చూపిన తర్వాతే సమీక్షిస్తామని ఆయన తెలిపారు.
8 వేల మంది అరెస్ట్..
ట్రంప్ అధ్యక్షతలో ఇప్పటివరకు సుమారు 8,000 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. వీరిలో కొందరిని స్వదేశాలకు పంపగా, మరికొందరు జైళ్లలో లేదా నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు. అదనంగా, జాతి వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న విదేశీ విద్యార్థులను గుర్తించి, వారికి స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో జాతి విద్వేష సందేశాలను పంచుకున్న వారి వీసాలను కూడా రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. యూఎస్ ఇమిగ్రేషన్ చట్టం సెక్షన్ 221(జీ) ప్రకారం ఈ నిర్ణయాలు అమలవుతున్నాయి.
ఈ విధానాలు అక్రమ వలసలను అరికట్టడంలో సహాయపడుతున్నప్పటికీ, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. ఆఫ్రికా దేశాలతో సహకారం కోసం ట్రంప్ పరిపాలన మరిన్ని ఒత్తిళ్లు తెచ్చే అవకాశం ఉంది.