Drone and a robot dog
China : ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా యుద్ధం చేయాలంటే ఆయుధం కావాలి. అలాగే యుద్ధంలో గెలవాలంటే వ్యూహం ఉండాలి. అవి రెండూ ఉంటే ఎంతటి బలమైన శత్రువును అయినా మట్టి కరిపించగలుగుతాం. అందుకే ప్రపంచంలోని అన్ని దేశాలు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి. టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో సైన్యంలోకి రోబోలను కూడా రంగంలోకి దించుతున్నాయి. రోబో సైన్యాన్నే నిర్మిస్తున్నాయి. ఇప్పటికే మనిషి అందివస్తున్న సాంకేతికతో రోబో డాగ్ వెపన్ తయారు చేశాడు. మనిషి అవసరాల నిమిత్తం అవసరమైతే యుద్ధం చేసే విధంగా కదిలే మెషిన్ గన్ తయారు చేశాడు. ఇటీవల చైనా తయారు చేసిన రోబో డాగ్, డ్రోన్ మధ్య ఫైటింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు చైనా సైన్యం చేసిన విన్యాసాలు ప్రపంచానికి వణుకు పుట్టించేలా ఉన్నాయి. రీసెంటుగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ న్యూక్లియర్, బయోలాజికల్ అండ్ కెమికల్ డిఫెన్స్ డ్రిల్‌లో UAVలు, రోబోటిక్ డాగ్‌లను ప్రదర్శించారు. పొరుగు దేశం చైనా ఇలాంటి రోబోటిక్ డాగ్ లపై దృష్టి పెట్టింది. రోబో సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా డ్రాగన్ కంట్రీ కీలక అడుగు వేసింది.
ఈ రోబోటిక్ డాగ్ లు శత్రువులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాలను రచిస్తాయి. దీని వల్ల యుద్ధాల్లో సైనికుల మరణాలను నిరోధిస్తాయి. గతేడాది కూడా చైనా తన సైన్యంలో భాగమైన రోబోటిక్ డాగ్ ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేసింది. గతేడాది డ్రాగన్ కంట్రీ, కంబోడియా మధ్య ఉమ్మడి సైనిక విన్యాసాల వీడియో బయటకు వచ్చింది. రోబో డాగ్ సామర్థ్యాలను వీడియోలో ప్రదర్శించారు. ఇవి శత్రువుల ఇళ్లలోకి ప్రవేశించి వారిపై దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. చైనా ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుని తన సైన్యాన్ని బలోపేతం చేసుకుంటోంది. మానవరహిత విమానాలు, రోబోటిక్ డాగ్స్ వాటికి ఉదాహరణ.
ఈ రోబోటిక్ డాగ్స్ నడుస్తాయి.. పరిగెత్తుతాయి.. దూకుతాయి కూడా. అవి అస్సాల్ట్ రైఫిళ్లను కూడా సమర్థవంతంగా ఉపయోగిస్తాయి. చైనా సైన్యంలో ఇప్పటికే రెండు రకాల రోబోటిక్ డాగ్స్ ఉన్నాయి. మొదటిది చాలా పవర్ ఫుల్… దీనికి అస్సాల్ట్ రైఫిల్ అమర్చారు. 50 కిలోల బరువున్న ఈ డాగ్ తన టార్గెట్ ట్రాక్ చేస్తున్నప్పుడుడ తన దిశను కూడా మార్చుకుంటుంది. రెండవ రోబో డాగ్ బరువు 15 కిలోలు. దీనిని శత్రువుపై నిఘా పెట్టడానికి.. కొన్నింటిని గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఈ రోబోటిక్ కుక్కలను చైనీస్ స్టార్టప్ కంపెనీ యూనిట్రీ రోబోటిక్స్ అభివృద్ధి చేసింది.
Fireworks battle between a drone and a robot dog. War has just become fullscale battle bots #ai $NVDA #RussiaUkraineWar #UkraineRussiaWar️️ #Drone #China pic.twitter.com/Jhob7HESrR
— ShareBear (@ShareBear1776) January 27, 2025