Deadly Virus: కరోనా.. ఈ పేరు వింటే ఇప్పటికీ చాలా మందిలో భయం. నాటి లాక్‌డౌన్, కర్ఫ్యూ వాతావరణం.. వైరస్ విస్తృతి తలుచుకుంటే.. ఇప్పటికీ భయంకరంగానే అనిపిస్తుంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా అనేక విషయాలను నేర్పించింది. గుణపాఠం నేర్పింది. మూడు వేవ్‌లలో కరోనా తన ప్రతాపం చూపింది. ప్రస్తుతం వైరస్ ప్రభావం, తీవ్రత బాగా తగ్గాయి. దీంతో అందరూ కరోనాతో కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో మరో వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే 15 మందిని పొట్టన పెట్టుకుంది. 17 దేశాల్లో ప్రభావం చూపుతోంది.
బ్లీడింగ్ ఐ..
కరోనా తర్వాత ప్రపంచంలో వ్యాధుల భయం పెరిగింది. ఎం పాక్స్, బర్డ్ ఫ్లూ వంటివి విజృంభించినా కరోనా స్థాయిలో భయపెట్టలేదు. కానీ ప్రస్తుతం మార్బర్గ్, ఎంపాక్స్ వైరస్‌లు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం 17 దేశాల్లో వీటి ప్రభావం ఉంది. మార్బర్గ్ వైరస్‌ను బ్లీడింగ్ ఐ అని కూడా అంటారు. ఆఫ్రికా దేశమైన రువాండలో ఈ వైరస్ కారణంగా 15 మంది మృతిచెందారు. వందల మంది అనారోగ్యం బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు.
తీవ్రమైన వ్యాధుల కేటగిరీలో..
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. బ్లీడింగ్ ఐ వైరస్ అనేది 50 శాతం మరణాల రేటుతో తీవ్రమైన వ్యాధుల కేటగిరీలో ఉంది. ఈ వైరస్ రువాండాలో విధ్వంసం సృష్టిస్తోంది. ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. మార్బర్గ్ వైరస్ కారణంగా కళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. అందుకే దీనిని బ్లీడింగ్ ఐ అని కూడా పిలుస్తున్నారు. ఇప్పటికే పలు వైరస్‌లతో పోరాడుతున్న ఆఫ్రికా దేశాల్లోనే ఈ కొత్త వైరస్ పుట్టింది.
1961లోనే గుర్తింపు..
బ్లీడింగ్ ఐ వైరస్‌ను జర్మనీలో 1961లోనే గుర్తించారు. ఇది ఎబోలా ఫ్యామిలీకి చెందిన వైరస్. ఇది సోకితే మొదట హెమరేజిక్ ఫీవర్ వస్తుంది. ఆ తర్వాత రక్త నాళాలను దెబ్బతీసి కళ్లలో రక్తం రావడానికి కారణం అవుతుంది. ఈ వైరస్ గబ్బిలాల నుంచి సోకుతుంది. ఆ తర్వాత మనుషులకు అంటుకుంటుంది. మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి యూరిన్, లాలా జలం, రక్తం ద్వారా కూడా సోకుతుంది. అలాగే లైంగిక చర్యల ద్వారా కూడా ఈ వైరస్ సోకుతుంది.
బ్లీడింగ్ ఐ లక్షణాలు..
బ్లీడింగ్ ఐ వైరస్ సోనిక తొలి క్షణాలు రెండు నుంచి 21 రోజుల తర్వాత కనిపిస్తాయి. ముందుగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, విపరీతమైన అలసటట, శారీరక నొప్పులు, కండరాల నొప్పులు ఉంటాయి. తర్వాత వికారం, వాంతులు, విరోచనాలు, దురద, శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. మూడో దశలో ముక్కు, పంటి చిగుళ్లు, కళ్లు, నోరు, చెవుల నుంచి రక్తం కారుతుంది. వాంతులు, మలంలో రక్తం వస్తుంది. అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. వృషణాలు వాపు వస్తాయి.
కరోనా కన్నా ప్రమాదం..
డబ్ల్యూహెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వైరస్ ఎక్కువగా గనులు, గుహలలో నివసించే వ్యక్తులపై ప్రభావం చూపుతోంది. ఈ ప్రదేశాల్లో గబ్లిలు నివసిస్తాయి. ఇవే వైరస్‌కు కారణంగా గుర్తించారు. కరోనాకన్నా మార్బర్గ్ వైరస్ చాలా ప్రమాదరకమని నివేదికలు చెబుతున్నాయి. వ్యాధి సోకిన గబ్లిం ద్వారా లేదా వైరస్ సోనిక వ్యక్తుల ద్వారా ఇది వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ వైరస్ రక్తనాళాలను దెబ్బతీసుది. దీనికి ఇప్పటి వరకు ఎలాంటి మందులు లేవు. ఈ వైరస్ సోకిన వారు అందరికీ చాలా దూరంగా ఉండాలి. ఒకరిని ఒకరు తాకడం వల్ల కూడా వైరస్ సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ వైరస్ సోకిన వారు దూరంగా ఉంటూ వైద్యులు తెలిపిన సూచనలు పాటించాలి.