Chinese PHL-81 MLRS system: చైనా.. తయారీ రంగంలో దూసుకుపోతోంది. ఆర్థికంగా రెండో సంపన్న దేశంగా గర్తింపు పొందింది. అయితే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ప్రతీ నాణ్యమైన వస్తువుకు డ్యూప్లికేట్ తయారు చేయడంలో చైనా దిట్ట. అందుకే వేగంగా తయారీ రంగంలో ఎదిగింది. ఇక ఇప్పుడు ఆయుధాల తయారీలోనూ చైనా వైఫల్యం కనిపిస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ భారత్‌పై ప్రయోగించిన చైనా రాకెట్ పేలకుండా విఫలమైంది. తాజాగా కంబోడియా–థాయ్‌లాండ్ యుద్ధ సమయంలో నూ చైనా తయారు చేసిన మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్(ఎంఎల్‌ఆర్‌ఎస్) విస్‌ఫైర్ అయింది. దీంతో 8 మంది కంబోడియా సైనికులు మరణించారు. ఈ ఘటన యుద్ధ ప్రదేశంలో భారీ నష్టానికి దారితీసింది. చైనా ఆయుధాలపై ఆధారపడిన కంబోడియా సైన్యం ఈ పరాజయంతో తీవ్ర ఆందోళనకు గురైంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ..
చైనా సామగ్రి భారత్–పాక్ సంఘర్షణలో కూడా పనిచేయలేకపోయింది. పాకిస్తాన్ సైన్యం ఆధారపడిన ఈ ఆయుధాలు టెక్నికల్ లోపాలతో విఫలమయ్యాయి. చైనా రాకెట్ భారత భూభాగంలో పడడంతో మన సైంటిస్టులు దానిని విశ్లేషించారు. చైనా తయారీ వస్తువులన్నీ నాసిరకం అని గుర్తించారు. ఈ ఘటనలు చైనా ఎక్స్‌పోర్ట్ ఆయుధాల నాణ్యతను ప్రశ్నార్థకం చేశాయి.
లోపాల వెనుక కారణాలు
చైనా ఎంఎల్‌ఆర్‌ఎస్ వంటి వ్యవస్థల్లో తక్కువ ధరలకు త్వరిత ఉత్పత్తి, పరీక్షల లోపాలు కీలక సమస్యలు. రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాల ఆయుధాలతో పోల్చితే ఈ సిస్టమ్‌లు యుద్ధ పరిస్థితుల్లో స్థిరత్వం చూపలేవు. అధిక ఒత్తిళ్లలో ఇంధన సమస్యలు, ఎలక్ట్రానిక్స్ విఫలాలు తరచూ జరుగుతున్నాయి. ఈ పరాజయాలు చైనా ఆయుధాలపై ఆధారపడే దేశాల్లో అపనమ్మకాన్ని పెంచాయి. భారత్ స్వదేశీ రక్షణ వ్యవస్థలు, అగ్ని, పృథ్వీ వంటి క్షిపణులు ప్రపంచ స్థాయిలో పోటీపడుతున్నాయి.
కంబోడియా, పాకిస్తాన్ వంటి దేశాలు ఆయుధ ఎంపికలో నాణ్యత, యుద్ధ పరీక్షలపై దృష్టి పెట్టాలి. చైనా తన ఉత్పత్తి ప్రమాణాలను మెరుగుపరచాలి. భారత్‌కు ఈ ఘటనలు స్వయం సమృద్ధి రక్షణ పరిశ్రమకు స్ఫూర్తిగా మారాయి.
A Chinese MLRS system being used in the ongoing Cambodian Thai war has exploded and killed 8 Cambodian soldiers.
Chinese equipment not only failed during the 4-day India-Pakistan war in May 2025 but failed in the ongoing Thailand-Cambodia war too. pic.twitter.com/ksDuVD2xVc
— Baba Banaras™ (@RealBababanaras) December 25, 2025