Medical Services : ఏదైనా వస్తువులు విలువ లేదా.. వ‍్యక్తి విలువ తెలియాలంటే.. అవి మనకు దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. నిత్యం మనతో ఉంది వస్తువైనా, మనిషైనా దానిని గుర్తించం. అవి లేనప్పుడు ఇబ్బంది కలిగితే వాటి విలువ తెలుస్తుంది. అమెరికా వెళ్లిన భారతీయ వృద్ధ దంపతులకు ఈ విషయం ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. అమెరికా అంటే అగ్రరాజ్యమని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అన్నిరకాల సేవలు అందుబాటులో ఉంటాయని చాలా మంది బావిస్తుంటారు. కానీ, వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉందటున్నారు వృద‍్ధ దంపతులు. వైద్య సేవల విషయంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులత విదేశాల్లో ఉండే సౌకర్యాలను గొప్పగా భావించేవాళ్లకు తమ బాధ తెలియజేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
అమెరికాలోని సియాటిల్‌లో ఉన్న తమ కుమార్తె వద్దకు ఇటీవల ఓ భారతీయ వృద్ధ దంపతులు వెళ్లారు. అతడి భార్యకి శ్వాసకోశ సమస్య ఉండడంతో ఇక్కడి నుంచే మందులు తీసుకెళ్లారు. కానీ, అక్కడికి వెళ్లాక అవి అయిపోయాయి. వాతావరణం కూడా మారిన నేపథ్యంలో ఒకసారి ఊపిరితిత్తుల వైద్యుడిని సంప్రదించాలనుకున్నాడు. ఈ విషయం కూతురుకు చెప్పారు. దీంతో ఆమె డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుంది.
వారానికి అపాయింట్‌మెంట్.. మందులకు..
డాక్టర్ అపాయింట్‌మెంట్ వారం తర్వాత దొరికింది. దీంతో ఆ దంపతులు అప్పటి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. సరే అపాయింట్‌మెంట్ దొరికిన తర్వాత చికిత్స అయినా త్వరగా అందుతుందని భావించారు. కానీ సదరు డాక్టర్ వీడియోకాల్‌లో సమస్య తెలుసుకున్నాడు. ఇప్పటి వరకు వాడుతున్న మందుల వివరాలు తెలుసుకున్నారు. వాటికి అనుగుణంగా ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడు. ఇక ఈ ప్రిస్క్రిప్షన్‌తో మందుల కోసం మెడికల్ స్టోర్‌లో ఆరా తీస్తే.. ఆ మందులు అందుబాటులో లేవని చెప్పారు. నాలుగు లేదా ఐదు రోజుల్లో వస్తాయని తెలిపారు. దీంతో మరో ఐదు రోజులు వేచిఉన్నారు.
ఇండియా కంపెనీ మందులే..
ఇక మందులు వచ్చిన తర్వాత చూస్తే.. అవి మేడిన్ ఇండియా కంపెనీ సిప్లా తయారు చేసినవే. అది చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. ఇవే మందులు మన ఇండియాలో అయితే ఏ మెడికల్ స్టోర్‌కు వెళ్లినా దొరుకుతాయని తెలిపారు. ఇక మందుల ధరల విషయానికి వస్తే.. 50 శాతం డిస్కౌంట్‌లో ఆ మందుల ధర మన కరెన్సీలో రూ.21 వేలు అయింది. అంటే పూర్తి ధర రూ.42 వేలు అన్నమాట. ఇవే మందులు మన ఇండియాలో కేవలం రూ.2,500. అగ్రరాజ్యంలో మందుల ధరలు కూడా ఆ పేరుకు తగ్గట్లే ఉన్నాయని ఆశ్చర్యపోయారు.
మన దేశమే బెస్ట్..
అంతా అయ్యాక.. వారికి అర్థమైంది ఏమిటంటే.. వైద్య సేవల్లో మన భారత దేశమే బెస్ట్ అని. అగ్రరాజ్యంలో ఏ వ్యాధికైనా డాక్టర్ అందుబాటులో ఉంటారు. ఏ ట్రీట్‌మెంట్ అయినా క్షణాల్లో అందుతుంది. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రచారం చేస్తారని, కానీ తమ అనుభవం ప్రకారం చూస్తే.. వైద్య సేవల్లో మన దేశమే ఉత్తమమని అమెరికా వచ్చాక తెలుసుకున్నామని పేర్కొన్నారు.