https://oktelugu.com/

Passport : ఈ ముగ్గురు వ్యక్తులు పాస్ పోర్ట్ లేకుండా ఏ దేశానికైనా వెళ్లొచ్చు.. వాళ్లెవరో తెలుసా?

దేశాల అధ్యక్షులు సైతం పాస్ పోర్టు ఉంటేనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ప్రపంచంలోని ముగ్గురు వ్యక్తులకు ఎలాంటి పాస్ పోర్టు అవసరం లేదు. వారు ఏ దేశానికి వెళ్లినా సాదరంగా ఆహ్వానిస్తారు. వారిని పాస్ పోర్టు అస్సలు అడగరు. వాళ్లెవరో తెలుసా?

Written By:
  • Srinivas
  • , Updated On : September 20, 2024 / 05:26 PM IST

    Passport

    Follow us on

    Passport : ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు పాస్ పోర్టు ద్వారా తెలుస్తుంది. పాస్ పోర్టు రావాలంటే ప్రభుత్వానికి సరైన ఆధారాలు చూపించాలి. అప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన ఆధారాలు సరిగ్గా ఉంటే పాస్ పోర్టు జారీ చేస్తారు. ఈ పాస్ పోర్టు ఆధారంగా ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్లొచ్చు. సాధారణ వ్యక్తుల నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, దేశాల అధ్యక్షులు సైతం పాస్ పోర్టు ఉంటేనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ప్రపంచంలోని ముగ్గురు వ్యక్తులకు ఎలాంటి పాస్ పోర్టు అవసరం లేదు. వారు ఏ దేశానికి వెళ్లినా సాదరంగా ఆహ్వానిస్తారు. వారిని పాస్ పోర్టు అస్సలు అడగరు. వాళ్లెవరో తెలుసా?

    మొదటి ప్రపంచ యుద్దానికి ముందు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే ఎలాంటి పాస్ పోర్ట్ అవసరం ఉండేది కాదు. కానీ ఆ తరువాత పాస్ పోర్టు గురించి చర్చకు వచ్చింది. 1920లో యునైటెడ్ స్టేట్స్ తమ దేశంలోకి అక్రమంగా వలసదారులు చొచ్చుకువస్తున్నారని గమనించి పాస్ పోర్టు విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిపై లలీగ్ ఆఫ్ నేషన్స్ లో తీవ్రంగా చర్చ సాగిన తరువాత 1924లో అమెరికా దేశం మొదటిసారిగా పాస్ పోర్టు విధానాన్ని ప్రారంభించింది. ఇప్పడు చాలా దేశాలు తమ దేశంలోని రావాలంటే పాస్ పోర్టును కలిగి ఉండాలనే నిబంధనలు తెచ్చాయి. ఈ పాస్ పోర్టులో ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది.

    దేశ అధ్యక్షుడి నుంచి ప్రధా మంత్రి,ఇతర ప్రముఖ వ్యక్తులు ఎవరైనా పరాయి దేశం వెళ్లాలంటే పాస్ పోర్టు ఉండాలి. అయితే ఈ పాస్ పోర్టును కాన్స్ లర్ పాస్ పోర్టు అంటారు. మనదేశంలో మూడు రకాల పాస్ పోర్టులు ఉన్నాయి. ఒకటి సాధారణ వ్యక్తులు పొందేది. ఇది నీలిరంగులో ఉంటుంది. మరొకటి అధికారులు, మంత్రులకు జారీ చేసే పాస్ పోర్టులు. ఇవి మెరున్ కలర్ లో ఉంటాయి. మూడోవది కాన్సులర్ పాస్ పోర్టులు. ఇవి ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మాత్రమే కలిగి ఉంటారు.

    అయితే ప్రపంచంలో ముగ్గురు వ్యక్తులకు మాత్రం ఎలాంటి పాస్ పోర్టు అవసరం లేదు. వారిలో ఒకరు బ్రిటన్ రాజు. ప్రస్తుతం బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ ఉన్నారు. ఈయన రాజు అయన వెంటనే అతని కార్యదర్శి అన్ని దేశాలకు ఒక పత్రాన్ని పంపాడు. దీంతో అతనికి ఎలాంటి పాస్ పోర్టు అవసరం ఉండదు. అయితే అతని భార్యకు మాత్రం పాస్ పోర్టు అవసరం ఉంటుంది.

    పాస్ పోర్టు అవసరం లేని మరో ఇద్దరు వ్యక్తులు జపాన్ చక్రవర్తి, మహారాణి. ప్రస్తుతం జపాన్ చక్రవర్తిగా నరుహిటో ఉన్నారు. అలాగే అతని భార్య మసాకో ఓవాటా. చక్రవర్తి నరుహిటో తన తండ్రి నుంచి అధికారం లభించింది. దీంతో అతని తండ్రి లాగే అతనికి కూడా ఏ దేశానికి వెళ్లినా పాస్ పోర్టు అవసరం లేదు. అలాగే అతని భార్య కూడా పాస్ పోర్టు లేకుండా ఏ దేశానికైనా వెళ్లొచ్చు. అయితే ఇప్పుడున్న చక్రవర్తి తన పదవీ విరమణ చేసిన తరువాత తన వారసులు మాత్రం పాస్ పోర్టును కలిగి ఉండాలి. 1971లో వీరికి ఈ అధికారం ఉన్నట్లు జపాన్ చరిత్రను బట్టి తెలుస్తోంది.