https://oktelugu.com/

China: అంటార్కిటికాలో అంగారకుడిపై పెరిగే మొక్క.. గుర్తించిన చైనా పరిశోధకులు!

శాస్త్రవేత్తలు సాధారణంగా భూమిపై పెరిగే మొక్కల కోసం పరిశోధన చేస్తారు. కానీ మొదటిసారిగా గ్రీన్‌హౌస్‌లలో కాకుండా అంగారక గ్రహంపై పెరిగే మొక్కల కోసం అన్వేషణ సాగించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 3, 2024 / 05:03 PM IST

    China

    Follow us on

    China: అంగారక గ్రహంపై ప్రపంచ దేశాలు అనేక పరిశోధనలు చేస్తున్నాయి. అక్కడ నీరు ఉన్నట్లు గుర్తించాయి. ఈ క్రమంలో జీవరాశి సాధ్యమవుతుందా లేదా అని పలు దేశాల శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యంత వేడిగా ఉండే అంగారక గ్రహంపై పెరిగే ఓ మొక్కను చైనా శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. అంగారక గ్రహంపై ఉన్న కఠినమైన వాతావరణ పరిస్థితులలో ఈ మొక్క జీవించి పెరుగుతుందని నిర్ధారించారు.

    మోజావే ఎడారిలో గుర్తింపు..
    ఈ అరుదైన మొక్కను అంటార్కిటికాలోని మోజావే ఎడారిలో గుర్తించారు. ఇది స్థితిస్థాపక ఎడారి నాచు. దీని శాస్త్రీయ నామం సింట్రిచియా కానినర్విస్‌. ఇది అంగారక గ్రహంపై జీవించడానికి అనుకూలమైనదిగా గుర్తించారు. ఇది తీవ్రమైన చలి, అధిక రేడియేషన్, తీవ్రమైన కరువును తట్టుకుంటుందని పరిశోధనా బృందం నిర్ధారించింది. ఇది టిబెట్, అంటార్కిటికా, సర్క్యుపోలార్‌ ప్రాంతాలతో సహా అసాధారణమైన తీవ్రమైన ఎడారి వాతావరణంలో పెరుగుతుంది.

    మొట్టమొదటి అధ్యయనం..
    శాస్త్రవేత్తలు సాధారణంగా భూమిపై పెరిగే మొక్కల కోసం పరిశోధన చేస్తారు. కానీ మొదటిసారిగా గ్రీన్‌హౌస్‌లలో కాకుండా అంగారక గ్రహంపై పెరిగే మొక్కల కోసం అన్వేషణ సాగించారు. ఒత్తిడి–అనుకూల మొక్కలను ఉపయోగించి భూ వాతావరణానికి వెలుపల కూడా ఈ ఎడారి నాచు పెరుగుతుందని గుర్తించారు.

    స్థితిస్థాపకత ఎక్కువ..
    ఒత్తిడిని తట్టుకునే సూక్ష్మజీవులు, టార్డిగ్రేడ్‌లతో పోలిస్తే ఈ కెనినర్విస్‌ మొక్కకు స్థితిస్థాపకత ఎక్కువ అని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఇది భూగ్రహేతర గ్రహాలలో పెరుగుతుందని సైంటిస్టులు సూచించారు.

    ది ఇన్నోవేషన్‌లో ప్రచురణ..
    ఎడారి నాచు అయిన కెనినర్విస్‌ మొక్క కురించి పరిశోధన చేసిన శాస్త్రవేత్తల బృందం దీనికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలను ‘ది ఇన్నోవేషన్‌’లో ప్రచురించారు. గామా రేడియేషన్‌ ఎక్స్‌పోజర్‌తో సహా మొత్తం నిర్జలీకరణం, విపరీతమైన పరిస్థితుల నుంచి ఎడారి నాచు ఎలా బయటపడింది, త్వరగా కోలుకుంది అనే వివరాలను పేర్కొన్నారు. పరిశోధకుల్లో చైనా పర్యావరణ శాస్త్రవేత్తలు డాయువాన్‌ జాంగ్, యువాన్మింగ్‌ జాంగ్, చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు చెందిన వృక్షశాస్త్రజ్ఞుడు టింగ్యున్‌ కువాంగ్‌ ఉన్నారు.

    మార్స్‌ లాంటి పరిస్థితులు కల్పించి..
    పరిశోధకులు మార్టిన్‌ లాంటి ఒత్తిళ్లు, ఉష్ణోగ్రతలు, వాయువులు, యూవీ రేడియేషన్‌తో ఒక వ్యవస్థను నిర్మించారు. కెనినర్విస్‌ మొక్కను పరిశోధకులు − 80 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద(అల్ట్రా–కోల్డ్‌ ఫ్రీజర్‌లో) 3 నుంచి 5 సంవత్సరాలు, − 196 డిగ్రీల సెంటీగ్రేడ్‌(ద్రవ నైట్రోజన్‌ ట్యాంక్‌లో) 15 మరియు 30 రోజులు నిల్వ చేశారు. కెనినర్విస్‌ ఈ పరిస్థితులలో వృద్ధి చెందడాన్ని గమనించారు. వాతావరణ పరిస్థితులను తట్టుకున్న తర్వాత సాధారణ పరిస్థితిలో పెరిగినట్లుగా పెరగడాన్ని గుర్తించారు.

    టెర్రాఫార్మింగ్‌కు అవకాశం..
    కానినర్విస్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి, కార్బన్‌ సీక్వెస్ట్రేషన్, నేల సంతానోత్పత్తికి దోహదం చేయడం ద్వారా అంగారకుడిపై టెర్రాఫార్మింగ్‌ ప్రయత్నాలను సులభతరం చేస్తుందని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. పర్యావరణ వ్యవస్థాపనకు మార్గదర్శక జాతిగా ఉపయోగపడుతుందని తెలిపారు.

    భవిష్యత్‌ చిక్కులు
    ఇతర గ్రహాలపై స్వయం సమృద్ధిగల ఆవాసాలు ఇప్పటికీ చాలా దూరంగా ఉన్నప్పటికీ ఈ అధ్యయనం కానినర్విస్‌ మొక్కను మార్స్‌ లేదా చంద్రునిపై పెంచే అవకాశం ఉంది. అక్కడ కానినర్విస్‌ మొక్క వృద్ధి చెందితే భూ గ్రహం బయట కూడా జీవనానికి ఇది బాటలు వేస్తుంది. అంతరిక్షంలో వృద్ధికి మార్గం సుగమం చేస్తుంది.