Homeఅంతర్జాతీయంCockroach Seizure Australia: లక్ష కాక్రోచ్ ల మీద ఉక్కు పాదం.. ఇంతకీ ఆ స్టోరీ...

Cockroach Seizure Australia: లక్ష కాక్రోచ్ ల మీద ఉక్కు పాదం.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే..

Cockroach Seizure Australia: మనదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు నిరసన చేపట్టింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేసింది. ఇది జరుగుతుండగానే.. ఓ సంఘటన చోటుచేసుకుంది. కాక్రోచ్ పార్టీకి అధికారిక సింబల్ అయిన బొద్దింకకు సంబంధించిన ఒక వార్త మీడియాలో వచ్చింది. అది కాస్త ఇప్పుడు చర్చకు దారి తీసింది.

మనదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేస్తుంటే.. ఆస్ట్రేలియా అధికారులు బొద్దింకల మీద ఉక్కు పాదం మోపారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.. ఆస్ట్రేలియాలో అక్రమంగా కొంతమంది బొద్దింకలను పెంచుతున్నారు.. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఓ ప్రాంతంలో ఒక వ్యాపారి వీటిని అక్రమంగా పెంచుతున్నట్టు ఇటీవల అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి బొద్దింకలను సీజ్ చేశారు. ఆ దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో బొద్దింకలను స్వాధీనం చేసుకోవడం తొలిసారి.

అధికారులు స్వాధీనం చేసుకున్న బొద్దింకలలో మడగాస్కర్ హిస్సింగ్, దూబియా జాతులకు చెందినవి ఉన్నాయి. ఇవి వన్యప్రాణులకు.. జీవ వైవిధ్యానికి హాని కలిగిస్తాయని ఆస్ట్రేలియా అధికారులు చెబుతున్నారు. వాటిని దిగుమతి చేసుకోవడం.. పెంచడం.. అమ్మడం ఆస్ట్రేలియా చట్టాలకు వ్యతిరేకమని అధికారులు చెప్పారు.

కాక్రోచ్ లు ఒకటిన్నర అంగుళం వరకు పెరుగుతుంటాయి.. మడగాస్కర్ హిస్సింగ్ మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధింక. ఒక్కొక్కటి 8 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఇది మనిషి వేలు కంటే పొడవుగా ఉంటుంది. పైగా దీని శరీరం గోధుమ వర్ణంలో ఉంటుంది.. అయితే వీటిని పాములు ఇతర సరి సృపాలకు ఆహారంగా వేస్తూ ఉంటారు.

ఈ బొద్దింకల వల్ల ఇతర జాతులు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇవి రకరకాల వ్యాధులను కలగజేస్తుంటాయి. అందువల్ల వీటిని పెంచడాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధించింది. బొద్దింకలను పెంచుతున్నఆ వ్యాపారి పై అస్ట్రేలియా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, మనదేశంలో కాక్రోచ్ పార్టీ ఆందోళనలు నిర్వహిస్తుండగా, ఆసీస్ లో కాక్రోచ్ లను స్వాధీనం చేసుకోవడం, కేసులు నమోదు చేయడం నిజంగా విశేషమే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version