China : వేగానికి సరికొత్త కొలమానం.. ఏరోస్పేస్ టెక్నాలజీలో ప్రపంచానికి సరికొత్త పాఠాలు చెబుతున్న చైనా..

ప్రపంచ తయారీ కేంద్రంగా.. కర్మాగారాలకు నెలవుగా చైనా పేరుపొందింది. శాస్త్ర సాంకేతిక రంగాలలోనూ చైనా ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది. అమెరికాకు సాధ్యం కానిది, యూరప్ దేశాలు కనిపెట్టలేనిది.. ఇలా ఎన్నో అద్భుతాలను చైనా ఆవిష్కరించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 3, 2024 5:32 pm

China

Follow us on

China :  చైనా దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకుపోతోంది. అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచం మొత్తాన్ని తన వైపు చూసేలా చేస్తోంది.. కోవిడ్ సమయంలో ప్రపంచం నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ దేశం అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయడం లేదు. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికాను అధిరోహించి.. ఆ స్థానాన్ని ఆక్రమించాలని చైనా భావిస్తోంది. ఇందులో భాగంగానే అనేక రకాల ప్రయోగాలు చేస్తోంది. తాజాగా చైనా దేశానికి చెందిన ఓ ఏరోస్పేస్ సంస్థ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఆ సంస్థ తయారు చేసిన విమానం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఒకవేళ అది అందుబాటులోకి వస్తే గేమ్ చేంజర్ అవుతుంది. చైనా దేశానికి చెందిన స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ అనే విమానయాన సంస్థ ప్రయాణికుల సాలభ్యం కోసం యున్ పింగ్ అనే విమానాన్ని తయారుచేసింది. దీనిని ప్రోటో టైప్ అని వ్యవహరిస్తోంది. దీని టెస్ట్ డ్రైవ్ పూర్తయింది. అది విజయవంతమైంది. వచ్చేయడాది నవంబర్ నెలలో ఇంజన్ పనితీరు నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇది మాక్ 4 వేగంతో పరుగులు పెడుతుంది.. దీని వేగం సూపర్ సోనిక్ విమానం కంటే ఎక్కువ. 1976 నుంచి మొదలు పెడితే 2003 వరకు రూపొందించిన సూపర్ సోనిక్ విమానాలు గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. దానికి మించి ఈ విమానం పరుగులు పెడుతుందని స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ సంస్థ చెబుతోంది.

గంటకు 5000 కిలోమీటర్ల వేగంతో

ఈ విమానం గంటకు ఐదువేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. లండన్ నుంచి న్యూయార్క్ నగరానికి చేరుకోవడానికి 1.5 గంటల సమయం మాత్రమే పడుతుంది. కాంకర్డ్ విమానం ట్రాన్స్ అట్లాంటిక్ దారిలో ప్రయాణించడానికి రెండు గంటల 53 నిమిషాలు పట్టింది. ఇక సాధారణ విమానాలకు అయితే ఎనిమిది గంటల దాకా పడుతుంది. అయితే స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే కాకుండా ఇతర సంస్థలు కూడా వాణిజ్య విభాగంలో సూపర్ సోనిక్ విమానయానాన్ని పున: ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విమానంపై దక్షిణచైనా కేంద్రంగా వెలుపడే మార్నింగ్ పోస్ట్ పత్రిక విశ్లేషణాత్మక కథనాన్ని వెల్లడించింది. ” 2027 నాటికి ప్రయాణికుల కోసం పూర్తిస్థాయిలో సూపర్ సోనిక్ జెట్ విమానాన్ని అందుబాటులోకి తెస్తారు. అని అనుకున్నట్టు జరిగితే 2003లో ప్రవేశపెట్టిన కాంకర్డ్ సూపర్ సోనిక్ విమానం తర్వాత.. 25 సంవత్సరాల అనంతరం ప్రయాణికులను వేగంగా గమ్యస్థానానికి తీసుకెళ్లగలిగే మొదటి సూపర్ సోనిక్ ఎయిర్ లైనర్ గా స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ నిలుస్తుంది. ఇక అమెరికా కేంద్రంగా వీనస్ ఏరోస్పేస్ మాక్ -6 వేగాన్ని అధిరోహించే గల సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. దీనివల్ల హైపర్ సోనిక్ ఎకానమీ సాధ్యమవుతుంది. ఈ విభాగంలో స్పేస్ ఎక్స్ సీఈవో మస్క్ పెట్టుబడును పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తు కాలంలో ఇది మరింత కొత్త పుంతలు తొక్కే అవకాశం కనిపిస్తోందని” సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.