China Drone : భారత్–చైనా మధ్య మూడేళ్లుగా సఖ్యత చెడిపోయింది. గాల్వన్ ఘటన తర్వాత భారత్ చైనాతో అమీతుమీకి సిద్ధమైంది. గాల్వన్ ఘటనలో భారత్‌కు చెందిన వంద మంది వరకు సైనికులు మృతిచెందారు. చైనావైపు కూడా భారీగానే నష్టం జరిగింది. కానీ చైనా అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఘటన తర్వాత ప్రతీ భారతీయుకూడా చైనా ఉత్పత్తులు వాడడానికి కూడా విముఖత చూపాడు. దీంతో కేంద్రం చైనా ఉత్పత్తులపై సుంఖం పెంచింది. నిషేధం విధించింది. చైనా యాప్స్ బ్యాన్ చేసింది. దీంతో చైనాకు వేల కోట్ల నష్టం జరిగింది. మరోవైపు చైనా తరచూ సరిహద్దులు మారుస్తూ కవ్వింపులకు దిగుతోంది. కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు వెంట బలగాలను మోహరించాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో జరిగి శిఖరాగ్ర సదస్సులో చైనా భారత్ మధ్య సయోధ్య కుదిరింది. సరిహద్దు వెంట ఉద్రిక్తతలు తగ్గించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా బలగాల ఉపసహరణకు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా వారం రోజుల్లో సైనికుల ఉప సంహరణ కూడా పూర్తయింది.
మళ్లీ కవ్వింపు..
రెండు నెలలుగా ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి అధికారుల చర్చలు కూడా జరిగాయి. సమస్యలు పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిపారు. అయితే చైనా తన బుద్ధి కుక్కతోక చందమే అని మరోమారు నిరూపించుకుంది. యుద్ధాల్లో డ్రోన్ల వాడకం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో 2026 నాటికి 10 లక్షల డ్రోన్లను సమకూర్చుకునేందుకు డ్రాగన్ దేశం సిద్ధమైంది. ఈమేరకు ఆర్డర్లు ఇచ్చినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఏఐ(కృత్రిమ మేధ) ఆధారిత తేలికపారి కమికాజ్ డ్రోన్లను చైనా సైన్యం వాస్తవాధీన రేఖ వెంట మోహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే భారత్‌కు పెను సవాల్‌గా మారనుంది.
పాకిస్తాన్‌కు కూడా..
చైనా ఆర్డర్ చేసిన డ్రోన్లలో కొన్ని ఆ దేశ మిత్రుడు అయిన పాకిస్తాన్‌కు కూడా కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంట పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తో చైనా తేలికపాటి డ్రోన్లను మోహరించే అవకాశం ఉండగా, పాకిస్తాన్ కూడా భారత సరిహద్దు వెంట డ్రోన్లు మోహరిస్తుందని తెలుస్తోంది. ఈ ఏఐ కామికేజ్ డ్రోన్లు 8 గంటలపాటు ఆకాశంలో ఎగరగలవు. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ గన్స్ నుంచి ఇవి తప్పించుకునే సామర్థ్యం ఉంది. ఒక్కసారి లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఖచ్చితమైన సమాచారం ఇస్తే సమూహ దాడులు కూడా చేస్తాయి. ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలను అధిగమించేలా రూపొందించబడ్డాయి. భారత్ ఇప్పటికే ఎన్‌ఏసీ వద్ద లేజర్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటరాక్షన్ సిస్టమ్స్ మోహరించింది.