Dan Belgerian : పుడితే బంగారు చెంచా నోట్లో పెట్టుకొని పుట్టాలి’ అని కొందరు ఆరాటపడుతూ ఉంటారు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న వారి మాట ఇది. నిజంగానే కొందరు పుట్టుకతోనే ధనవంతులుగా ఉండి.. ఆ తరువాత జీవితాంతం ఎంజాయ్ చేస్తారు. కానీ కొందరు డబ్బు ఉండి కూడా జీవితాన్ని అనుకున్న విధంగా అనుభవించలేరు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని మరింత పెంచడమో.. లేక ఉన్నది ఊడడమో జరుగుతుంది. కానీ ఓ వ్యక్తి పుట్టుకతోనే సంపన్నుడిగా ఉండి.. ఆ తరువాత ప్రపంచంలో ఉన్న అన్నీ వ్యసనాలు, అలవాట్లను అనుభవించాడు. ఆయన ధనవంతుడే అయినా.. రాత్రికి రాత్రమే మరోసారి అదృష్టం వరించడంతో పట్ట పగ్గాల్లేకుండా ముందుకు సాగాడు. చుక్క, ముక్క, అమ్మాయిలు, జల్సాలు ఇలా అన్ని రకాలు జీవితాన్ని అనుభవించిన అతడిని చూసిన కొందరు ‘బతుకంటే నీది..’ అని కొనియాడుతున్నారు. ఇంతకీ ఎవరు ఆయన? ఆయన జీవితం ఎలా ఉంది?
డాన్ బెల్జెరియన్.. ఈ పేరు సోషల్ మీడియాలో ట్రెండీ.. ఆయన ఫొటోలను చూస్తే షాక్ కు గురవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన అనుభవించే జీవితానికి అర్థంలా ఆ ఫొటోలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఓ బెడ్ రూంలో 5గురు అమ్మాయిలతో కలిసి ఒక బెడ్డుపై కనిపించాడు. ఈ ఒక్క ఫొటో చాలు అతని జీవితం ఎలా ఉందో? ఇవే కాకుండా జూదం, రౌడీయిజం ఎలా ఏదైనా చేయగలడు.
డాన్ బెల్జెరియన్ 1980 డిసెంబర్ 7న అమెరికాలోని ఫ్లోరిడాలో జన్మించాడు. ఈయన పుట్టుకతోనే ధనవంతుడు. ఎందుకంటే అతని తండ్రి పాల్ బెల్జెరియన్ కార్పొరేట్ బిజినెస్ మ్యాన్. దీంతో ఆయనకు సహజంగానే చదువుపై ఆసక్తి లేదు. అయితే ఒకసారి తుపాకి పట్టుకొని పాఠశాలకు వెళ్లాడు.. దీంతో అతడిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఎలాగోలా చదువులో ముందుకు వచ్చినా ఆయన ప్లోరిడా విశ్వవిద్యాలయంలో సీటు సాధించాడు. కానీ అది పూర్తిచేయలేదు.
నేవీ సీల్ కమాండో కావాలన్నది డాన్ బెల్జెరియన్ కల. ఇందుకోసం ట్రైనింగ్ కు వెళితే ఫెయిలయ్యాడు. అయితే ఇక్కడ ఓ అధికారితో గొడవ పడినందున అతడిని వెళ్లగొట్టినట్లు చెబుతారు. దీంతో అతడు పేకాడడం మొదలుపెట్టారు. పేకాట అతనికి వరాలు ఇచ్చింది. అమెరికాలోని డాన్ పోకర్ లో ఒక్క రాత్రిలో 86 కోట్ల రూపాయలు సంపాదించాడు. అలా మొత్తం పేకాట ద్వారా 300 కోట్లు సంపాదించాడు.. 2023లో అతని సంపద రూ.2,550 కోట్లు.
జూదమే కాకుండా డాన్ బెల్జెరియన్ కు అమ్మాయిల వ్యసనం ఉంది. 2014లో హీరోయిన్ జిత్ గ్రిఫిత్ నగ్నంగా ఉండగా ఆమెను భవనం పై నుంచి స్విమ్మింగ్ ఫూల్ లోకి తోశాడు. ఈ వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో ఆమె కేసు పెట్టింది.ఇదే సంవత్సరంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇలా పలువురి మహిళలతో సంబంధాలు పెట్టుకొని జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో ఆయన డ్రగ్స్ కూడా సేవించాల్సి వచ్చింది. దీంతో డాన్ బెల్జెరియన్ అనారోగ్యానికి గురి కావాల్సి వచ్చింది. 30 ఏళ్ల వయసులోనే రెండుసార్లు గుండెపోటు వచ్చింది. డాన్ బెల్జెరియన్ కు విచిత్రమైన అలవాట్లు ఉన్నాయి. మొసళ్లతో ఆడుకుంటాడు. పాములతో స్నేహం చేస్తాడు. చార్టర్ మహిళలతో కలిసి ప్రయాణం చేస్తాడు. కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.
అయితే ఇంత ఆడంబర జీవితాన్ని అనుభవించిన డాన్ బెల్జెరియన్ కు సమస్యలు ప్రారంభమయ్యయి.ఈయన 2017లో కెనడాలోని టోరంటోలో ఇగ్నైట్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లిమిటెడ్ ను ప్రారంభించారు. రెండు సంవత్సరాల తరువాత స్టాక్ ఎక్చేంజ్ లో కంపెనీని పబ్లిక్ గా తీసుకున్ానడు. ఇది గంజాయి , నికోటిన్ ఉత్పత్తులను విక్రయిస్తుంది. అయితే డాన్ బెల్జెరియన్ వ్యక్తిగత ఖర్చు లు, తదితర ఖర్చుల కోసం 2 లక్షల డాలర్లను సాయం చేసిందని హెఫెర్నాన్ అనే వ్యక్తి కంపెనీపై దావా వేశాడు. మోడల్స్, తదితర జల్సాల కారణంగా అతని ఇమేజ్ దెబ్బతింది. ఒక ఇంటిని 65మిలియన్ల డాలర్లతో కొనుగోలు చేశాడు. చాలా కాలాంగా అతని గురించి సమాచారం లేదు.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More