https://oktelugu.com/

India is The Largest Milk Producer: ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశంగా భారత్ కావడానికి కారణం ఎవరో తెలుసా?

ప్రతి రోజూ తీసుకునే తీసుకునే ఆహారంలో పాలు ముఖ్యమైనవి. పాలతో చేసిన ద్రవాలను తీసుకున్న తరువాతే ఆహార ప్రక్రియను ప్రారంభిస్తాం. పాలల్లో కాల్షియంతో పాటు వివిధ రకాల పోషకాలు ఉంటాయి. అలాగే పాలతో పెరుగు, మజ్జిగ, పన్నీర్ వంటి పదార్థాలను తయారు చేస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 26, 2024 / 11:42 AM IST

    India is The Largest Milk Producer

    Follow us on

    India is The Largest Milk Producer: ప్రతి రోజూ తీసుకునే తీసుకునే ఆహారంలో పాలు ముఖ్యమైనవి. పాలతో చేసిన ద్రవాలను తీసుకున్న తరువాతే ఆహార ప్రక్రియను ప్రారంభిస్తాం. పాలల్లో కాల్షియంతో పాటు వివిధ రకాల పోషకాలు ఉంటాయి. అలాగే పాలతో పెరుగు, మజ్జిగ, పన్నీర్ వంటి పదార్థాలను తయారు చేస్తారు. అందువల్ల ప్రతి రోజూ పాలకు డిమాండ్ ఉంటుంది. దేశంలో ఆవులు, గేదెలు మిగతా వాటికంటే ఎక్కువ పాల ఉత్పత్తిని చేస్తాయి. కొన్ని రకాల జాతులకు చెందినవి మరిన్ని ఎక్కువ పాలు ఉత్పత్తిని అందిస్తాయి. ఒకప్పుడు పాల ఉత్పత్తిలో అమెరికా ముందు ఉండేది. కానీ ఆ దేశాన్ని అధిగమించి భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇందుకు కారణం ఓ వ్యక్తి. ఆయన ఎవరో కాదు డాక్టర్ వర్గీస్ కురియన్. ఈయన చొరవ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఏడాది నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే పాల దినోత్సవం నిర్వహించడం వెనుక పెద్ద స్టోరీ ఉంది. అదేంటంటే?

    పాల గురించి ప్రాముఖ్యతను తెలిపేందుకు ప్రతీ సంవత్సరం జాతీయ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయతే దేశంలో శ్వేత విప్లవం వెనుక డాక్టర్ వర్గీస్ కురియన్ ఉన్నారు. భారతదేశంలో ఒకప్పుడు పాల కొరత అధికంగా ఉండేది. దీంతో 1970లో డాక్టర్ కురియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ ప్లడ్ ద్వారా పాల ఉత్పత్తిలో దేశం అగ్రస్థానానికి చేరింది. గ్రామీణ పాల ఉత్పత్తిదారులను పట్టణ మార్కెట్ లతో అనుసంధానం చేసేందుకు ఈయన గ్రిడ్ ను స్థాపించారు. దీంతో 1960లో 20 టన్నులు మాత్రమే ఉత్పత్తి అయిన పాలు 2011లో 122 మిలియన్ టన్నులకు చేరింది. రైతులు నేరుగా వినియోగదారులతో సంప్రదింపులు చేయడం వల్ల 70 శాతం అదాయాన్ని అధికంగా పొందారు. పాల ఉత్పత్తిని ప్రత్సహించడానికి కురియన్ చాల దోహదపడ్డాడు. అందుకే ఆయనను ‘మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు.

    ప్రస్తుతం దేశంలో 80 మిలియన్ల రైతులు పాడి పరిశ్రమతో కీలకంగా ఉండి పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి డేటా ప్రకారం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న పాలల్లో భారతదేశం 21 నుంచి 23 శాతాన్ని కలిగి ఉంది. శ్వేత విప్లవంతో పాటు సహకార డెయిరీల ద్వారా ఇది సాధ్యమైంది. పాల ఉత్పత్తిపై అవగాహన కల్పించడానికి జాతీయ పాల దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్, ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

    పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పుట్టిన ప్రతి బిడ్డకు పాలు తాగడం ప్రారంభిస్తారు. అయితే ప్రతిరోజూ పాలు తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడుతాయి. పాలు మాత్రమే కాకుండా పాలతో చేసిన పదార్థాలు తీసుకున్నా శరీరానికి పోషక విలువలు అందుతాయి. అత్యంత ఎక్కువగా ఇష్టపడే పన్నీర్ ను పాలతో తయారు చేస్తారు. దీనిని వివిధ వంటకాల్లో వాడుతూ ఉంటారు. పాలతో స్వీట్లు కూడా తయారు చేస్తారు. దైనందిన ఆహారంలో పాలు ముఖ్యంగా మారాయి. అందువల్ల ప్రతిరోజూ పాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.