China Technology : టెక్నాలజీలో అమెరికాను మించుతోన్న చైనా.. వైరల్ అవుతున్న కొత్త కార్ల తీరు?

కార్లపై ఉన్న పెయింట్ దెబ్బతినకుండా ఉండడానికి మన దగ్గరనైతే కార్లను నీడలో ఉంచుతాం. అలాగే పక్షులు లేని చోట పెడుతూ ఉంటాం. చైనాలోని కార్లపై ఉన్న పెయింట్ దెబ్బతినకుండా ఉండడానికి వినైల్ పిల్మ్ ని అంటిస్తారు. ఇవి వేయడం వల్ల పెయింట్ కు డోకా ఉండదు. అలాగే కొన్ని వాణిజ్య ప్రకటనలు, అందంగా కనిపించడానికి వీటిని అంటిస్తారు.

Written By: Chai Muchhata, Updated On : ఆగస్ట్ 14, 2024 11:35 ఉద.

China cars in Summer

Follow us on

China Technology : కొత్త టెక్నాలజీని కనుగొనడంలో అమెరికా తరువాత చైనా పేరు చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు డ్రాగన్ దేశం అమెరికానే మించిపోతుంది. వివిధ కొత్త మోడళ్ల కార్లను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ దేశం మిగతా దేశాలకు గట్టి పోటీ ఇస్తోంది. చైనాలో ప్రస్తుతం సమ్మర్ కాలం. అక్కడ ఇప్పుడు 42 డిగ్రీల ఎండ కొడుతుంది. దీంతో వేసవి తీవ్రతను తట్టుకోలేక ప్రజలు చల్లబడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో వాహనాలను కూడా కాపాడుకుంటున్నారు. కానీ కొందరు సౌకర్యాలు లేని వాళ్లు కార్లను ఎండలోనే ఉంచుతున్నారు. అయితే ఎండలో ఎక్కువ సేపు ఎండలో కార్లు కొత్తగా కనిపిస్తున్నాయి. వీటిని చూసి వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఆ కార్లు ఎలా ఉన్నాయంటే?

ఎవరిదైనా బానె పొట్ట పెద్దగా ఉంటే సరదాగా కడుపొచ్చింది.. అని సంభాషిస్తుంటారు. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో ‘కార్లకు కడుపొచ్చింది’ అనే యాష్ ట్యాగ్ తో వైరల్ చేస్తున్నారు. కారు ముందరి భాగం ప్లాట్ గా ఉంటుంది. కానీ ఒక్కసారిగా కొన్ని కార్లు ఉబ్బి పోయాయి. మనిషికి పెరిగిన పొట్ట లాగే కార్లకు అలా ఉండడంతో ఇలా కామెంట్ చేస్తున్నారు. చైనాలో ఇటువంటి కార్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి గురించి అక్కడి వారు కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇవి వైరల్ గా మారుతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా కార్లు ఉబ్బిపోవడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ప్రతీ వేసవి కాలంలో కామనే. మొబైల్ లో బ్యాటరీ చెడిపోతే ఇలాగే ఉబ్బి పోతాయి. మరి కారుకు ఏమైందని ఇలా అవుతుంది? అని చాలా మంది ఈ కార్లను చూడగానే కొశ్చెన్ వేశారు. అయితే ఈ కార్లు అలా ఎందుకు ఉబ్బాయంటే?

కార్లపై ఉన్న పెయింట్ దెబ్బతినకుండా ఉండడానికి మన దగ్గరనైతే కార్లను నీడలో ఉంచుతాం. అలాగే పక్షులు లేని చోట పెడుతూ ఉంటాం. చైనాలోని కార్లపై ఉన్న పెయింట్ దెబ్బతినకుండా ఉండడానికి వినైల్ పిల్మ్ ని అంటిస్తారు. ఇవి వేయడం వల్ల పెయింట్ కు డోకా ఉండదు. అలాగే కొన్ని వాణిజ్య ప్రకటనలు, అందంగా కనిపించడానికి వీటిని అంటిస్తారు. అయితే ఈ వినైల్ ఫిల్మ్ ఎండ వేడికి తట్టుకోలేదు. తీవ్రమైన ఎండ ఉంటే ఇలా ఉబ్బిపోతుంటాయి.

అయితే కొందరు చెబుతున్న ప్రకారం ఇది నకిలీ ఫిల్మ్ అయిందున ఇలా ఉబ్బిపోతాయని ఆటోమోబైల్ కు చెందిన నిపుణులు అంటున్నారు. నాణ్యమైన ఫిల్మ్ వేసుకుంటే ఇలాంటివి ఎదుర్కోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇక ముందు జాగ్రత్తగా కార్లను నీడలో లేదా సేఫ్ ప్లేసులో ఉంచడం వల్ల కార్లు ఉబ్బకుండా ఉంటాయని అంటున్నారు. కొందరు ఈ కార్ల ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇది ఏఐ సృష్టి అని కామెంట్ చేస్తున్నారు. కానీ చైనాలోని కార్లు ఇలా ఉబ్బి కనిపిస్తాయి.

వినైల్ ఫిల్మ్ వేసిన కార్లు అందంగా కనిపిస్తాయి. ప్రత్యేక మైన ఫిల్మ్ ఉన్న కవర్ లాంటిది కారు మొత్తం చుట్టేస్తారు. దీంతో షైనింగ్ కూడా వస్తుంది. ఇదే సమయంలో ఏదైనా వ్యాపార ప్రకటనకు కూడా దీనిపై అంటిస్తారు. అయితే ఇండియాలో వేసవి కాలం ఎక్కువ. అంతేకాకుండా ఇక్కడ కార్లను జాగ్రత్తగా చూసుకుంటారు. అందువల్ల ఈ ఫిల్మ్ వేసుకోవడానికి పెద్దగా సాహసించరు.